అన్వేషించండి

మీటింగ్‌కి షర్ట్ లేకుండా వచ్చి షాక్ ఇచ్చిన ఆఫీసర్, సస్పెండ్ చేసిన అధికారులు

Shirtless Officer: యూపీలో ఓ అధికారి చొక్కా లేకుండా మీటింగ్‌కి హాజరై సస్పెండ్ అయ్యాడు.

Shirtless Officer:

యూపీలో ఘటన..

యూపీలో ఓ అధికారి మీటింగ్‌కి షర్ట్ లేకుండా వచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు. ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌కి చెందిన ఆఫీసర్‌ కేవలం బనీన్ వేసుకుని ఆఫీస్‌కి వచ్చేశాడు. దీనిపై సీరియస్ అయిన ఉన్నతాధికారులు వెంటనే సస్పెండ్ చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడే సమయంలో ఇలా బనీన్‌తో దర్శనమిచ్చాడు. ఎంతో ముఖ్యమైన రివ్యూ మీటింగ్‌కి ఇలా వస్తారా..? అంటూ మండి పడ్డారు సీనియర్ అధికారులు. స్పెషల్ ప్రాజెక్ట్‌లపై డిస్కస్ చేసేందుకు మీటింగ్ పెట్టారు. ఆ అధికారి బనీన్‌తో వచ్చి కూర్చోవడం వల్ల మిగతా అధికారులంతా చాలా ఇబ్బంది పడ్డారు. అందుకే సస్పెండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆ అధికారి ఏ జిల్లాకు చెందిన వాడు అన్నదీ స్పష్టంగా తెలియరాలేదు. ఇప్పటికే విద్యాశాఖ దీనిపై చాలా సీరియస్‌గా ఉంది. వెంటనే విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించింది. ఇంకెప్పుడూ ఇలాంటివి జరగకుండా చూడాలని వార్నింగ్ కూడా ఇచ్చింది. ఎన్ని రోజుల పాటు ఆ అధికారిని సస్పెండ్ చేస్తారన్నది తేలాల్సి ఉంది. 

పైలట్‌ల సస్పెన్షన్..

విమానం నడపడం అంత ఈజీ కాదు. ఎన్నో జాగ్రత్తలు పాటించాలి. ఎప్పటికప్పుడు కంట్రోల్‌ సెంటర్‌తో కమ్యునికేట్ అవ్వాలి. వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నో గమనించుకోవాలి. ఇంత అప్రమత్తంగా ఉండాల్సిన పైలట్‌లు కాక్‌పిట్‌లో కూర్చుని విమానం నడుపుతూ స్నాక్స్ తింటే..? మరీ అంత నిర్లక్ష్యంగా ఉంటారా అన్న అనుమానం అక్కర్లేదు. ఈ ఏడాది మార్చిలో Spicejet ఎయిర్‌లైన్స్‌లో ఇదే జరిగింది. హోళి రోజున ఢిల్లీ నుంచి గువాహటికి వస్తున్న ఫ్లైట్‌లోని పైలట్‌లు కాఫీ, స్నాక్స్ తిన్నారు. అక్కడితో ఆగకుండా వాటిని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆలస్యంగా గ్రహించిన అధికారులు వెంటనే ఇద్దరి పైలట్‌లను విధుల నుంచి తొలగించారు. కాక్‌పిట్‌లో తినడం నిబంధనలకు విరుద్ధమని తేల్చి చెప్పారు. ఇప్పటికే ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. కాక్‌పిట్‌లో ఆహార పదార్థాలను నిల్వ ఉంచినా, వాటిని తిన్నా నేరంగానే పరిగణిస్తామని స్పైస్‌జెట్ ప్రతినిధి వెల్లడించారు. అందరూ ఈ రూల్‌ని కచ్చితంగా అనుసరించాలని అన్నారు. విచారణ పూర్తయ్యాక పైలట్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అప్పటి వరకూ వాళ్లను విధుల నుంచి తొలగించారు. కాఫీ గ్లాస్‌ను కన్సోల్‌పై ఉంచారని, ఒక్క చుక్క దానిపై పడినా ఎయిర్‌ క్రాఫ్ట్‌కు భారీ డ్యామేజ్ జరిగే ప్రమాదముందని వివరించారు స్పైస్‌జెట్ ప్రతినిధులు. దాదాపు 37 వేల అడుగుల ఎత్తులో విమానం ఉన్నప్పుడు ఇలాంటి సాహసాలు చేయడమేంటని మండి పడ్డారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Raghav Chadha: ఆమ్‌ఆద్మీ పార్టీ యాక్షన్‌కు రాఘవ్ చద్దా స్ట్రాంగ్ రియాక్షన్! గొంతు నొక్కుతున్నారా అంటూ క్వశ్చన్స్!
ఆమ్‌ఆద్మీ పార్టీ యాక్షన్‌కు రాఘవ్ చద్దా స్ట్రాంగ్ రియాక్షన్! గొంతు నొక్కుతున్నారా అంటూ క్వశ్చన్స్!
Tamil Nadu Elections 2026: విజయ్ డబుల్ రోల్ వ్యూహం - తమిళనాడు రాజకీయాల్లో సాహసమా లేక తప్పిదమా?
విజయ్ డబుల్ రోల్ వ్యూహం - తమిళనాడు రాజకీయాల్లో సాహసమా లేక తప్పిదమా?
మహాకాళేశ్వర్ ఆలయంలో పొరపాటు చేసిన అక్షయ్ కుమార్ - ఏ శివాలయానికి వెళ్లినా మీరు ఆ పొరపాటు చేయకండి!
మహాకాళేశ్వర్ ఆలయంలో పొరపాటు చేసిన అక్షయ్ కుమార్ - ఏ శివాలయానికి వెళ్లినా మీరు ఆ పొరపాటు చేయకండి!
Life of Jesus : యేసు మరణం గుడ్ ఫ్రైడే, జననం క్రిస్మస్.. మరి ఈస్టర్? జీసస్ గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలివే  
యేసు మరణం గుడ్ ఫ్రైడే, జననం క్రిస్మస్.. మరి ఈస్టర్? జీసస్ గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలివే  

