అన్వేషించండి

No Sugar for 30 Days : నో షుగర్స్ అంటే తినకూడని ఫుడ్స్ ఇవే.. 30 రోజులు స్వీట్స్ మానేస్తే కలిగే ప్రయోజనాలివే

30 Days No Sugar Challenge : అధికంగా స్వీట్స్ తింటే ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు, ఫ్యాటీ లివర్ వంటి తీవ్రమైన సమస్యల ప్రమాదం పెరుగుతుంది. అదే 30 రోజులు షుగర్స మానేస్తే ఏమవుతుంది?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • అధిక చక్కెరలు ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదం పెంచుతాయి.
  • కూల్ డ్రింక్స్, మిఠాయిలు వంటి అదనపు చక్కెరలు పూర్తిగా మానాలి.
  • రక్తంలో చక్కెర, బరువు, గుండె ఆరోగ్యం మెరుగుపడతాయి.
  • కాలేయం, దంతాల ఆరోగ్యాన్ని కాపాడుతూ అలసట తగ్గిస్తుంది.

Stop Eating Added Sugar for 30 Days : మీరు 30 రోజులు స్వీట్స్(షుగర్స్) మానేస్తే.. దాని ప్రభావం కేవలం బరువుపై మాత్రమే కాదు.. శరీరంలోని అనేక భాగాలపై కూడా కనిపిస్తాయి. నిపుణుల ప్రకారం అధికంగా చక్కెర తీసుకోవడం వల్ల ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు, ఫ్యాటీ లివర్ వంటి అనేక తీవ్రమైన సమస్యల ప్రమాదం పెరుగుతాయి. అందుకే ఈ రోజుల్లో చాలా మంది నో షుగర్ ఛాలెంజ్ తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా కొన్నిరోజులు తమ ఆహారం నుంచి అదనపు చక్కెరను తీసేస్తున్నారు. 

నో షుగర్స్ అంటే తినకూడని ఫుడ్స్ ఇవే.. 

నో స్వీట్, నో షుగర్ అంటే కొందరికి సరైన అవగాహన ఉండదు. కానీ దాని అర్థమేమిటంటే సహజంగా దొరికే తియ్యని ఫ్రూట్స్, కూరగాయలు లేదా పాలను వదులుకోవడం కాదు. కూల్​డ్రింక్స్, మిఠాయిలు, క్యాండీ, కేకులు, కుకీలు, షుగర్ డ్రింక్స్, ఫ్లేవర్డ్ పెరుగు, ప్యాక్ చేసిన జ్యూస్‌లు, వివిధ రకాల సాస్‌ల వంటి అదనపు చక్కెర ఉన్న ఆహారాలకు దూరంగా ఉండాలి. వీటికి తాజా పండ్లు, ఆకుకూరలు, తృణధాన్యాలు, పప్పులు, గుడ్లు, చేపలు, చికెన్, నట్స్, సమతుల్యమైన ఇంట్లో వండిన ఆహారాన్ని తినాలి.

Also Read : బీపీ, షుగర్ కంట్రోల్ కావాలంటే ఏమి తినాలి? ఏవి మానాలి? డాక్టర్ ఇస్తోన్న సూచనలు ఇవే

నో షుగర్ డైట్ వల్ల కలిగే లాభాలు

హెల్త్‌లైన్ అనే ఆరోగ్య సమాచార వెబ్‌సైట్ ప్రకారం.. మీరు వరుసగా 30 రోజులు అదనపు చక్కెరను మానేస్తే దాని మొదటి ప్రయోజనం మీ రక్తంలో చక్కెర స్థాయిలపై కనిపిస్తుంది. తరచుగా తీపి పదార్థాలను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరిగి.. కాలక్రమేణా ఇన్సులిన్ నిరోధకత, టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అందువల్ల చక్కెరను తగ్గించడం రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది.

ఎవరికి మంచిది?

నో షుగర్ డైట్ బరువు తగ్గాలనుకునే వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. చక్కెర అధికంగా ఉండే ఆహారాలలో కేలరీలు ఎక్కువగా ఉండి.. పీచుపదార్థం, ప్రోటీన్లు తక్కువగా ఉంటాయి. స్వీట్స్ తగ్గించడం వల్ల అదనపు కేలరీల వినియోగాన్ని తగ్గి.. బరువును అదుపులో ఉంచుకోవచ్చు. దంత ఆరోగ్యంపై కూడా సానుకూల ప్రభావం ఉంటుంది. స్వీట్స్ తింటే నోటిలోని బ్యాక్టీరియా చక్కెరను విచ్ఛిన్నం చేసి.. ఆమ్లాలను ఏర్పరుస్తుంది. ఇవి దంతాలను దెబ్బతీస్తాయి. చక్కెర వినియోగాన్ని తగ్గించడం వల్ల దంత క్షయం, పళ్లు పుచ్చిపోయే ప్రమాదం తగ్గుతుంది.

Also Read : స్వీట్స్ మానేస్తే డయాబెటిస్ రాదా? షుగర్ రావడానికి అసలు కారణాలు ఇవే అంటోన్న నిపుణులు

కాలేయ, గుండె ఆరోగ్యం..

ఫ్రక్టోజ్ అధికంగా ఉండే ఆహారాలు(స్వీట్స్) ఫ్యాటీ లివర్ ప్రమాదాన్ని పెంచుతాయి. అధిక చక్కెర వినియోగం వల్ల అధిక కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ పెరిగి, అధిక రక్తపోటు వంటి సమస్యలు వస్తాయి. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని మరింత పెంచుతాయి. అలాంటప్పుడు చక్కెరను తగ్గించడం వల్ల.. గుండె, కాలేయానికి మేలు జరుగుతుందని కొన్ని పరిశోధనలు తెలిపాయి. అలాగే స్వీట్స్ తినడం వల్ల వచ్చే ఎనర్జీ తక్షణమే తగ్గిపోయి, అలసటకు దారితీస్తుందని నిపుణులు చెప్తున్నారు.

ఆరోగ్యం, ఇంటి చిట్కాల గురించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ ఆర్టికల్స్ కోసం దీనిని క్లిక్ చేయండి.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breastfeeding Diet : తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
Wearing Slippers at Home : ఇంట్లో చెప్పులు వేసుకుని నడవాలా? లేక చెప్పులు లేకుండా నడవాలా? ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా?
ఇంట్లో చెప్పులు వేసుకుని నడవాలా? లేక చెప్పులు లేకుండా నడవాలా? ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా?
High Uric Acid : యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
Cheating in Relationships : చీటింగ్ చేయడంలో మగవారు, ఆడవారికి మధ్య తేడాలు ఉంటాయా? వివాహేతర సంబంధాలకి కారణాలు ఇవే
చీటింగ్ చేయడంలో మగవారు, ఆడవారికి మధ్య తేడాలు ఉంటాయా? వివాహేతర సంబంధాలకి కారణాలు ఇవే
Advertisement

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Utnoor Gond Fort: ఎకో టూరిజం కేంద్రంగా గోండు రాజుల చారిత్రాత్మక కోట అభివృద్ధి
ఎకో టూరిజం కేంద్రంగా గోండు రాజుల చారిత్రాత్మక కోట అభివృద్ధి
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
Embed widget