అన్వేషించండి

China Mega Projects: పర్వతం పైన అద్భుతం - ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ నిర్మించిన చైనా - ఈ వీడియో చూస్తే ఏఐ అనుకుంటారు!

Chongqing East Station: అసాధ్యమైన విషయాలను ఊహాలుగా మారిస్తే ఏఐ అవుతుంది. కానీ అలాంటి అసాధ్యాలను చైనా సుసాధ్యం చేస్తుంది.

Engineering Marvel Chaina Railway Station:  ఇంజనీరింగ్ అద్భుతాలకు పెట్టింది పేరు చైనా. తాజాగా నైరుతి చైనాలో రూ. 65 వేల కోట్ల  వ్యయంతో నిర్మించిన  చోంగ్‌కింగ్ ఈస్ట్ స్టేషన్  ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఒక భారీ పర్వత శిఖరంపై, అత్యంత కష్టతరమైన భౌగోళిక పరిస్థితుల్లో  1.22 మిలియన్ చదరపు మీటర్ల  విస్తీర్ణంలో దీనిని నిర్మించారు. కేవలం 38 నెలల రికార్డు సమయంలో 40,000 మంది కార్మికులు రాత్రింబవళ్లు శ్రమించి ఈ మెగా ప్రాజెక్టును పూర్తి చేయడం చైనా నిర్మాణ వేగానికి నిదర్శనంగా నిలుస్తోంది.

 నేలపై నిర్మించి.. ఆకాశంలోకి ఎక్కించి! 

ఈ స్టేషన్ నిర్మాణంలో అత్యంత క్లిష్టమైన ఘట్టం దాని భారీ స్టీల్ రూఫ్ అమరిక. సుమారు  16,500 టన్నుల బరువున్న  స్టీల్ ట్యూబ్ ట్రస్ రూఫ్‌ను ముందుగా నేలపైనే అసెంబుల్ చేశారు. అనంతరం హైడ్రాలిక్ లిఫ్టింగ్ టెక్నాలజీని ఉపయోగించి, 57 మీటర్ల ఎత్తుకు చాలా జాగ్రత్తగా స్లైడింగ్ చేస్తూ అమర్చారు. ఇంతటి భారీ బరువును భూమికి 50 మీటర్ల పైకి చేర్చడం ఆధునిక ఇంజనీరింగ్ చరిత్రలోనే ఒక గొప్ప ప్రయోగంగా నిలిచింది. పర్వత వాలుపై 57 మీటర్ల ఎత్తులో స్టెయిన్‌లెస్ స్టీల్ క్లాడింగ్ ఇన్‌స్టాలేషన్ చేయడం మరో సాహసోపేతమైన ప్రక్రియ. ఈ వీడియోను ఎలాన్ మాస్క్ పంచుకోవడంతో వైరల్ గా మారింది.    

 భూకంపాలను తట్టుకునే  హువాంగ్జీ స్తంభాలు 

చోంగ్‌కింగ్ నగర చిహ్నమైన హువాంగ్జీ వృక్షం ఆకారంలో ఈ స్టేషన్ పిల్లర్లను రూపొందించారు.  41 మీటర్ల ఎత్తు  ఉండే ఈ బ్రాంచింగ్ స్టీల్ స్ట్రక్చర్స్ కేవలం అందం కోసమే కాదు, భారీ భూకంపాలను సైతం తట్టుకునేలా అత్యంత దృఢంగా నిర్మించబడ్డాయి. చెట్టు కొమ్మల్లా విస్తరించి ఉండే ఈ స్తంభాలు స్టేషన్ లోపలి భాగంలో సహజమైన వెలుతురు వచ్చేలా, పైకప్పు బరువును సమానంగా పంపిణీ చేసేలా డిజైన్ చేశారు. 

ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే హబ్ 

విస్తీర్ణం పరంగా చూస్తే, చోంగ్‌కింగ్ ఈస్ట్ స్టేషన్ ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే హబ్‌గా రికార్డు సృష్టించింది. ఇది కేవలం రైల్వే స్టేషన్ మాత్రమే కాదు, బహుళ రవాణా వ్యవస్థల   సంగమం. నైరుతి చైనాను దేశంలోని మిగిలిన ప్రాంతాలతో అనుసంధానిస్తూ, ఏకకాలంలో వేల మంది ప్రయాణికులకు సేవలు అందించేలా దీని సామర్థ్యాన్ని పెంచారు. పర్వత ప్రాంతంలో ఇంతటి భారీ నిర్మాణం చేపట్టడం ద్వారా చైనా తన పారిశ్రామిక శక్తిని మరోసారి చాటిచెప్పింది.

 14 నగరాలకు హై-స్పీడ్ కనెక్టివిటీ 

ఈ స్టేషన్ అందుబాటులోకి రావడంతో చైనాలోని 14 ప్రధాన నగరాలకు హై-స్పీడ్ రైలు ప్రయాణం సులభతరం కానుంది. చైనా తన హై-స్పీడ్ రైల్ నెట్‌వర్క్‌ను మరింత విస్తృతం చేస్తూ, మారుమూల పర్వత ప్రాంతాలను సైతం మెట్రో నగరాలతో వేగంగా అనుసంధానిస్తోంది. ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడంలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషించనుంది. ఇంజనీరింగ్ నైపుణ్యం, ఆధునిక సాంకేతికత కలిస్తే పర్వతాల పైన కూడా అద్భుతాలు సృష్టించవచ్చని చోంగ్‌కింగ్ ఈస్ట్ స్టేషన్ నిరూపించింది.

టాప్ హెడ్ లైన్స్

Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
US Iran War: ధరలు పెరిగినా సరే పెట్రోల్ కోనుగోలు చేయండి.. అమెరికన్లకు ట్రంప్ హుకుం
ధరలు పెరిగినా సరే పెట్రోల్ కోనుగోలు చేయండి.. అమెరికన్లకు ట్రంప్ హుకుం
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Embed widget