అన్వేషించండి

నిండా పదేళ్లు లేవు, కానీ 50 దేశాలు చుట్టొచ్చింది - ఒక్క రోజు కూడా స్కూల్ ఎగ్గొట్టలేదు

Aditi Tripathi: భారత సంతతికి చెందిన యూకేలోని పదేళ్ల అదితి త్రిపాఠి 50 దేశాలు చుట్టొచ్చింది.

 Aditi Tripathi: 

అదితి త్రిపాఠి కథ ఇది..

ఓ పదేళ్ల బాలిక 50 దేశాలు చుట్టొచ్చింది. అది కూడా ఒక్క రోజు కూడా స్కూల్ ఎగ్గొట్టకుండా. ఇదెలా సాధ్యం..? అది తెలుసుకోవాలంటే మొత్తం కథ తెలుసుకోవాలి. ఈ బాలిక పేరు అదితి త్రిపాఠి. Yahoo Life వెల్లడించిన వివరాల ప్రకారం..అదితి సౌత్‌ లండన్‌లో ఉంటోంది. తల్లిదండ్రులు దీపక్, అవిలాష. భారత సంతతికి చెందిన వీళ్లిద్దరికీ ప్రపంచ దేశాలు చుట్టి రావడం ఓ అలవాటు. ఇప్పటికే యూరప్ అంతా తిరిగేశారు. నేపాల్, సింగపూర్, థాయ్‌లాండ్‌ కూడా చుట్టొచ్చారు. వాళ్లు తిరగడమే కాదు. కూతురిని కూడా తమతో పాటు తీసుకెళ్లాలని అనుకున్నారు. ప్రపంచంలోని విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు..ఇలా అన్నింటినీ పరిచయం చేయాలనే ఉద్దేశంతో కూతురిని వెంట పెట్టుకుని అన్ని దేశాల్లో పర్యటించారు. మరి ఇలా తిరుగుతూ ఉంటే ఎడ్యుకేషన్‌కి ఇబ్బంది అవుతుందన్న డౌట్ వచ్చింది. వెంటనే ఇద్దరూ ఓ ప్లాన్ వేసుకున్నారు. తన చదువుకి ఎలాంటి డిస్టర్బెన్స్ రాకుండా స్కూల్‌కి సెలవున్న రోజు మాత్రమే ట్రావెల్ చేసేలా ప్లాన్ చేసుకున్నారు. బ్యాంక్‌ హాలిడేస్‌లలోనూ తిరిగారు. ఏడాది పాటు ఇలా తిరుగుతూనే ఉన్నారు. 50 దేశాలు చుట్టొచ్చారు. ఇందుకోసం అక్షరాలా రూ.21 లక్షలు ఖర్చు చేశారు. కానీ...తాము ఖర్చు పెట్టిన ప్రతి పైసాకి తగిని ఎక్స్‌పీరియెన్స్‌ని సంపాదించుకున్నామని చెబుతోంది ఈ జంట. 

" మా కూతురితో కలిసి నేపాల్, ఇండియా, థాయ్‌లాండ్‌ తిరిగాం. అక్కడి కల్చర్‌ని చూసి తను చాలా ఎగ్జైట్ అయింది. తనకు మూడేళ్లు ఉన్నప్పటి నుంచే ఇలా విదేశాల పర్యటన మొదలు పెట్టాం. వారానికి రెండున్న రోజులు స్కూల్‌కి వెళ్లేలా ప్లాన్ చేసుకున్నాం. ఒక్కోసారి తనను స్కూల్‌ నుంచి పికప్ చేసుకుని నేరుగా ఫ్లైట్ ఎక్కి వేరే దేశానికి వెళ్లిపోతాం"

- అవిలాష, అదితి త్రిపాఠి తల్లి

ట్రిప్స్ కోసమే సేవింగ్స్..

ఇంత ఖర్చు ఎలా పెడుతున్నారు..? అని డౌట్ రావడం సహజమే. ఈ ఇద్దరూ అకౌంటెట్స్‌లా  పని చేస్తున్నారు. ఈ ట్రిప్స్‌ కోసం ప్రత్యేకంగా సేవింగ్స్ పెట్టుకుంటారు. బయట తినకుండా ఖర్చులు తగ్గించుకుంటారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌నే వాడతారు. సొంత కార్ కూడా లేదు. ఇక ప్రయాణ ఖర్చులు తగ్గించుకోడానికి వర్క్‌ఫ్రమ్ హోమ్ చేస్తారు. ఇలా పక్కా ప్లాన్‌తో ట్రిప్‌లు వేస్తోంది ఈ ఫ్యామిలీ. 

"నా ఫేవరెట్ కంట్రీ ఏంటి అంటే స్పెసిఫిక్‌గా చెప్పలేను. కానీ...నేపాల్, జార్జియా, అర్మేనియా చాలా బాగా నచ్చాయి. నేపాల్ అయితే బాగా నచ్చింది. అక్కడే హార్స్ రైడ్ చేశాను. కేబుల్‌ కార్‌లో ట్రావెల్ చేశాను. అక్కడి నుంచే ఎవరెస్ట్ శిఖరాన్ని చూశాను. ట్రావెల్ అంటే నాకు చాలా ఇష్టం. సోషల్ స్కిల్స్‌ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఇలాంటి ట్రిప్స్ వేయడం మంచిదే. మిగతా పిల్లలు కూడా నాలా ట్రావెల్ చేయాలని కోరుకుంటున్నాను. నాకు మూడేళ్లప్పుడు జర్మనీ ట్రిప్‌కి వెళ్లాను. ఆ తరవాత ఫ్రాన్స్ , ఇటలీ, ఆస్ట్రియా కూడా వెళ్లాను. "

- అదితి త్రిపాఠి

Also Read: బీజేపీతో కలిసేందుకు జేడీఎస్ ఆసక్తి, NDAలో చేరడంపై మాత్రం సస్పెన్స్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget