Youngest Self-made Billionaires in India: ''ఓయో''మ్మో- కాలేజీ డ్రాపౌట్ 8వేల కోట్లకు అధిపతి
ఇండియాలో 21వశతాబ్దం ఎంతో మంది కొత్త వ్యాపారులను పరిచయం చేసింది. ఎటువంటి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్, ఆస్తులు లేకపోయిన ఓ చిన్న ఐడియాతో వేల కోట్ల రూపాయలకు అధిపతులుగా మారగలిగారు కొందరు.
ప్రపంచ వాణిజ్య రంగంలో ఇండియా ఇప్పుడు తన సత్తా చాటుతోంది. అత్యధిక జనాభా కలిగిన రెండో దేశంగానే కాదు... అత్యంత యువశక్తి ఉన్న దేశంగానూ భారత్ ఇప్పుడు ప్రపంచ దేశాల్లో తన మార్క్ కనబరుస్తోంది. 21 శతాబ్దంలో ఎంతో మంది యువ వ్యాపారవేత్తలు భారత్ మార్కెట్‌ను మరింత ముందుకు తీసుకెళ్లారు. చిన్న చిన్న ఐడియాలనే స్టార్టప్‌లుగా మలిచి ఇప్పుడు వందల వేల కోట్ల వ్యాపారులుగా తీర్చిదిద్దుతున్నారు.
అలా యువ వ్యాపారవేత్తలుగా మారి వందల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించిన టాప్ 10 యంగెస్ట్ బిలీనియర్స్ ఆఫ్ ఇండియా గురించే ఈ స్టోరీ. బై దవే వీళ్లేవరికీ పెద్ద ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ కానీ..పెద్ద వ్యాపార కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లు గానీ కాదు.
1. నితిన్ కామత్
ఆస్తి విలువ - $1.5 బిలియన్ అంటే 14వేల 500 కోట్ల రూపాయలు
సంస్థ - జీరోధా
చదువు - ఇంజినీరింగ్
ఇండియాలో ట్రేడింగ్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇన్వెస్టర్స్‌కు ఉపయోగపడేలా వివరాలు అందించే సదుపాయాలు ఇప్పటికీ చాలా తక్కువే అనిచెప్పాలి. ఉన్నా కూడా చాలా పే చేయాల్సి ఉంటుంది యూజర్స్. ఈ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసిన నితిన్ కామత్ జీరోదాకు రూపకల్పన చేశాడు. దట్ టూ అది ఇండియాలోనే మొదటి డిస్కౌంట్ బ్రోకరేజ్ ఫర్మ్ అది. 2010లో పెట్టిన జీరోదాకు ఇప్పుడు 50లక్షల మంది యాక్టివ్ క్లైంట్స్ ఉన్నారు.
2. నిఖిల్ కామత్
ఆస్తి విలువ- $1.5 బిలియన్
కంపెనీ - జీరోధా
చదువు - స్కూల్ డ్రాపౌట్
నితిన్ కామత్ సోదరుడు నిఖిల్ కామత్ ఓ స్కూల్ డ్రాపవుట్. 17 ఏళ్ల వయసులో కాల్ సెంటర్‌లో జాబ్ చేసేవాడు. నిఖిల్ కామత్ ట్రేడింగ్‌లో కి వెళ్దామనే డిసైడ్ తన సోదరుడు నితిన్ కామత్‌తో కలిసి జీరోదాను స్టార్ట్ చేశాడు. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఎదుర్కొనే ఇబ్బందులను తప్పించటమే పనిగా పెట్టుకున్నారు. ప్రస్తుతం నిఖిల్ కామత్ ఆస్తి విలువ 11వేల 100 కోట్ల రూపాయలు. నలభై ఏళ్ల వయస్సు వచ్చేసరికి అన్నదమ్ములిద్దరూ ఇండియాలో సెల్ఫ్ మేడ్ బిలినీయర్లుగా మారగలిగారు.
