Manipur Violence: మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస, 9 మంది మృతి - కొందరికి తీవ్ర గాయాలు
Manipur Violence: మణిపూర్‌లో అర్ధరాత్రి జరిగిన హింసలో 9 మంది మృతి చెందారు.
Manipur Violence:
9 మంది మృతి..
మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు ఆగడం లేదు. కేంద్ర సాయుధ బలగాలతో పాటు పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితులు అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నా...అది సాధ్యం కావడం లేదు. గత 24 గంటల్లో జరిగిన అల్లర్లలో దాదాపు 9 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు వెల్లడించారు. మృతుల్లో ఓ మహిళ కూడా ఉంది. ఖమేన్లోక్ ఏరియాలో అర్ధరాత్రి పూట ఉన్నట్టుండి ఫైరింగ్ జరిగింది. 9 మంది అక్కడికక్కడే చనిపోగా...కొందరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డ వారి శరీరాలపై లోతైన గాయాలున్నట్టు వైద్యులు వెల్లడించారు. బులెట్ గాయాలు కూడా ఉన్నట్టు తెలిపారు. దాదాపు నెల రోజులుగా గిరిజన, గిరిజనేతర వర్గాల మధ్య ఘర్షణ జరుగుతోంది. ఈ ఘటనతో మరోసారి కర్ఫ్యూ విధించారు పోలీసులు. పలు చోట్ల కఠిన ఆంక్షలు విధించారు. ఇంఫాల్, కంగ్పోక్పి సరిహద్దులోని ఖమేన్లోక్లో హింస చెలరేగుతోంది. దాదాపు రెండు రోజులుగా ఇక్కడి వాతావరణం వేడిగానే ఉంది. ఇప్పటి వరకూ మణిపూర్‌లోని హింసాత్మక ఘటనల కారణంగా దాదాపు 100 మంది చనిపోయినట్టు అంచనా.
Manipur | 9 people have been killed and 10 others injured in fresh violence this morning in Khamenlok area, Imphal East. Postmortem procedure underway: Shivkanta Singh, SP Imphal East
— ANI (@ANI) June 14, 2023
ఇంటర్నెట్ బంద్..
రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవల్ని బంద్ చేశారు. కొన్ని చోట్ల ఆందోళనకారులు వాహనాలకు నిప్పు పెడుతున్నారు. ఇళ్లపై దారుణంగా దాడులు చేస్తున్నారు. ఒకరినొకరు కాల్చుకుంటున్నారు. ఎక్కడ చూసినా భయానక వాతావరణమే కనిపిస్తోంది.అటు కేంద్రమంత్రి అమిత్‌షా ఎప్పటికప్పుడు ఇక్కడి పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ...మణిపూర్ సీఎం బైరెన్ సింగ్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న హింసపై పూర్తి స్థాయిలో ఓ రిపోర్ట్ తయారు చేసి అమిత్‌షాకి పంపుతానని హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 349 రిలీఫ్ క్యాంప్‌లు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకూ 4,537 ఆయుధాలను దొంగిలించారు ఆందోళకారులు. వీటిలో 990 ఆయుధాలను పోలీసులు రికవర్ చేసుకున్నారు. శాంతి భద్రతలు కాపాడేందుకు అవసరమైన చర్యలన్నీ తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. పోలీసులతో పాటు భద్రతా బలగాలూ నిఘా పెడుతున్నాయి. జాయింట్ కూంబింగ్ ఆపరేషన్ చేపడుతున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మణిపూర్ పర్యటనకు వెళ్లి అక్కడి అధికారులతో కీలక సమావేశాలు నిర్వహించారు. పరిస్థితులు సమీక్షించారు. ఈ క్రమంలోనే పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు ఓ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. హైకోర్ట్ రిటైర్డ్ జడ్జ్ నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు."మణిపూర్‌లోని పరిస్థితులను గమనించాను. సీఎం బైరెన్ సింగ్‌తో మాట్లాడాను. మణిపూర్‌లో శాంతియుత వాతావరణం నెలకొనేలా చేయడమే మా లక్ష్యం. నేను గమనించిన ప్రతి విషయాన్నీ కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకి వివరిస్తాను. అవసరమైన చర్యలు తీసుకునేలా నా వంత ప్రయత్నం చేస్తాను"
- హిమంత బిశ్వ శర్మ, అసోం సీఎం
Also Read: పడవ బోల్తా పడి 100 మందికి పైగా మృతి, పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం