అన్వేషించండి

Sugar From 1 Quintal Sugarcanes: ఒక క్వింటా చెరకు నుంచి ఎంత చక్కెర ఉత్పత్తి అవుతుంది? తయారీ ప్రక్రియ ఎలా ఉంటుంది?

Sugar From 1 Quintal Sugarcanes: 1 క్వింటా చెరకు చక్కెర మిల్లుకు చేరినప్పుడు దాని నుంచి ఎంత చక్కెర ఉత్పత్తి అవుతుంది. ఈ మొత్తం ప్రక్రియ ఎలా జరుగుతుంది? పూర్తి వివరాలను తెలుసుకోండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • చెరకు నాణ్యత, ప్రాసెసింగ్‌ను బట్టి చక్కెర దిగుబడి మారుతుంది.
  • మిల్లు రికవరీ 10% ఉంటే, 10 కిలోల చక్కెర లభిస్తుంది.
  • చెరకును క్రష్ చేసి, శుద్ధి చేసి, స్ఫటికాలుగా మార్చి చక్కెర తీస్తారు.
  • చక్కెరతో పాటు, బగాస్, మొలాసిస్ వంటి ఉప-ఉత్పత్తులు వస్తాయి.

Sugar From 1 Quintal Sugarcanes: చెరకు భారత్‌లోని అతిపెద్ద వాణిజ్య పంటలలో ఒకటిగా చెబుతారు. దేశవ్యాప్తంగా చాలా మంది రైతులు దీనిని సాగు చేస్తారు. ఇది పొలాల నుంచి చక్కెర మిల్లులకు చేరిన తర్వాత, చక్కెరగా మారుతుంది. కానీ చెరకు నుంచి చక్కెర తయారు చేయడం గురించి చాలా మందికి సందేహాలు ఉన్నాయి. 1 క్వింటాల్, లేదా 100 కిలోగ్రాముల చెరకు నుంచి ఎంత చక్కెర ఉత్పత్తి అవుతుందో అని మీరు కూడా ఆలోచిస్తున్నారా? 

అయితే దీనికి నిర్దిష్టమైన సంఖ్య ఏదీ లేదు. ఇది చెరకు నాణ్యత, దాని తీపి,  దానిని ఎలా ప్రాసెస్ చేస్తారు వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఈ అంశాలన్నింటి ఆధారంగా తుది ఉత్పత్తి నిర్ణయమవుతుంది. చెరకు నుంచి చక్కెర తయారు చేయడంలో అనేక దశలు ఉంటాయి. 1 క్వింటా చెరకు నుంచి ఎంత చక్కెర ఉత్పత్తి అవుతుంది. దానిని ఎలా ఉత్పత్తి చేస్తారో ఇప్పుడు వివరిద్దాం.  

క్వింటా చెరకు నుంచి ఎంత చక్కెర ఉత్పత్తి అవుతుంది?

1 క్వింటాల్ (100 కిలోల) చెరకు నుంచి ఉత్పత్తి అయ్యే చక్కెర పరిమాణం, చెరకు నాణ్యత, మిల్లు రికవరీపై ఆధారపడి ఉంటుంది. సులభంగా చెప్పాలంటే, మిల్లు రికవరీ 10 శాతం ఉంటే, 100 కిలోల చెరకు నుంచి సుమారుగా 10 కిలోల చక్కెర లభిస్తుంది. అదేవిధంగా, 11 శాతం రికవరీతో సుమారుగా 11 కిలోలు, 12 శాతం రికవరీతో సుమారుగా 12 కిలోల చక్కెర లభిస్తుంది. ఇక్కడ రికవరీ అంటే, మిల్లులో వేసిన మొత్తం చెరకు నుంచి ఉత్పత్తి అయిన చక్కెర పరిమాణం.