3. దివ్యాంక్ తురాఖియా
ఆస్తి విలువ- $1.76 బియిన్లు
కంపెనీ - మీడియాడాట్ నెట్
చదువు-కామర్స్ ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్
దివ్యాంక్ తురాఖియా చిన్నప్పటి నుంచి కోడింగ్ మీద పట్టుసాధించిన టెక్కీ. 8 ఏళ్ల వయస్సు నుంచి కోడింగ్ మీద దృష్టి పెట్టిన దివ్యాంక్... కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పైన పూర్తిస్థాయి గ్రిప్ తెచ్చుకున్నారు. ముంబై మాంజీ కాలేజ్‌లో ఎకనామిక్స్ అండ్ కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత మీడియా. నెట్ స్థాపించారు. ఆ తర్వాత దాన్ని చైనీస్ కన్సార్టియంకు 900 మిలియన్ డాలర్లకు అమ్మేశారు. ఐఐఎఫ్ఏ వెల్త్ నివేదిక ప్రకారం ఇండియాలో సెకండ్ రిచెస్ట్ సెల్ఫ్ మేడ్ ఆంట్రప్యూనర్ దివ్యాంక్ తురాఖియా. ప్రస్తుతం అతని ఆస్తుల విలువ 12 వేల 500 కోట్ల రూపాయలు.
4. అంకిత్ భక్తి
ఆస్తుల విలువ- $615 మిలియన్లు
సంస్థ- ఓలా
చదువు- ఐఐటీ బాంబే
దేశంలో ఆటో మొబైల్ అండ్ ట్రావెలింగ్ రంగంలో ఓ ఊపు తీసుకువచ్చిన ఓలా క్యాబ్స్ స్థాపించింది అంకిత్ భక్తినే. ఐఐటీ బాంబేలో చదువు పూర్తి చేసుకున్న తర్వాత 2010లో ఈ సంస్థను స్థాపించిన అంకిత్... అతి కొద్ది కాలంలో రైడ్ షేరింగ్ కంపెనీస్ లో టాప్‌కు ఓలా క్యాబ్స్ తీసుకెళ్లారు. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్‌ను డామినేట్ చేస్తున్న టాప్ 2 రైడ్ షేరింగ్ కంపెనీల్లో ఓలా క్యాబ్స్ ఒకటి. ప్రస్తుతం అతని ఆస్తి విలువ 1600 కోట్ల రూపాయలు.
5. భవీష్ అగర్వాల్
ఆస్తుల విలువ- $990 మిలియన్లు
సంస్థ- ఓలా
చదువు- ఐఐటీ బాంబే
ఓలాతో విప్లం తీసుకువచ్చిన కుర్రాళ్లలో భవీష్ అగర్వాల్ కూడా ఉన్నారు. ఐఐటీ బాంబే నుంచి తనకున్న పరిచయాలతో అంకిత్ భక్తితో కలిసి ఓలాకు ప్లాన్ చేశారు భవీష్. ఇన్నోవేటింగ్ టెక్నాలజీ బేస్డ్ క్యాబ్ సర్వీసెస్‌ను ఇండియాలో ప్రారంభించటం ద్వారా ఓలా పాపులర్ అవటమే కాదు భవీష్‌ను 7500 కోట్ల రూపాయలకు అధిపతిని కూడా చేసింది.
6. విజయ్ శేఖర్ శర్మ
ఆస్తుల విలువ- $1.3 బిలియన్లు
సంస్థ- పేటీఎం
చదువు- దిల్లీ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్
డిజిటల్ పేమెంట్స్ వచ్చిన తర్వాత ఇండియాలో పేటీఎం పేరు తెలియనివారు ఉండరంటే ఆశ్చర్యం లేదు. కాలేజ్‌లో ఉన్నప్పుడే ఇండియా సైట్. నెట్ క్రియేట్ చేసిన విజయ్ శేఖర్ శర్మ. దాన్ని 1 మిలియన్ డాలర్లకు అమ్మేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత ఆన్ లైన్ రిజల్ట్స్ కోసం, క్రికెట్ అలర్ట్స్ కోసం రింగ్ టోన్స్ కోసం One 97 కమ్యూనికేషన్స్ ప్రారంభించిన విజయ్ శేఖర్... 2010 లో దాన్ని పేరెంట్ కంపెనీగా ఉంచి పేటీఎంను ప్రారంభించారు. 2017లో విజయ్ శేఖర్ శర్మను ఇండియాస్ యంగెస్ట్ బిలినీయర్‌గా ఫోర్బ్ అభివర్ణించింది. టైమ్ మ్యాగజైన్స్ వరల్డ్స్ 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ గానూ 2017లోనే గుర్తింపు సాధించారు విజయ్ శేఖర్ శర్మ. అంతే కాదు ప్రపంచ దిగ్గజ వ్యాపారవేత్త వారెన్ బఫెట్ కూడా 300 మిలియన్ డాలర్లను పేటీఎంలో ఇన్వెస్ట్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు పేటీఎంను విజయ్ శేఖర్ శర్మ ఏ రేంజ్ కు తీసుకెళ్లారో. ప్రస్తుతం అతని ఆస్తి విలువ 17వేల కోట్ల రూపాయలు.
