అన్వేషించండి

Yogi Adityanath: మాట వినకపోతే క్రమశిక్షణలో పెట్టడానికి మరో పద్ధతిని అనుసరిస్తాం - రోడ్లపై ప్రార్థనలు చేసే వారికి యూపీ సీఎం వార్నింగ్

Namaz On Roads: యూపీలో ట్రాఫిక్ ఆపేసి ప్రార్థనలు చేసే ముస్లింల తీరుపై యూపీ సీఎం అసహన ంవ్యక్తం చేశారు. దానికి ఆయన పరిష్కారం చెప్పారు. మాట వినకపోతే తమ పద్దతిని తాము అనుసరిస్తామని హెచ్చరించారు.

Yogi Adityanath Statement Namaz On Roads : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బహిరంగ ప్రదేశాల్లో మతపరమైన ప్రార్థనల నిర్వహణపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. లక్నోలో సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రోడ్లపై నమాజ్ నిర్వహించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, అది ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించడమే కాకుండా సామాన్య ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తుందని స్పష్టం చేశారు. రోడ్లు అనేవి ప్రజల రాకపోకల కోసం నిర్దేశించినవని, వాటిని మతపరమైన కూడళ్లుగా లేదా ప్రార్థనా స్థలాలుగా మార్చి ప్రజా జీవనాన్ని స్తంభింపజేసే హక్కు ఎవరికీ లేదని ఆయన తేల్చిచెప్పారు.

ఉత్తరప్రదేశ్‌లో ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ..  యూపీలో రోడ్ల మీద నమాజ్ చదవడం నిజంగా ఆగిపోయిందా  అని నన్ను తరచూ అడుగుతుంటారు. నేను స్పష్టంగా చెబుతున్నాను, ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడా రోడ్లపై నమాజ్ జరగడం లేదు, కావాలంటే మీరే వెళ్లి చూడండి అని యోగి వ్యాఖ్యానించారు. బహిరంగ రహదారులపై లేదా ప్రధాన కూడళ్ల వద్ద జనం గుమిగూడి ట్రాఫిక్ నిలిపివేయడం చట్టవిరుద్ధమని, క్రమశిక్షణ పాటించని పక్షంలో యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తుందని ఆయన పరోక్షంగా హెచ్చరించారు.

ప్రార్థనలు చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉంటే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని ముఖ్యమంత్రి సూచించారు. జనం ఎక్కువగా ఉన్నప్పుడు ఎలా సాధ్యమని కొందరు నన్ను అడిగారు. అప్పుడు నేను చెప్పాను.. షిఫ్టుల పద్ధతిలో ప్రార్థనలు చేసుకోండి అని. ఇంట్లో లేదా ప్రార్థనా మందిరాల్లో స్థలం లేకపోతే, సమయాన్ని విభజించుకుని పద్ధతిగా నిర్వహించుకోవాలి తప్ప, రోడ్ల మీదకు వచ్చి అనవసరంగా రద్దీని పెంచకూడదు అని ఆయన హితవు పలికారు. మతపరమైన ఆచారాలు ఇతరులకు ఇబ్బంది కలిగించనంత వరకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన స్పష్టం చేశారు.

ప్రజా శాంతిని కాపాడే విషయంలో తమ ప్రభుత్వం కఠినంగా ఉంటుందని చెబుతూనే, చర్చలు , అవగాహన ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని యోగి ఆదిత్యనాథ్ అభిప్రాయపడ్డారు.  మేము ప్రేమతో, మాటలతో మిమ్మల్ని ఒప్పించే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ మాట వినకపోతే, క్రమశిక్షణలో పెట్టడానికి మరో పద్ధతిని అనుసరిస్తాం  అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. మతపరమైన పట్టింపుల కంటే ప్రజల ఉమ్మడి ప్రయోజనాలు ,  పౌర క్రమశిక్షణే ముఖ్యమని ఆయన నొక్కి చెప్పారు.    

 ఉత్తరప్రదేశ్ నమూనాలో బహిరంగ ప్రదేశాల్లో క్రమశిక్షణను అమలు చేయడం ద్వారా దేశవ్యాప్తంగా ఒక సందేశాన్ని పంపాలని యోగి సర్కార్ యోచిస్తోంది. రహదారులపై ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడటం ద్వారా రవాణా వ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా, మతపరమైన ఊరేగింపులు లేదా ప్రార్థనలు ప్రజల దైనందిన జీవితానికి అడ్డంకిగా మారకూడదన్నది ముఖ్యమంత్రి ప్రధాన ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. పారదర్శకమైన పాలన , కఠినమైన చట్ట అమలుతో రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడతామని ఆయన చెబుతున్నారు.  


 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Independence Day 2026 : స్వాతంత్య్ర దినోత్సవం 2026 చరిత్ర, ప్రాముఖ్యత.. ఆగస్టు 15నే ఎందుకు జరుపుకుంటామంటే
స్వాతంత్య్ర దినోత్సవం 2026 చరిత్ర, ప్రాముఖ్యత.. ఆగస్టు 15నే ఎందుకు జరుపుకుంటామంటే
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Kerala Influencer Akhil Megha: కేరళం సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ జంటకు దిష్టి తగిలేసిందా? బస్సు క్లీనర్‌తో భార్య పరార్‌! బోరుమంటున్న భర్త!
కేరళం సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ జంటకు దిష్టి తగిలేసిందా? బస్సు క్లీనర్‌తో భార్య పరార్‌! బోరుమంటున్న భర్త!
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget