అన్వేషించండి

Real Causes of Diabetes : స్వీట్స్ మానేస్తే డయాబెటిస్ రాదా? షుగర్ రావడానికి అసలు కారణాలు ఇవే అంటోన్న నిపుణులు

Quitting Sweets : స్వీట్స్ మానేస్తే డయాబెటిస్ రాదని చాలామంది అనుకుంటారు. ఇది ఎంతవరకు నిజం? కేవలం షుగర్స్ తీసుకోవడం మానేస్తే మధుమేహం రాకుండా ఉంటుందా? నిపుణులు ఏమంటున్నారు ?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • సమతుల్య ఆహారం, వ్యాయామం, ఒత్తిడి తగ్గించుకుంటే మధుమేహం అదుపులో ఉంటుంది.

Biggest Diabetes Myth : ఈ మధ్యకాలంలో దాదాపు ప్రతి ఇంట్లోనూ డయాబెటిస్​కు భయపడి స్వీట్స్ మానేస్తున్నారు. లేదా ఎవరైనా తింటుంటే తక్కువగా తినండి.. లేకుంటే మీకు మధుమేహం వస్తుంది అనే వార్నింగ్ ఇస్తున్నారు. దీంతో చాలామంది స్వీట్స్, షుగర్ డ్రింక్స్ మానేస్తున్నారు. ఓ రకంగా ఇది మంచి విషయమే. కానీ చాలామంది ఏమనుకుంటున్నారంటే.. స్వీట్స్ మానేస్తున్నాను కాబట్టి నాకు షుగర్ రాదు అనే భావనలో ఉంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? నిపుణులు ఏమంటున్నారు?

స్వీట్స్ మానేస్తే మధుమేహం రాదా?

మధుమేహం కేవలం స్వీట్స్ తినడం వల్ల మాత్రమే వస్తుందా? లేద దాని వెనుక మరేదైనా ఇతర కారణం ఉందా? అనే ప్రశ్నకు నిపుణులు ఇలా ఆన్సర్ ఇస్తున్నారు. శరీరంలో ఇన్సులిన్ అనే హార్మోన్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల మధుమేహం వస్తుంది. ఇది బాడీలో గ్లూకోజ్​ను నియంత్రించలేనప్పుడు.. శరీరం గ్లూకోజ్​ను సరిగ్గా ఉపయోగించుకోలేనప్పుడు.. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి.. మధుమేహానికి దారితీస్తాయి. 

కేవలం స్వీట్స్ తినడం వల్ల మాత్రమే మధుమేహం రాదు. కొనీ చెడు ఆహారపు అలవాట్లు, సరైన జీవనశైలి లేకపోవడం వల్ల డయాబెటిస్ ప్రమాదం పెరుగుతుంది. అందుకే స్వీట్స్ మానేసిన వారిలో కూడా షుగర్ కంప్లైంట్స్ వస్తాయని నిపుణులు అంటున్నారు. పైగా మధుమేహంలో ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి. అవి ఇన్సులిన్​ను వివిధ రకాలుగా ప్రభావితం చేస్తాయి. 

మధుమేహం రకాలు..

టైప్ 1 మధుమేహంలో.. శరీర రోగనిరోధక వ్యవస్థ పొరపాటున ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే కణాలను దెబ్బతీస్తుంది. టైప్ 2 మధుమేహంలో.. శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించుకోలేదు లేదా ఇన్సులిన్ ప్రభావం తగ్గిపోతుంది. ఈ రెండింటికీ స్వీట్స్​తో ప్రత్యక్ష సంబంధం ఉండదు. కానీ సరైన జీవనశైలి లేకపోవడం వల్ల ఇవి మరింత ఎక్కువ కావచ్చు. 

మధుమేహానికి అసలు కారణాలు..

నిపుణుల ప్రకారం స్వీట్స్ నేరుగా మధుమేహానికి కారణం కాదు. కానీ ఒక వ్యక్తి ప్రతిరోజూ ఎక్కువగా స్వీట్స్ తింటూ.. కూల్ డ్రింక్స్ తాగుతూ.. ఫాస్ట్ ఫుడ్ తీసుకుంటే.. అది బరువు పెరగడానికి దారితీస్తుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు తరచుగా పెరుగుతాయి. దీనివల్ల ఇన్సులిన్‌పై ఒత్తిడి పెరుగుతుంది. ఇది భవిష్యత్తులో మధుమేహం వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.

అలాగే ఫ్యామిలీలో ఎవరికైనా మధుమేహం ఉన్నా.. అధిక ఒత్తిడి, ఆందోళన.. శారీరక శ్రమ తక్కువగా ఉన్నవారిలో కూడా మధుమేహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంటే ఇది కేవలం ఆహార సంబంధిత రోగం కాదు.. శారీరక, మానిసక సమస్యల వల్ల ఎటాక్ చేస్తుందని గుర్తించుకోవాలి. 

షుగర్ ప్రారంభ లక్షణాలు..

రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగితే.. తరచుగా మూత్రవిసర్జనకు వెళ్తారు. అధిక దాహం, అలసట, నీరసం, గాయాలు నెమ్మదిగా మానడం, అప్పుడప్పుడు తల తిరగడం వంటి కొన్ని లక్షణాలు కనిపించవచ్చు.

ఎలా కంట్రోల్ చేయవచ్చంటే..

మధుమేహాన్ని నివారించడానికి షుగర్స్ పూర్తిగా మానాల్సిన అవసరం లేదు. కానీ సమతుల్యత చాలా అవసరం. ప్రతిరోజూ తేలికపాటి వ్యాయామం లేదా యోగా చేయండి. రెగ్యులర్​గా నడవండి. సమతుల్య ఆహారం తీసుకోండి. జంక్ ఫుడ్, శీతల పానీయాలను పరిమితం చేయండి. బరువును అదుపులో ఉంచుకోండి. ఒత్తిడిని తగ్గించుకుని బాగా నిద్రపోండి. ఇవన్నీ మధుమేహం రాకుండా ఉండేందుకు.. వచ్చినా అదుపులో ఉంచుకునేందుకు హెల్ప్ చేస్తాయి. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Castor Oil for Hair : ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
Korean Glass Skin Drink : కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Independence Day Quiz Questions : ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
Independence Day Speech : స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Devdutt Padikkal Century: శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
Comrade Kalyan Release Date : మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Anam Ramanarayana Reddy:తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
Embed widget