7&8
బిన్నీ బన్సాల్
ఆస్తుల విలువ- $1.3 బిలియన్లు
సంస్థ- ఫ్లిప్‌కార్ట్
చదువు- దిల్లీ ఐఐటీలో డిగ్రీ
సచిన్ బన్సాల్
ఆస్తుల విలువ- $1.3 బిలియన్లు
సంస్థ- ఫ్లిప్‌కార్ట్
చదువు- దిల్లీ ఐఐటీలో డిగ్రీ
ఇద్దరూ ఐఐటీ దిల్లీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్లే. బిన్నీ, సచిన్ కలిసి 2007లో ఫ్లిఫ్ కార్ట్ ప్రారంభించారు. మొదట్లో అది ఓ చిన్న పుస్తకాలమ్మే సైట్‌లా స్టార్ట్ అయ్యింది. 2018 నాటికి ఇండియన్ ఈ కామర్స్ ఇండస్ట్రీలో ఫ్లిఫ్ కార్ట్ దే అగ్రభాగం. దీంతో వాల్ మార్ట్ ఫ్లిప్ కార్ట్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు వరల్డ్ మార్కెట్ లో ఫ్లిప్ కార్ట్ విలువ రెండులక్షల కోట్ల రూపాయలు.
9. రితేష్ అగర్వాల్
ఆస్తుల విలువ- $1.1 బిలియన్లు
సంస్థ- ఓయో రూమ్స్
చదువు- కాలేజ్ డ్రాపౌట్
కాలేజ్ డ్రాప్ అవుట్ రితేష్ అగర్వాల్ ఓయో రూం కాన్సెప్ట్‌తో సాధించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. 2021 నాటికి ఇండియాలో యంగెస్ట్ బిలినీయర్‌గా రితేష్ అగర్వాల్‌ను మార్చింది ఓయోనే. తక్కువ బడ్జెట్‌లో చిన్న వసతి గదులను పెద్ద హోటళ్లలో కూడా అందుబాటులోకి తీసుకురావటం ఓయో సక్సెస్ సీక్రెట్. ప్రస్తుతం రితేష్ ఆస్తుల విలువ 8వేల కోట్ల రూపాయలు.
10. దీపేందర్ గోయల్
ఆస్తుల విలువ- $650 మిలియన్లు
ఆస్తుల విలువ- జొమాటో
చదువు- దిల్లీ ఐఐటీలో డిగ్రీ
ఇప్పుడంటే జొమాటో ఇంతలా ఫేమస్ అయ్యింది. 2008లో ఢిల్లీ ఐఐటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే ఫుడీ బే పేరుతో దీపిందర్ గోయల్ దీన్ని ప్రారంభించారు. కొంచెం పాపులారిటీ రావటం మొదలయ్యాక 2010లో జొమాటోగా పేరు మార్చారు. ఆ తర్వాత ఫుడ్ బిజెనెస్‌లో జొమాటో వెనక్కి తిరిగి చూసుకుంది లేదు. సిబాండోను 2014లో, అర్బన్ స్పూన్‌ను సొంతం చేసుకున్న తర్వాత జొమాటో ఎక్కడికో వెళ్లిపోయింది. ప్రస్తుతం దీపిందర్ గోయల్ ఆస్తి విలువ దాదాపు 2వేల 200 కోట్ల రూపాయలు.
సో ఇదీ ఓ చిన్న ఐడియాతో వేల కోట్లకు అధిపతులుగా మారిన టాప్ 10 ఇండియన్ బిలీయనర్స్.