అన్వేషించండి

DRDO : త్వరలో మేడిన్ ఇండియా మానవ రహిత యుద్ధ విమానాలు - డీఆర్డీవో లెటెస్ట్ సక్సెస్ స్టోరీ ఇదిగో

మానవ రహిత యుద్ధ విమానం తయారీ దిశగా డీఆర్డీవో గొప్ప విజయం సాధించింది. అటానమస్ ఫ్లయింగ్ వింగ్ టెక్నాలజీ డెమోన్‌స్ట్రేటర్ తొలి విమానాన్ని విజయవంతంగా పరీక్షించింది.

DRDO :   రక్షణ రంగంలో స్వావలంబన దిశగా భారత్ మరో ముందడుగు వేసింది.  డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆర్గ‌నైజేష‌న్ ( DRDO ) అటానమస్ ఫ్లయింగ్ వింగ్ టెక్నాలజీ డెమోన్‌స్ట్రేటర్ తొలి విమానాన్ని విజయవంతంగా పరీక్షించింది.  దీంతో మానవ రహిత యుద్ధ విమానం తయారీ దిశగా డీఆర్డీవో గొప్ప విజయం సాధించింది. ఈ తొలి విమానాన్ని డీఆర్డీవో కర్ణాటకలోని చిత్రదుర్గ్ ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ నుంచి శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది.  

ఇది మానవ రహిత గగనతల విమానం ( UAC). ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను డీఆర్డీవో  వెల్లడించింది.  వ్యూహాత్మక రక్షణ సాంకేతికతలో స్వావలంబన దిశగా ఇది ఒక ముఖ్యమైన దశ అని డీఆర్డీవో పేర్కొంది. ఈ మానవ రహిత గగనతల విమానాన్ని డీఆర్డీవో పరిశోధనా ప్రయోగశాల‌ల్లో ఒకటైన బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ ( ADE ) రూపొందించింది. ఏడీఈ శాస్త్ర‌వేత్త‌లు దీన్ని అభివృద్ధి చేశారు. ఈ యూఏవీ ఒక చిన్న టర్బోఫ్యాన్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది పూర్తిగా తనంతట తాను పని చేస్తుంది. టేకాఫ్ నుంచి వే పాయింట్‌ నేవిగేషన్, ల్యాండింగ్ వ‌ర‌కు క‌చ్చిత‌మైన ప‌నితీరును ప్ర‌ద‌ర్శించింద‌ని డీఆర్డీవో తెలిపింది. భవిష్యత్తులో మానవ రహిత విమానాల అభివృద్ధికి ఈ పరీక్ష గొప్ప మైలురాయి లాంటిద‌ని పేర్కొంది.డీఆర్డీవో శాస్త్రవేత్తలను రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అభినందించారు. 

 ఈ ప్రయోగంతో భారత్ యుద్ధ విమానాలవిషయంలోనూ ఇతర దేశాలపై ఆధారపడాల్సిన పరిస్థితి తగ్గిపోతుందని భావిస్తున్నారు.  ఇప్పటికే డీఆర్డీవో భారత  రక్షణ రంగ అవసరాలు తీర్చడానికి ఎన్నో రకాల పరిశోధనలు చేసి అద్భుతమైన ఫలితాలను సాధిస్తోంది. ఈ క్రమంలో యుద్ధ విమానాల దిశగా ముందడుగు వేయడం రక్షణ రంగ నిపుణుల్ని సంతృప్తి పరుస్తోంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Best Selling Cars: టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Best Selling Cars: టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
Best Selling Smartphones: 2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Embed widget