Tamil Nadu Lockup Death Issue: తమిళనాడు ప్రభుత్వానికి పెను సమస్యగా మారిన లాకప్ డెత్ - పోలీసులు కొట్టి చంపిన వీడియో వైరల్ - రాక్షసులే!
TamilNadu: తమిళనాడులో అజిత్ కుమార్ అనే యువకుడి లాకప్ డెత్ అంశం కలకలం రేపుతోంది. డీఎంకే ప్రభుత్వంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

LockUp death:తమిళనాడులో డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఓ యువకుడ్ని పోలీసులు కొట్టి చంపిన అంశం దీనికి కారణం. శివగంగా జిల్లాలోని మదపురం కాళీఅమ్మన్ ఆలయంలో గార్డుగా పనిచేస్తున్న 27 ఏళ్ల అజిత్ కుమార్ ను పోలీసులు కొట్టిచంపేశారు. ఒక మహిళ తన కారులో 80 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ అయ్యాయని అతనిపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కస్టడీలో చనిపోయాడు. పోలీసులు లాఠీలతో చితకబాదుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
పోలీసులు ఎఫ్‌ఐఆ చోరీ అయిన ఆభరణాలను దాచిన గోశాల వద్ నుంచి ద తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ మరణించాడని పేర్కొన్నారు. అజిత్ శరీరంపై 44 గాయాలు ఉన్నాయని గుర్తించారు. మిర్చి పొడి అతని వీపు, నోటి, చెవులపై రాసినట్లు తేలింది. కుటుంబసభ్యులు పోలీసులే చంపేశారని చెప్పి కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు ఈ గాయాలు తీవ్రమైన హింసను సూచిస్తాయని మద్రాస్ హైకోర్టు పేర్కొంది. అజిత్‌ను "తీవ్రవాది"గా ఎందుకు చూశారని, ఆయుధాలు లేని వ్యక్తిపై ఇంత హింసను ఎందుకు ఉపయోగించారని పోలీసులను ప్రశ్నించింది. ఈ ఘటనను "రాష్ట్రం తన సొంత పౌరుడిని చంపింది" అని వ్యాఖ్యానించింది.
Shocking visuals of custodial torture and the death of #AjithKumar in #TamilNadu have emerged.
— Hate Detector 🔍 (@HateDetectors) July 1, 2025
Disturbing footage shows Crime Branch officers brutally assaulting Ajith Kumar near a temple premises.#JusticeForAjithKumar pic.twitter.com/Wgf4zWGRDK
తీవ్రమైన విమర్శలు రావడంతో సీఎం ఎం.కె. స్టాలిన్ కేసును సీబీఐ దర్యాప్తు చేయాలని సిఫారసు చేశారు. అజిత్ తల్లికి ఫోన్ చేసి క్షమాపణలు చెప్పి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఐదుగురు పోలీసు సిబ్బంది అరెస్టయ్యారు, ఎస్పీని బదిలీ చేశారు. కానీ హైకోర్టు ఈ చర్యలు సరిపోవని తెలిపింది. డీఎంకే ప్రభుత్వం హయాంలో 24 లాకప్ డెత్‌లు జరిగాయని, తమిళనాడును "లాకప్ డెత్‌ల మాతృభూమి"గా మార్చిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
Disturbing visuals from Sivaganga show Ajith Kumar, a 27-year-old temple security guard, allegedly beaten in custody after being detained over a jewellery theft. He later died from third-degree torture.#DTNext #TamilNadu #Sivaganga #CustodialDeaths #Crime #Police #HumanRights pic.twitter.com/ZFHbza7Tmv
— DT Next (@dt_next) July 1, 2025
తమిళనాడులో లాకప్ డెత్‌లు, ముఖ్యంగా అజిత్ కుమార్ (2025), జయరాజ్-బెనిక్స్ (2020), విగ్నేష్ (2022) కేసులు, పోలీసు హింస, జవాబుదారీతనం లేకపోవడం వంటి సమస్యలను తెరపైకి తెచ్చాయి. అజిత్ కుమార్ కేసులో సీబీఐ విచారణ, హైకోర్టు జోక్యం ఉన్నప్పటికీ ప్రజల్లో అసహనం పెరుగుతోంది. ఈ ఘటనలు రాజకీయ, సామాజిక ఉద్రిక్తతలను రేకెత్తించాయి, మానవ హక్కుల అంశాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి.





















