అన్వేషించండి

Sonam Wangchuk Letter:సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ! నిరాహార దీక్ విరమణకు షరతులు!

Sonam Wangchuk Letter:నీట్‌ ప్రశ్నాప్రత్రం లీకేజీ వ్యవహారంలో దీక్ష చేస్తున్న సోనమ్‌ వాంగ్‌చుక్ కేంద్రానికి లేఖ రాశారు. తన డిమాండ్లకు అంగీకరిస్తే నిరశన విరమిస్తానని స్పష్టం చేశారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ప్రభుత్వం కోరినప్పటికీ, సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష ఆసుపత్రిలో కొనసాగుతోంది.
  • నీట్ పరిహారం, పార్లమెంట్ చర్చ, మంత్రి రాజీనామా ఆయన ప్రధాన డిమాండ్లు.
  • డిమాండ్లు నెరవేరితే దీక్ష విరమిస్తా, ఆందోళనకారులపై చర్యలు వద్దు.

Sonam Wangchuk Letter:ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ప్రారంభించిన నిరాహార దీక్షను సోనమ్‌ వాంగ్‌చుక్ ఆసుపత్రిలో కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్న వేళ దీక్ష విరమించాలని ప్రభుత్వం నుంచి రెప్రజెంటేషన్ వెళ్లింది. దీనికి స్పందనగా ఆయన కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అందులో కీలకమైన డిమాండ్లు ఉంచారు. వాటిని అమలు చేసిన వెంటనే దీక్ష విరమిస్తానని స్పష్టం చేశారు. 

సోనమ్ వాంగ్‌చుక్ చేసిన డిమాండ్లు ఏంటీ?

నీట్ ప్రశ్నాపత్రం తర్వాత  ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలు పరిహారం, పార్లమెంట్‌లో దీనిపై చర్చ, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలనే ప్రధానమైన డిమాండ్‌లను వాంగ్‌చుక్ కేంద్రం ముందు ఉంచారు. తన లేఖలో కేంద్రమంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌కు కృతజ్ఞత చెప్పారు. తనను ఆసుపత్రిలో పరామర్శించి ఆరోగ్య గురించి తెలుసుకున్నందుకు ఆయన థాంక్స్ చెప్పారు. 

Image

తాను కేంద్రానికి రాసిన లేఖలో ఇలా రాసుకొచ్చారు."ఆసుపత్రికి వచ్చి తనతో జరిపిన చర్చల్లో పేపర్ లీక్ తర్వాత ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు తగిన పరిహారం అందించడం, జవాబుదారీ తనాన్ని పెంచేలా పార్లమెంట్‌లో చర్చ జరపడం, విద్యాశాఖ మంత్రి రాజీనామా పరిశీలన సహా అన్ని అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు."

చాలా మంది ఎంపీలు, శ్రేయోభిలాషులు దీక్ష విరమించాలని విజ్ఞప్తి చేశారని వాంగ్‌చుక్ గుర్తు చేశారు. కేంద్రమంత్రులు వచ్చి వెళ్లిన తర్వాత చాలా దాదాపు 65 మంది ఎంపీలు నాకు లేఖలు రాశారు. కొందరు వచ్చి నన్ను పరామర్శించారు. ఇంకా చాలా మంది వస్తున్నారు. వారంతా నిరాహార దీక్ష విరమించాలని కోరుతున్నారు. దేశ సేవలో ఇంకా చాలా పని చేయాల్సి ఉందని గుర్తు చేస్తున్నారు. నేను వారితో ఏకీభవిస్తాను." అని తెలిపారు. 

అందరూ చెప్పినట్టు చేయడానికి తాను సిద్ధమని ప్రకటించారు.కానీ విద్యార్థులు, యువతకు అన్యాయం చేస్తూ తాను ముందుకు సాగలేనని పేర్కొన్నారు. " నేను బతకాలనుకుంటున్నాను. నా విద్యార్థుల వద్దకు, విద్యారంగానికి, నా జీవితానికి అర్థాన్నిచ్చిన పనికి తిరిగి వెళ్లాలనే ఉంది. కానీ ఎవరి కోసం ఈ పోరు మొదలు పెట్టానో ఆ యువతరం ప్రయోజనాలకు నష్టం కలిగించి నేను అలా చేయలేను." అని అన్నారు. 

జులై 20న జరిగిన చలో పార్లమెంట్‌ మార్చ్ శాంతియుతంగా సాగింది: వాంగ్‌చుక్‌

జులైన 20న జరిగిన చలో పార్లమెంట్‌ మార్చ్ గురించి వాంగ్‌చుక్ ప్రస్తావించారు. పోలీసుల దౌర్జన్యంగా వ్యవహరించినా యువత సంయమనం పాటించారని  శాంతియుతంగా వ్యవహరించారని చెప్పారు. " పోలీసుల దౌర్జన్యాలను, బలప్రయోగాన్ని ఎదురొడ్డి జూలై 20న జరిగిన చలో పార్లమెంట్‌ మార్చ్ శాంతియుతంగా జరిగింది. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే వారి సహనాన్ని, సంకల్పాన్ని దేశం, ప్రపంచం చూశాయి. ఇందులో పాల్గొన్న వారిపై తీసుకున్న ఎలాంటి చట్టపరమైన చర్యలు, వేధింపులు లేదా ప్రతీకార చర్యలు ప్రజాస్వామ్య సంస్లై వారికున్న విశ్వాసాన్ని దెబ్బతీయవని నేను ఆశిస్తున్నాను"

ఎవరిపైనా చర్యలు తీసుకోవద్దు: వాంగ్‌చుక్

ఈ పోరాటంలో పాల్గొన్న యువతరంపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని హామీ ఇవ్వాలని సోనమ్‌ వాంగ్‌చుక్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బాధ్యతాయుతమైన విద్యా వ్యవస్థ కోసం గళం విప్పడమే వారి నేరమా అని ప్రశ్నించారు." అలాంటి హామీలు ఇస్తే ప్రభుత్వం నా విజ్ఞప్తిని వినడమే కాకుండా లక్షలాది మంది యువ భారతీయుల ఆకాంక్షలను కూడా అర్థం చేసుకుందనే నమ్మకంతో నా దీక్షను విరమిస్తాను" అని లేఖలో స్పష్టం చేశారు. 

Frequently Asked Questions

సోనమ్ వాంగ్‌చుక్ దీక్షను ఎక్కడ ప్రారంభించి, ఎక్కడ కొనసాగిస్తున్నారు?

ఆయన ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద నిరాహార దీక్ష ప్రారంభించి, ప్రస్తుతం ఆసుపత్రిలో కూడా దానిని కొనసాగిస్తున్నారు.

సోనమ్ వాంగ్‌చుక్ ప్రధాన డిమాండ్లు ఏమిటి?

ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం, పార్లమెంట్‌లో చర్చ, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలనేవి ఆయన ముఖ్యమైన డిమాండ్లు.

కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో ప్రభుత్వం యొక్క వైఖరి గురించి ఆయన ఏమి పేర్కొన్నారు?

విద్యార్థులకు పరిహారం, పార్లమెంట్‌లో చర్చ, మంత్రి రాజీనామాపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని కేంద్రమంత్రులు చెప్పారని ఆయన లేఖలో తెలిపారు.

సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమించడానికి షరతు ఏమిటి?

పోరాటంలో పాల్గొన్న యువతపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని ప్రభుత్వం హామీ ఇస్తే, అప్పుడు తాను దీక్ష విరమిస్తానని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

IRCTC Japan Tour Package : IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
NMMSS Scholarship 2026-27 : NMMSS స్కాలర్‌షిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభం, ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకోండి
NMMSS స్కాలర్‌షిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభం, ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకోండి
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
Vizag and Vijayawada Metro Rail:విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
Gold- Silver Price Today 10 August 2026: ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
Korean Kanakaraju Collections Day 3 : కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
PM Modi CWG: గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
AP Municipal Elections: ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
Embed widget