అన్వేషించండి

2-Day Oats Diet : ఓట్స్ డైట్ 2 రోజులు ఫాలో అయితే.. శరీరంలో జరిగే మార్పులు ఇవే, న్యూ స్టడీలో ఇంట్రెస్టింగ్ విషయాలు

Oats Diet : కొలెస్ట్రాల్ నియంత్రించుకోవాలంటే.. రెండ్రోజులు ఓట్స్ డైట్ ఫాలో అయితే సరిపోతుందని తాజా అధ్యయనం తెలిపింది. మరి దీనివల్ల లాభం, నష్టం ఏంటో చూసేద్దాం. 

Oats Diet and Its Impact on Cholesterol : ఓట్స్​ని చాలామంది తమ డైట్​లో తీసుకుంటారు. ముఖ్యంగా ఫిట్​గా ఉండాలనుకునేవారు వీటిని రెగ్యులర్​గా తింటారు. బ్రేక్​ఫాస్ట్​గా, ఈవెనింగ్ స్నాక్​గా చాలామంది వీటిని డైట్​లో చేర్చుకుంటార. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయని నమ్ముతారు. ముఖ్యంగా ఫ్యాట్ కంట్రోల్ అవుతుందని అంటారు. దీనిలో భాగంగానే రెండ్రోజులు కేవలం ఓట్స్ తింటే ఏమవుతుందనే దానిపై అధ్యయనం చేశారు. 

పరిశోధనలోని ఇంట్రెస్టింగ్ విషయాలు

యూనివర్సిటీ ఆఫ్ బాన్ కేవలం రెండ్రోజులు ఓట్స్ ఆధారిత డైట్ ఫాలో అయితే ఏమవుతుందనే దానిపై అధ్యయనం చేసింది. ఈ డైట్​ ఫాలో అయితే శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలు గణనీయంగా తగ్గుతాయని గుర్తించారు. అలాగే ఈ ప్రభావం దాదాపు ఆరు వారాల వరకు కొనసాగుతుందని తెలుసుకున్నారు. 

మెటబాలిక్ సిండ్రోమ్ పేషెంట్స్

ఈ అధ్యయనంలో పాల్గొన్న అందరూ మెటబాలిక్ సిండ్రోమ్ సమస్యతో బాధపడుతున్నారట. అంటే అధిక బరువు, అధిక రక్తపోటు, రక్తంలోని అధిక చక్కెరతో పాటు లిపిడ్ స్థాయిలు ఉన్నవారినే ఎంచుకున్నారట. అధిక కొలెస్ట్రాల్​తో ఇబ్బంది పడేవారు ఈ డైట్​ ఫాలో అయితే మంచి ఫలితాలు పొందవచ్చు. 

ఓట్స్ ఎలా పని చేస్తాయంటే..

ఓట్​మీల్​లో ఉండే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ అని పిలిచే LDL కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. క్లినికల్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ దీపాలి శర్మ ప్రకారం.. ఓట్స్ క్రమం తప్పకుండా తినడం వల్ల LDL కొలెస్ట్రాల్ తగ్గి.. గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుంది.

ఓట్స్ వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు

బరువు నియంత్రణలో ఉంటుంది. దీనిలోని ఫైబర్ ఎక్కవసేపు కడుపు నిండేలా చేస్తుంది. దీంతో మొత్తం కేలరీల తీసుకోవడం తగ్గుతుంది. అలాగే ఓట్స్‌లోని సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు నెమ్మదిగా జీర్ణమవుతాయి. కాబట్టి చక్కెర స్థాయిలు ఒకేసారి పెరగకుండా క్రమంగా విడుదలవుతాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఇది చాలా మేలు చేస్తుంది. అలాగే దీనిలోని ఫైబర్ మలబద్ధకాన్ని నివారిస్తుంది.

ఎలాంటి ఓట్స్ ఎంచుకుంటే మంచిదంటే

స్టీల్-కట్ ఓట్స్ నెమ్మదిగా జీర్ణమవుతాయి. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువసేపు కడుపు నిండినట్లు ఉంటుంది. రోల్డ్ ఓట్స్ సాధారణంగా వాడే రకం. ఇవి మృదువైన ఆకృతితో ఎక్కువ ద్రవాన్ని పీల్చుకుంటాయి. ఇన్‌స్టంట్ ఓట్స్ ఈజీగా చేసుకోవచ్చు. బిజీ లైఫ్​స్టైల్​ ఉండేవారికి ఇవి అనుకూలంగా ఉంటాయి. అయితే మీరు ఓట్స్ డైట్లో చేర్చుకునే ముందు కచ్చితంగా వైద్యుల సూచనలు తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Desk Job Joint Pain : డెస్క్ ఉద్యోగుల్లో పెరుగుతోన్న కీళ్ల నొప్పులు..ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్తోన్న నిపుణులు
డెస్క్ ఉద్యోగుల్లో పెరుగుతోన్న కీళ్ల నొప్పులు..ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్తోన్న నిపుణులు
High BP : అధిక రక్తపోటు ఉందని ఈ లక్షణాలతో గుర్తించవచ్చా? తలనొప్పి నుంచి చూపు మసకబారడం వరకు.. జాగ్రత్త
అధిక రక్తపోటు ఉందని ఈ లక్షణాలతో గుర్తించవచ్చా? తలనొప్పి నుంచి చూపు మసకబారడం వరకు.. జాగ్రత్త
Snake Gourd Dal : పొట్లకాయతో ఇలా పప్పు చేసుకోండి.. వేడి వేడి అన్నంలో, వడియాల కాంబినేషన్​తో తింటే ఆ రుచే వేరు
పొట్లకాయతో ఇలా పప్పు చేసుకోండి.. వేడి వేడి అన్నంలో, వడియాల కాంబినేషన్​తో తింటే ఆ రుచే వేరు
Yoga Poses for Lower Back : నడుమునొప్పి ఇబ్బంది పెడుతుందా? నిద్రలేవగానే ఈ 5 ఆసనాలు వేయండి.. చాలా రిలీఫ్ వస్తుంది
నడుమునొప్పి ఇబ్బంది పెడుతుందా? నిద్రలేవగానే ఈ 5 ఆసనాలు వేయండి.. చాలా రిలీఫ్ వస్తుంది

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
AP NDA Seat Sharing: సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
APPSC Group 2: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
Droupadi Murmu Durga Temple Visit: ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
భక్తులకు అలర్ట్.. ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Salur Municipal Chairperson Post: పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
Shikhar Dhawan Warning: పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
Dalit Denied Entry to Temple: గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
Embed widget