అన్ని రకాల చెరకు ఒకే పరిమాణంలో చక్కెరను ఉత్పత్తి చేయదు. చెరకులో సుక్రోజ్ శాతం ఎక్కువగా ఉంటే, చక్కెర దిగుబడి మెరుగ్గా ఉంటుంది. చెరకు తాజాదనం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. కోత తర్వాత చెరకు మిల్లుకు చేరడానికి ఎక్కువ సమయం పడితే, చక్కెర దిగుబడి ప్రభావితం కావచ్చు. అందుకే, చెరకు నాణ్యతతోపాటు, మిల్లుకు సకాలంలో చేరవేయడం కూడా చాలా కీలకంగా పరిగణిస్తారు. 

చెరకు నుంచి చక్కెర తయారు చేయడంలో మొదటి దశ ఏమిటి?

మిల్లులో చెరకును క్రష్ చేయడంతో చక్కెర ఉత్పత్తి ప్రారంభమవుతుంది. మిల్లుకు చేరాక, చెరకును పెద్ద యంత్రాలలో క్రష్ చేసి , దాని రసాన్ని తీస్తారు. ఈ రసంలో నీరు, సుక్రోజ్ ఇతర మూలకాలు ఉంటాయి. దీని తరువాత శుద్ధి ప్రక్రియ జరుగుతుంది, దీని ద్వారా వేస్ట్‌ను, పీచుపదార్థం  ఇతర మలినాలను తొలగిస్తారు.

శుద్ధి చేసిన తర్వాత, చెరకు రసాన్ని వేడి చేస్తారు. ఆ తర్వాత ఆవిరిని ఉపయోగించి అందులో ఉంటే నీటి శాతాన్ని తగ్గిస్తారు. క్రమంగా, రసం చిక్కబడి పాకంలా మారుతుంది. ఈ చిక్కటి రసాన్ని తదుపరి ప్రక్రియకు పంపుతారు, అక్కడ చక్కెర స్ఫటికాలు ఏర్పడతాయి. చెరకును క్రష్ చేయడం నుంచి రసాన్ని చిక్కబరచడం వరకు ప్రతి దశ, తుది చక్కెర వెలికితీతలో కీలక పాత్ర పోషిస్తుంది.

చక్కెర స్ఫటికాలు ఎలా తయారు చేస్తారు?

చెరకు రసం తగినంత చిక్కబడిన తర్వాత, దానిని స్ఫటికీకరణ అనే తదుపరి దశకు పంపుతారు. ఇక్కడ, నిర్దిష్ట ఉష్ణోగ్రతలు, కచ్చితమైన పరిస్థితుల్లో చిన్న చక్కెర స్ఫటికాలు ఏర్పడతాయి. ఆ తర్వాత ఈ స్ఫటికాలను మిగిలిన ద్రవం నుంచి వేరు చేస్తారు. ఈ స్ఫటికాలను మరింత శుద్ధి చేసి, మనం ఇళ్లలో ఉపయోగించే రేణువుల చక్కెరగా తయారు చేస్తారు. చెరకులోని చక్కెర అంతా ఉపయోగించే చక్కెరగా మారదు; ఈ ప్రక్రియలో కొంత చక్కెర వివిధ భాగాలలో మిగిలిపోతుంది.

చక్కెర ఉత్పత్తిలో చక్కెరతోపాటు చాలా పదార్థాలు వస్తాయి. చెరకును క్రష్ చేసిన తర్వాత మిగిలిపోయిన పీచును బగాస్ అంటారు. దీనిని మిల్లులో విద్యుత్తును ఆవిరిని ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తారు. మొలాసిస్ కూడా ఉత్పత్తి అవుతుంది, దీనిని ఇథనాల్ ఉత్పత్తికి ఉపయోగిస్తారు. చక్కెర మిల్లులలో చెరకును శుద్ధి చేసే ప్రక్రియలో ప్రెస్‌మడ్ కూడా ఒక ఉపయోగకరమైన ఉత్పత్తి.

