అన్వేషించండి

Most Sugar Produced States: భారత్‌లో అత్యధికంగా చక్కెర ఉత్పత్తి చేసే టాప్ 5 రాష్ట్రాల జాబితా

Sugar Production: భారత్‌లో గత కొన్ని రోజుల్లోనే చక్కెర ధరలు భారీగా పెరిగాయి. ఇథనాల్ తయారీకి చెరుకు వినియోగమే ఇందుకు ప్రధాన కారణమని ప్రజలు భావిస్తున్నారు. చెరుకు ఉత్పత్తిలో టాప్ 5 రాష్ట్రాలివే.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కర్ణాటక, గుజరాత్, తమిళనాడు ముఖ్యమైన చక్కెర ఉత్పత్తిదారులుగా నిలుస్తున్నాయి.

Sugar Production: భారత్‌లో పండుగల సీజన్‌కు ముందు చక్కెర ధరల్లో భారీ పెరుగుదల కనిపించింది. గత 1 నెలలో చక్కెర రిటైల్ ధర సుమారు ₹48.18 నుంచి పెరుగుతూ ఏకంగా కేజీ ₹65కు చేరింది. అంటే కిలోకు దాదాపు 17 రూపాయలు పెరిగి సామాన్యులకు షాకిచ్చింది. పెరుగుతున్న ధరల మధ్య దేశంలో చక్కెర ఉత్పత్తిపైనా ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రాలు అత్యధికంగా చక్కెరను ఉత్పత్తి చేస్తాయి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

భారత్‌లో చక్కెర ఉత్పత్తి 

వస్త్ర పరిశ్రమ తర్వాత దేశంలో రెండో అతిపెద్ద వ్యవసాయ ఆధారిత పరిశ్రమ భారత చక్కెర పరిశ్రమ. ఇది లక్షలాది మంది రైతులు, గ్రామీణ కార్మికులకు ఉపాధి కల్పిస్తుంది. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ చక్కెర ఉత్పత్తిలో అగ్రస్థానం కోసం పోటీ పడుతుంటాయి. కానీ వాటి వ్యవసాయ పరిస్థితులు, వాతావరణం, చక్కెర మిల్లుల నిర్మాణం భిన్నంగా ఉంటాయి. 2025-26 చక్కెర సీజన్‌కు దేశ మొత్తం చక్కెర ఉత్పత్తి సుమారు 30.6 మిలియన్ మెట్రిక్ టన్నులుగా అంచనా వేస్తున్నారు. 

మహారాష్ట్ర 

చక్కెర ఉత్పత్తిలో భారత్‌లో ప్రస్తుతం మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుత సీజన్‌లో రాష్ట్రంలో 200కు పైగా చక్కెర మిల్లులు పనిచేస్తున్నాయి. మహారాష్ట్రకు ఉన్న అతిపెద్ద ప్రయోజనం దాని ఉష్ణమండల, సముద్రతీర వాతావరణం. సరైన ఉష్ణోగ్రత, తేమ ఉంటే చెరకు ఎండిపోకుండా బాగా పెరగడానికి సహాయపడుతుంది. రాష్ట్రంలో శీతాకాలం ప్రభావం తక్కువగా ఉంటుంది. పంటలకు సూర్యకాంతి కూడా బాగా లభిస్తుంది. దీంతో చెరకులో సుక్రోజ్ పరిమాణం పెరగడానికి దోహదం చేస్తుంది. మహారాష్ట్రలో సుమారు 9.92 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అవుతుంది.

 మహారాష్ట్ర సహకార చక్కెర మిల్లు మోడల్ మరో పెద్ద బలం. ఇందులో రైతులు పరిశ్రమ నిర్వహణలో ప్రత్యక్ష పాత్ర పోషిస్తారు. ప్రధాన చక్కెర ఉత్పత్తి కేంద్రాల్లో పుణే, సతారా, అహ్మద్‌నగర్, కొల్హాపూర్, సొలాపూర్ ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్ 

ఉత్తరప్రదేశ్‌ను తరచుగా భారతదేశ చక్కెర గిన్నె (Sugar Bowl of India) అని పిలుస్తారు. ఇక్కడ సుమారు 8.92 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అవుతుంది.  దేశంలో చెరకు సాగు విస్తీర్ణం అత్యధికంగా ఇక్కడే జరుగుతుంది. కొన్ని సీజన్లలో తయారైన చక్కెర ఉత్పత్తిలో మహారాష్ట్ర ముందుంటుంది. కానీ సాగు విస్తీర్ణం పరంగా ఉత్తరప్రదేశ్ దేశంలో అతిపెద్ద చెరకు ఉత్పత్తి రాష్ట్రంగానే నిలుస్తోంది. 

రాష్ట్రంలోని సారవంతమైన గంగా-యమునా మైదానాలు చెరకు సాగు కోసం అద్భుతమైన పరిస్థితులను అందిస్తాయి. అయితే ఉత్తరప్రదేశ్ వాతావరణం సబ్-ట్రాపికల్. ఇక్కడ వేసవులు చాలా వేడిగా, శీతాకాలంలో అతి చల్లగా ఉంటుంది. ఈ పరిస్థితులు చెరకు పక్వానికి వచ్చే కాలం, చక్కెర రికవరీ రేటును ప్రభావితం చేసే ఛాన్స్ ఉంది. 

మహారాష్ట్రకు భిన్నంగా, అక్కడ ప్రభుత్వ సహకార సంఘాల పాత్ర అధికంగా ఉంటుంది. ఉత్తరప్రదేశ్ చక్కెర పరిశ్రమలో పెద్ద ప్రైవేట్ చక్కెర మిల్లులకు పట్టు ఉంది. ప్రధాన ఉత్పత్తి క్లస్టర్లలో మీరట్, ముజఫర్‌నగర్, బిజ్నోర్, సహారన్‌పూర్, గోరఖ్‌పూర్ ఉన్నాయి.

కర్ణాటక 

దేశంలోని ప్రధాన చక్కెర ఉత్పత్తి రాష్ట్రాల్లో కర్ణాటక మూడో స్థానంలో ఉంది. ఇక్కడ సుమారు 4.71 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి చేస్తున్నారు. దేశంలోని అత్యంత ముఖ్యమైన షుగర్ హబ్‌లలో ఒకటి. చెరకు సాగు వివిధ వాతావరణ పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లో జరుగుతుంది. ఉత్తర కర్ణాటక, ముఖ్యంగా బెలగావి, బాగల్‌కోట్ వంటి ప్రాంతాల్లో పొరుగున ఉన్న మహారాష్ట్రలాంటి వాతావరణ పరిస్థితులు ఉండటం కలిసొస్తుంది. దక్షిణ ప్రాంతాలకు కావేరీ బేసిన్ నుంచి నీటి లభ్యత ప్రయోజనకరం.  

రాష్ట్రంలోని చక్కెర మిల్లులు వేగంగా మోడ్రన్ టెక్నాలజీ స్వీకరించాయి. అనేక మిల్లులు చక్కెర ఉత్పత్తితో పాటు ఇథనాల్ తయారీ, విద్యుత్ ఉత్పత్తి కూడా చేస్తాయి. దీంతో చెరకు నుంచి రైతులకు అదనపు ఆదాయం లభిస్తోంది.

గుజరాత్ 

దేశంలోని ప్రధాన చక్కెర ఉత్పత్తి రాష్ట్రాల్లో గుజరాత్ నాలుగో స్థానంలో ఉంది. గుజరాత్‌లో సుమారు 1.1 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరుగుతుంది. రాష్ట్ర చక్కెర పరిశ్రమ వ్యవసాయంలో వ్యవస్థీకృత పద్ధతులు, సహకార చక్కెర మిల్లుల నెట్‌వర్క్‌కు ప్రసిద్ధి. చెరకు ఉత్పత్తి ప్రధానంగా దక్షిణ గుజరాత్‌లోని మైదాన, తీర ప్రాంతాల్లో చేస్తారు. సహకార సంస్థలు రైతులను చక్కెర మిల్లులతో అనుసంధానించడంలో చెరకు ప్రాసెసింగ్ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తాయి.

తమిళనాడు 

చెరుకు ఉత్పత్తిలో తమిళనాడు టాప్-5 రాష్ట్రాల జాబితాలో ఉంది. రాష్ట్రంలో సుమారు 0.9 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరుగుతుంది. రాష్ట్రంలోని వేడి వాతావరణం కారణంగా సంవత్సరంలో చాలా కాలం చెరకు సాగు, క్రషింగ్ పనులు కొనసాగుతుంటాయి. అనేక ప్రాంతాల్లో రైతులు సాగునీటిని మెరుగ్గా వినియోగించుకోవడానికి, చెరకు దిగుబడిని పెంచడానికి ఆధునిక పద్ధతులు, డ్రిప్ ఇరిగేషన్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ విధానాలు తమిళనాడును దేశంలోని ప్రధాన చక్కెర ఉత్పత్తి రాష్ట్రాల్లో టాప్ 5లో నిలుపుతున్నాయి. 

 

Frequently Asked Questions

భారతదేశంలో చక్కెర పరిశ్రమ ఎంత ముఖ్యమైనది?

ఇది వస్త్ర పరిశ్రమ తర్వాత దేశంలో రెండో అతిపెద్ద వ్యవసాయ ఆధారిత పరిశ్రమ. లక్షలాది మంది రైతులు, గ్రామీణ కార్మికులకు ఉపాధి కల్పిస్తుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Most Sugar Produced States: భారత్‌లో అత్యధికంగా చక్కెర ఉత్పత్తి చేసే టాప్ 5 రాష్ట్రాల జాబితా
భారత్‌లో అత్యధికంగా చక్కెర ఉత్పత్తి చేసే టాప్ 5 రాష్ట్రాల జాబితా
Breaking News: హైదరాబాద్‌లో టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అపశృతి.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు
హైదరాబాద్‌లో టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అపశృతి.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు
BJP National Office Bearers Meeting: నితిన్ నబీన్ నేతృత్వంలో బీజేపీ కొత్త టీం తొలి సమావేశం - వందేమాతరం నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం!
నితిన్ నబీన్ నేతృత్వంలో బీజేపీ కొత్త టీం తొలి సమావేశం - వందేమాతరం నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gayatri Bronze Win: బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Gachibowli Building Collapse: అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
Konda Surekha Letter To TPCC: నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Viral Video: న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
Embed widget