వీడియోలు

Arjun Tendulkar Comments on Mumbai Indians | ముంబై ఇండియన్స్ పై అర్జున్ టెండూల్కర్ కామెంట్స్ | ABP Desam
Jadeja Breaks Silence on MS Dhoni | ధోనీపై జడేజా సంచలన వ్యాఖ్యలు | ABP Desam
IPL 2026 DC VS LSG Highlights | ఆల్ రౌండ్ షోతో బోణీ కొట్టిన ఢిల్లీ | ABP Desam
Rishabh Pant LSG vs Delhi Capitals IPL 2026 | లక్నో సూపర్ జెయింట్స్ ఓటమికి కారణం అదేనా | ABP Desam
NASA Artemis 2 Mission Launch | 50 ఏళ్ల తర్వాత మళ్ళీ చంద్రుడిపైకి మానవుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Raghav Chadha: ఆమ్‌ఆద్మీ పార్టీ యాక్షన్‌కు రాఘవ్ చద్దా స్ట్రాంగ్ రియాక్షన్! గొంతు నొక్కుతున్నారా అంటూ క్వశ్చన్స్!
ఆమ్‌ఆద్మీ పార్టీ యాక్షన్‌కు రాఘవ్ చద్దా స్ట్రాంగ్ రియాక్షన్! గొంతు నొక్కుతున్నారా అంటూ క్వశ్చన్స్!
Telangana Rythu Bharosa Scheme Update: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్- ఈ నెలలోనే రైతు భరోసా విడుదల!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్- ఈ నెలలోనే రైతు భరోసా విడుదల!
YSRCP No friends: మిత్రులే లేని వైసీపీ - బీఆర్ఎస్ కూడా హ్యాండ్ - జగన్ రాజకీయం ఇంత తేడానా?
మిత్రులే లేని వైసీపీ - బీఆర్ఎస్ కూడా హ్యాండ్ - జగన్ రాజకీయం ఇంత తేడానా?
Tamil Nadu Elections 2026: విజయ్ డబుల్ రోల్ వ్యూహం - తమిళనాడు రాజకీయాల్లో సాహసమా లేక తప్పిదమా?
విజయ్ డబుల్ రోల్ వ్యూహం - తమిళనాడు రాజకీయాల్లో సాహసమా లేక తప్పిదమా?
Abhishek Sharma: SRH స్టార్ అభిషేక్ శర్మపై క్రమశిక్షణ చర్యలు ! ఫీజులో కోత, డీమెరిట్‌ పాయింట్‌ ఇచ్చిన బీసీసీఐ!
SRH స్టార్ అభిషేక్ శర్మపై క్రమశిక్షణ చర్యలు ! ఫీజులో కోత, డీమెరిట్‌ పాయింట్‌ ఇచ్చిన బీసీసీఐ!
Bandla Ganesh : బండ్ల గణేష్ ఇంట పెళ్లి సందడి - కాబోయే అల్లుడిని ఇంట్రడ్యూస్ చేసిన ఫేమస్ ప్రొడ్యూసర్
బండ్ల గణేష్ ఇంట పెళ్లి సందడి - కాబోయే అల్లుడిని ఇంట్రడ్యూస్ చేసిన ఫేమస్ ప్రొడ్యూసర్
Biker Movie Review - 'బైకర్' రివ్యూ: తండ్రీ కుమారుల కథ ఎలా ఉంది? 'నారీ నారీ...' తర్వాత శర్వానంద్ మరో సక్సెస్ కొట్టారా?
'బైకర్' రివ్యూ: తండ్రీ కుమారుల కథ ఎలా ఉంది? 'నారీ నారీ...' తర్వాత శర్వానంద్ మరో సక్సెస్ కొట్టారా?
Kaleshwaram Politics: కాళేశ్వరంపై రేవంత్ వాదననే వినిపిస్తున్నకేంద్రం - బీఆర్ఎస్‌ ఉక్కిరిబిక్కిరి -ఎదురుదాడి ఎలా?
కాళేశ్వరంపై రేవంత్ వాదననే వినిపిస్తున్నకేంద్రం - బీఆర్ఎస్‌ ఉక్కిరిబిక్కిరి -ఎదురుదాడి ఎలా?
Embed widget