అన్వేషించండి

Constable Revathi: కానిస్టేబుల్ రేవతి సాహసంతోనే సాతంకుళం తీర్పు! ఎన్ని బెదిరింపులు వచ్చినా వెనక్కి తగ్గని పోలీసు కథ!

తమిళనాడు సాతంకుళంలో తండ్రీకొడుకుల కస్టడీ మరణాల కేసులో 9 మంది పోలీసులకు కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ తీర్పు వెనుక హెడ్ కానిస్టేబుల్ రేవతి ప్రాణాలకు తెగించి చెప్పిన సాక్ష్యం కీలకంగా నిలిచింది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కస్టడీలో తండ్రీకొడుకుల హింస కేసులో తొమ్మిది మంది పోలీసులకు మరణశిక్ష.
  • లాక్‌డౌన్ సమయంలో షాప్ ఎక్కువసేపు తెరిచినందుకు అదుపులోకి తీసుకున్నారు.
  • పోలీసుల అరాచకాన్ని కానిస్టేబుల్ రేవతి సాక్ష్యంతో బయటపెట్టారు.
  • ఐదేళ్ల న్యాయపోరాటం తర్వాత దోషులకు శిక్ష, చట్టం అందరికీ సమానం.

Constable Revathi: భారత్‌ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన తమిళనాడులోని సాతంకుళం. కస్టడీలో ఉన్న తండ్రీ కొడుకులను అతి దారుణంగా హింసించి ప్రాణాలు తీసిన కేసులో తొమ్మిది మంది పోలీసులకు మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. సరిగ్గా ఐదేళ్ల క్రితం 2020లో జరిగిన ఈ ఉదంతం, దేశంలో పోలీసు వ్యవస్థలోని అరాచకాలను ఎత్తి చూపింది. ఈ సుదీర్ఘ న్యాయ పోరాటంలో దోషులకు శిక్ష పడేలా చేయడంలో ఒక సామాన్య కానిస్టేబుల్ చూపిన సాహసం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

ఆ రాత్రి ఏం జరిగింది?

2020 జూన్‌ నెలలో కరోనా లాక్‌-డౌన్‌ నిబంధనలు అమలులో ఉన్న సమయంలో సాతంకుళంలో మొబైల్‌ షాపు నడుపుతున్న పి. జయరాజ్, ఆయన కుమారుడు జె. బెన్నిక్స్ తమ దుకాణాన్ని నిర్ణీత సమయం కంటే ఎక్కువ సేపు తెరిచి ఉంచారనే ఆరోపణలతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ రాత్రి పోలీస్ స్టేషన్‌లో జరిగిన హింస వర్ణనాతీతం. పోలీసులు తమ విచక్షణను మరిచి, లాఠీలతో, బూటు కాలితో వారిపై విరుచుకుపడ్డారు. 

మపులు తిప్పిన రేవతి సాక్ష్యం 

ఈ కేసులో 9 మంది పోలీసులకు ఉరిశిక్ష పడటంలో కీలక పాత్ర పోషించింది హెడ్ కానిస్టేబులు రేవతి. అదే స్టేషన్‌లో పని చేస్తున్న ఆమె, తన తోటి అధికారులు చేస్తున్న అరాచకాన్ని కళ్లారా చూసింది. ఉన్నతాధికారుల నుంచి బెదిరింపులు ఎదురవుతున్నా, తన ఉద్యోగానికి, కుటుంబానికి ముప్పు ఉందని తెలిసినా ఆమె వెనక్కి తగ్గలేదు. జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ ఎంఎస్‌ భారతీ దాసన్ విచారణకు వచ్చినప్పుడు " సార్ నేను ప్రతి విషయాన్ని చెబుతారు. దాచిన విషయాలు వెలుగులోకి తీసుకొస్తాను. కానీ నా ఇద్దరు చిన్న పిల్లల భద్రతకు మీరు హామీ ఇవ్వగలరా" అని ఆమె అడిగిన ప్రశ్న ఆమెలోని భయాన్ని, అదే సమయంలో ఆమెకున్న ధైర్యాన్ని చాటిచెప్పింది. 

హింసకు పరాకాష్ట

రేవతి తన సాక్ష్యంలో ఆ రాత్రి జరిగిన దారుణాలను వివరించారు. పోలీసులు బాధితులను బట్టలు విప్పి దారుణంగా కొట్టడమే కాకుండా, వారి ప్రైవేటు భాగాలపై బూట్లతో తొక్కారు. అంత హింస జరుగుతున్నా, పోలీసులు మధ్య మధ్యలో మద్యం సేవించి మరీ మళ్లీ కొట్టేవారని ఆమె వెల్లడించారు. తండ్రీ కొడుకులు స్పృహ కోల్పోయిన స్థితిలో ఉన్నప్పుడు రేవతి జయరాజ్‌కు కాఫీ ఇవ్వబోగా, ఇతర సిబ్బంది దానిని విసిరికొట్టారు. ఆ హింసను చూడలేక ఆమె అక్కడ నుంచి వెళ్లిపోయారు. 

రేవతికి బెదిరింపులు 

సాక్ష్యం చెప్పకుండా రేవతిని తోటి పోలీసులు తీవ్రంగా ఒత్తిడి చేశారు. మేజిస్ట్రేట్‌ విచారణ జరుగుతున్న సమయంలో కూడా స్టేషన్ బయటకు పోలీసులు గుమిగూడి రేవతిని భయపెట్టే ప్రయత్నం చేశారు. పరిస్థితి ఎంత ఉద్రిక్తంగా మారిందంటే, రేవతి తన స్టేట్‌మెంట్‌పై సంతకం చేయడానికి కూడా తొలుత భయపడ్డారు. మద్రాస్‌ హైకోర్టు జోక్యం చేసుకొని ఆమెకు, ఆమె కుటుంబానికి రక్షణ కల్పించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. ప్రభుత్వం ఆమె భద్రత కోసం ఇద్దరు కానిస్టేబుళ్లను నియమించింది. 

