By: ABP Desam | Updated at : 20 Aug 2021 05:49 PM (IST)
చైనాలో ముగ్గురు పిల్లల్ని కంటే ఆర్థిక ప్రయోజనాలు
ఒక జంట ఒకరికి మాత్రమే జన్మనివ్వాలి.. పొరపాటున రెండో బిడ్డ కంటే వారి బతుకు దుర్భరమే. చైనాలో నిన్నామొన్నటిదాకా అది పరిస్థితి. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ముగ్గుర్ని కనండి అని ప్రభుత్వం ప్రజల్ని బతిమాలుతోంది. కానీ ప్రజలు మాత్రం పెరిగిపోయిన ఖర్చుల్ని చూసుకుని పిల్లల్ని పెంచలేమని వెనుకడుగు వేస్తున్నారు. దీంతో చైనా ప్రభుత్వం.. పిల్లల్ని కంటే రూపాయి ఖర్చు ఉండదని వారికయ్యే ఖర్చంతా తాము భరిస్తామని కొత్తగా ఓ విధానాన్ని ప్రకటించింది.
ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా గల దేశం చైనా. జనాభా పెరిగిపోతుందన్న ఉద్దేశంతో మూడు దశాబ్దాల పాటు ఒక జంటకు ఒకే బిడ్డ అనే నిబంధనను చైనా అమలు చేసింది. కానీ జనాభాలో వృద్ధుల శాతం పెరిగిపోవడం... పని చేసేవారి సంఖ్య తగ్గిపోతూండటంతో ఆందోళనతో.. ఐదేళ్ల క్రితం ఒకే సంతానం విధానాన్ని మార్చింది. ఇద్దరు పిల్లల్ని కనేందుకు అనుమతిచ్చింది. కానీ ప్రజలు మాత్రం ఒక్కరు చాలని సరి పెట్టుకుంటున్నారు. దాంతో జనాభా వృద్ధి రేటులో ఆశించిన ఫలితాలు రావడం లేదు. చివరికి ముగ్గురు పిల్లల విధానాన్ని ప్రకటించారు. చైనా జనాభా వృద్ధి రేటుఅరశాతం కూడా లేదు. ఇద్దరు పిల్లలను కనొచ్చంటూ ప్రకటన చేసినా.. ఆశించిన స్థాయిలో వృద్ధి రేటు లేకపోవడంతో.. ముగ్గురు సంతానం నిర్ణయాన్ని తీసుకుంది.
ఇదే పద్దతిలో ఉంటే భవిష్యత్‌లో తీవ్రమైన మానవ వనరుల కొరత ఏర్పడుతుందన్న భయం చైనా పాలకుల్లో ప్రారంభమయింది. 2019 జనాభా లెక్కల సగటును పరిశీలిస్తే ప్రతి వెయ్యి మందికి 10.48 మంది మాత్రమే పిల్లలు జన్మనిస్తున్నట్లు నిర్దారణ అయింది. ఐదేళ్లుగా జననాల రేటు తగ్గుతూపోతుండడంతో తీవ్రంగా ఆందోలన చెందుతున్న చైనా ముగ్గురు పిల్లలకు అనుమతించింది. కానీ చైనా ప్రజలు ముగ్గురు పిల్లల్ని కనేందుకు ఆసక్తి చూపించడం లేదు. దానికి కారణం పెంచలేమనే ఆందోళనే. విపరీతంగా ఖర్చులు పెరిగిపోవడంతో ఒకర్ని బాగా పెంచితే చాలని అనుకుంటున్నారు. దీంతో జనాభా పెరుగుదల కష్టమని భావించిన చైనా అధ్యక్షుడు పిల్లల పెంపకం బాధ్యతల్లో పాలు పంచుకోవాలని నిర్ణయించుకున్నారు.
చైనాలో ముగ్గురు పిల్లల్ని కంటే.. వారికి అయ్యే ఖర్చులను చైనా ప్రభుత్వం భరిస్తుంది. సామాజిక, ఆర్థిక మద్దతును చైనా ప్రభుత్వం ముగ్గురు పిల్లలు ఉన్న వారికి అందిస్తుంది. ఉచితంగా చదువుతో పాటు వారికి అయ్యే ఖర్చులను భరించడం వంటి స్కీములకు చైనా ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ పథకాలతో అయినా జనాభా పెరుగుతుందని చైనా ప్రభుత్వం ఆశలు పెట్టుకుంటోంది.
Telangana Formation Day: తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన 12 సంఘటనలు, చారిత్రక ఘట్టాలు ఇవే!
Tamil Nadu Crime: అత్తను దారుణంగా హత్య చేసిన కోడలు, సీసీటీవీ ఫుటేజీ చూసి పోలీసులు షాక్!
PSTU Admissions: తెలుగు యూనివర్సిటీ ప్రవేశ ప్రకటన విడుదల, కోర్సుల వివరాల ఇలా!
APPSC Group1 Mains: జూన్ 3 నుంచి 'గ్రూప్-1' మెయిన్స్ పరీక్షలు! హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారా?
Hayath Nagar Deaths Case: రాజేశ్, టీచర్ మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి! అసలు విషయం తేల్చిన పోలీసులు
Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?
Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్‌అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్
Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!
Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !