తనను, తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారని, వారి వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. విచారణ కొనసాగుతుండగా తనపై విమర్శలు చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు.
Konda Surekha Letter To TPCC: నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
తనను, తన కుటుంబాన్ని కొందరు నాయకులు లక్ష్యంగా చేసుకుని అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారని, చర్యలు తీసుకోవాలని మంత్రి కొండా సురేఖ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవికి లేఖ రాశారు.

- మంత్రి కొండా సురేఖ మళ్ళీ క్రమశిక్షణ కమిటీకి లేఖ రాశారు.
- తన వివరణ తర్వాత జరుగుతున్న అవమానకర వ్యాఖ్యలపై సురేఖ ఆందోళన.
- బీసీ మహిళా మంత్రిపై దాడులపై పార్టీ మౌనంపై సురేఖ ఆందోళన.
- మల్లు రవి, మంత్రి కూతురి వ్యాఖ్యలను ఖండించాలని సురేఖను కోరారు.
Konda Surekha Letter to TPCC | హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రుల కుటుంబసభ్యుల వ్యాఖ్యలతో పలు జిల్లాల్లో రాజకీయాలు వేడేక్కాయి. మంత్రి కొండా సురేఖ తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలపై ఇదివరకే టీపీసీసీకి తన వివరణ ఇచ్చుకున్నారు. తనను, తన కుటుంబాన్ని కొందరు లక్ష్యంగా చేసుకుని అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవికి మంత్రి కొండా సురేఖ మరొక లేఖ రాశారు. తనపై ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తున్న వారి వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
క్రమశిక్షణా కమిటీ ఇచ్చిన నోటీసుకు తాను ఇప్పటికే స్పష్టమైన వివరణ ఇచ్చానని, అయినా పలువురు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు బహిరంగంగా తనపై అవమానకర రీతిలో మాట్లాడటం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ కొనసాగుతున్న సమయంలోనే తనపై ఈ రకంగా విమర్శలు చేయడం వెనుక ఉన్న ఉద్దేశాలను క్రమశిక్షణ కమిటీ తీవ్రంగా పరిశీలించాలని లేఖలో కొండా సురేఖ ప్రస్తావించారు.
బీసీ మహిళా మంత్రిపై దాడులపై పార్టీ మౌనంపై ఆందోళన
తనకు పార్టీ క్రమశిక్షణపై పూర్తి గౌరవం ఉందని, అదే సమయంలో ఒక సీనియర్ బీసీ మహిళా నాయకురాలైన తనపై తీవ్ర పదజాలంతో సామూహిక దాడులు జరుగుతున్నప్పుడు పార్టీ నాయకత్వం మౌనం వహించడం ఆందోళన కలిగిస్తోందని సురేఖ పేర్కొన్నారు. తన రాజకీయ భవిష్యత్తుపై తీర్పులు ఇస్తూ, తనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కొందరు మీడియా ముందుకు రావడం వెనుక ఉన్న కుట్రలను బయటకు తీయాలన్నారు. పార్టీ విలువలకు, క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించే ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ క్రమశిక్షణా కమిటీని డిమాండ్ చేశారు.
కుమార్తె వ్యాఖ్యలను మంత్రి కొండా సురేఖ ఖండించాలి: మల్లు రవి
మరోవైపు, టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి ఈ విషయంపై స్పందించారు. మంత్రి కొండా సురేఖ ఇచ్చిన వివరణపై కమిటీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన అవినీతి ఆరోపణలు, తీవ్ర వ్యాఖ్యలను ఒక మంత్రిగా సురేఖ ఖండించాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. కుమార్తె సుస్మిత వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని కొండా సురేఖ చెబుతున్నారని, అయితే ఈ వివరణపై ఎప్పుడు చర్యలు తీసుకుంటామో ఇప్పుడే చెప్పలేం అన్నారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ఇచ్చిన వివరణను పరిశీలించామని, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో ప్రొసీజర్ ప్రకారం వెళ్తూ ఆయన వ్యాఖ్యలపై సుమోటోగా స్పందించాలా లేదా అన్నది కమిటీ పరిశీలిస్తోందని తెలిపారు.
పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు: చిన్నారెడ్డి లేఖ
వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఫిర్యాదుతో డీఏసీ జారీ చేసిన షోకాజ్ నోటీసులపై కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి స్పందించారు. తాను ఎప్పుడూ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని, ఎవరిపై అనుచిత వ్యాఖ్యలు చేయలేదని లేఖలో స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే చర్యలు, తీరుతో బాధపడుతున్న కార్యకర్తల ఆవేదననే తాను తెలియజేశానని పేర్కొన్నారు. తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని, తాను చేసిన వ్యాఖ్యలపై విచారణ జరిపి న్యాయం చేయాలని డీఏసీని కోరారు.
Before You Go
IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Frequently Asked Questions
మంత్రి కొండా సురేఖ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి ఎందుకు లేఖ రాశారు?
కొండా సురేఖ కుమార్తె చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నిర్ణయం ఏంటి?
మంత్రి కొండా సురేఖ ఇచ్చిన వివరణపై కమిటీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి తెలిపారు. ఈ వివరణపై ఎప్పుడు చర్యలు తీసుకుంటామో ఇప్పుడే చెప్పలేమన్నారు.
కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు దేని గురించి?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు, తీవ్ర వ్యాఖ్యలను సుస్మిత చేసినట్లు మల్లు రవి పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను ఒక మంత్రిగా సురేఖ ఖండించాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు.
బీసీ మహిళా మంత్రిపై దాడులపై పార్టీ మౌనం గురించి కొండా సురేఖ ఆందోళన ఏంటి?
ఒక సీనియర్ బీసీ మహిళా నాయకురాలిగా తనపై సామూహిక దాడులు జరుగుతున్నప్పుడు పార్టీ నాయకత్వం మౌనం వహించడం ఆందోళన కలిగిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఇది పార్టీ విలువలకు విరుద్ధమన్నారు.
ట్రెండింగ్ వార్తలు






