న్యాయం ఎలా గెలిచింది?

ఈ కేసులో సీసీటీవీ ఫుటేజీని విశ్లేషించి, నిందితులను గుర్తించడంలో రేవతి సాక్ష్యం ఎంతో సహయపడింది. ఐదేళ్లపాటు సాగిన ఈ కేసులో చివరికి న్యాయస్థానం సహాయపడింది. ఐదేళ్లపాటు సాగిన ఈ కేసులో చివరికి న్యాయస్థఆనం పోలీసులకు మరణశిక్ష విధించడం ద్వారా, చట్టం ముందు ఎవరూ అతీతులుకారని నిరూపితమైంది. 

Frequently Asked Questions

సాతంకుళం కేసులో తండ్రీ కొడుకులకు ఏం జరిగింది?

2020 జూన్ లో లాక్‌-డౌన్‌ నిబంధనలు అతిక్రమించారనే ఆరోపణలపై పోలీసులు జయరాజ్, బెన్నిక్స్ లను అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్‌లో వారిని దారుణంగా హింసించి ప్రాణాలు తీశారు.

ఈ కేసులో 9 మంది పోలీసులకు మరణశిక్ష పడటానికి కారణమేంటి?

అదే స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ రేవతి ధైర్యంగా సాక్ష్యం చెప్పడమే 9 మంది పోలీసులకు శిక్ష పడటానికి ప్రధాన కారణం. ఆమె నేరుగా జరిగిన హింసను వివరించారు.

కానిస్టేబుల్ రేవతికి ఎలాంటి బెదిరింపులు ఎదురయ్యాయి?

సాక్ష్యం చెప్పకుండా ఉండేలా తోటి పోలీసులు రేవతిని తీవ్రంగా ఒత్తిడి చేశారు. ఆమె ఉద్యోగానికి, కుటుంబానికి ముప్పు ఉందని తెలిసినా ఆమె వెనక్కి తగ్గలేదు.

ఈ కేసులో న్యాయం ఎలా గెలిచింది?

ఐదేళ్లపాటు సాగిన ఈ సుదీర్ఘ న్యాయ పోరాటంలో, రేవతి సాక్ష్యం, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా న్యాయస్థానం పోలీసులకు మరణశిక్ష విధించింది. చట్టం ముందు ఎవరూ అతీతులు కారని నిరూపితమైంది.

టాప్ హెడ్ లైన్స్

El Nino Food Price Rise: ఎల్‌నినో పేరిట దోపిడీ - దేశంలో ధాన్యానికి కొరత లేకపోయినా ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
ఎల్‌నినో పేరిట దోపిడీ - దేశంలో ధాన్యానికి కొరత లేకపోయినా ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Aurora Venkateswara Swamy Temple Mass Shooting Plot: అమెరికాలో వెంకటేశ్వరస్వామి ఆలయంలో మారణకాండకు కుట్ర - 19 ఏళ్ల శ్వేతజాతి ఉన్మాది అరెస్ట్!
అమెరికాలో వెంకటేశ్వరస్వామి ఆలయంలో మారణకాండకు కుట్ర - 19 ఏళ్ల శ్వేతజాతి ఉన్మాది అరెస్ట్!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
YS Jagan YSRCP Local Body Elections: స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
CM Revanth Reddy: ముఖానికి నాట్లు వేసుకొని తిరుగుతున్నాడు.. KTRపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు
ముఖానికి నాట్లు వేసుకొని తిరుగుతున్నాడు.. KTRపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు
సన్‌రూఫ్ నుంచి 360 డిగ్రీ కెమెరా వరకు.. Mahindra XUV 3XOలో ఏ వేరియంట్‌లో ఏ ఫీచర్లు ఉన్నాయో తెలుసా?
మహీంద్రా XUV 3XOలో 12 వేరియంట్లు.. ఏది కొంటే బెస్ట్? మీ బడ్జెట్‌కు తగ్గ మోడల్ ఏది?
Anupama Parameswaran : పెళ్లికి ముందే బిడ్డ కావాలని ఉండేది - సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నా... అనుపమ పరమేశ్వరన్ రియాక్షన్
పెళ్లికి ముందే బిడ్డ కావాలని ఉండేది - సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నా... అనుపమ పరమేశ్వరన్ రియాక్షన్
Starc Availability Uncertainty: నెక్స్ట్ సీజన్ కు స్టార్క్ దూరం కానున్నాడా..! ఆ కార‌ణంతో ఫ్రాంచైజీలకు టెన్షన్
నెక్స్ట్ సీజన్ కు స్టార్క్ దూరం కానున్నాడా..! ఆ కార‌ణంతో ఫ్రాంచైజీలకు టెన్షన్
YS Jagan Cockroach Janata Party Support: CJP నేతలకు జగన్ సంపూర్ణ మద్దతు - బీజేపీతో వైఎస్సార్‌సీపీ దోస్తీకి శాశ్వత ముగింపేనా?
CJP నేతలకు జగన్ సంపూర్ణ మద్దతు - బీజేపీతో వైఎస్సార్‌సీపీ దోస్తీకి శాశ్వత ముగింపేనా?
Embed widget