అందువల్ల, ఒక క్వింటా చెరకు కేవలం చక్కెరను మాత్రమే ఉత్పత్తి చేయదు. ఇది అనేక ఇతర ఉపయోగకరమైన ఉత్పత్తులను కూడా ఇస్తుంది. ఉత్పత్తి అయ్యే చక్కెర పరిమాణం చెరకు నాణ్యత, మిల్లులో జరిగే ప్రాసెసింగ్‌పై ఆధారపడి ఉంటుంది. అందువల్ల, ప్రతి 100 కిలోల చెరకు నుంచి ఉత్పత్తి అయ్యే చక్కెర పరిమాణం మారవచ్చు.

Frequently Asked Questions

1 క్వింటాల్ చెరకు నుంచి ఎంత చక్కెర వస్తుంది?

ఇది చెరకు నాణ్యత, దాని తీపి, ప్రాసెసింగ్ పద్ధతిపై ఆధారపడి ఉంటుంది. మిల్లు రికవరీ 10% ఉంటే, 100 కిలోల చెరకు నుంచి సుమారు 10 కిలోల చక్కెర లభిస్తుంది. రికవరీ శాతాన్ని బట్టి చక్కెర పరిమాణం మారుతుంది.

చెరకు నుంచి చక్కెర తయారు చేయడంలో మొదటి దశ ఏమిటి?

మిల్లులో చెరకును క్రష్ చేసి రసాన్ని తీయడం మొదటి దశ. ఈ రసంలో నీరు, సుక్రోజ్, ఇతర మూలకాలు ఉంటాయి. దీని తరువాత శుద్ధి ప్రక్రియ జరుగుతుంది.

చక్కెర స్ఫటికాలు ఎలా తయారు చేస్తారు?

చిక్కబడిన చెరకు రసాన్ని స్ఫటికీకరణ దశకు పంపి, నిర్దిష్ట ఉష్ణోగ్రతల వద్ద చిన్న చక్కెర స్ఫటికాలను ఏర్పరుస్తారు. ఆ తర్వాత ఈ స్ఫటికాలను మిగిలిన ద్రవం నుంచి వేరు చేసి శుద్ధి చేస్తారు.

చెరకు నుంచి చక్కెర దిగుబడిని ప్రభావితం చేసే అంశాలు ఏమిటి?

చెరకు నాణ్యత, అందులోని సుక్రోజ్ శాతం, దాని తాజాదనం, మిల్లు రికవరీ శాతం వంటి అనేక అంశాలు చక్కెర దిగుబడిని ప్రభావితం చేస్తాయి. కోత తర్వాత మిల్లుకు సకాలంలో చేరవేయడం కూడా చాలా కీలకం.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

NDA Seat Sharing: స్థానిక సంస్థల్లో సీట్ల సర్దుబాటు- సాయంత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ కీలక భేటీ
స్థానిక సంస్థల్లో సీట్ల సర్దుబాటు- సాయంత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ కీలక భేటీ
Union Cabinet Decisions: రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. కనీస మద్దతు ధర పెంపు, ఏ పంటకు ఎంత
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. కనీస మద్దతు ధర పెంపు, ఏ పంటకు ఎంత పూర్తి వివరాలు
Atchannaidu: జలధార జలహారతితో 79,826 పనులు పూర్తి.. భూగర్భ జలాలు 0.79 మీటర్లు పెరుగుదల: అచ్చెన్నాయుడు
జలధార జలహారతితో 79,826 పనులు పూర్తి.. భూగర్భ జలాలు 0.79 మీటర్లు పెరుగుదల: అచ్చెన్నాయుడు
Most Sugar Produced States: భారత్‌లో అత్యధికంగా చక్కెర ఉత్పత్తి చేసే టాప్ 5 రాష్ట్రాల జాబితా
భారత్‌లో అత్యధికంగా చక్కెర ఉత్పత్తి చేసే టాప్ 5 రాష్ట్రాల జాబితా
Advertisement

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
Washing Machine : వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Embed widget