Hero Father: నడి సముద్రంలో షిప్ నుంచి పడిపోయిన ఐదేళ్ల కూతురు - కాపాడుకున్న తండ్రి- ఇది హాలీవుడ్ సినిమా ధ్రిల్లర్ కంటే ఎక్కువ !
Father: ఓ షిప్‌లో నాలుగో అంతస్తు నుంచి ఐదేళ్ల కుమార్తె నడి సముద్రంలో పడిపోయింది. దీన్ని గమనించిన తండ్రి సముద్రంలోకి దూకేశాడు. పాపను కాపాడుకున్నాడు. అంత తేలికగా కాదు.

Father jumps overboard to save his 5 year old daughter : సముద్రంలో కాస్త లోపలికి వెళ్తేనే మళ్లీ బయటకు రావడం కష్టం. అలాంటిది నడి సముద్రంలో పడిపోతే.. బతకడం సాధ్యం కాదు. అలాంటిది ఓ ఐదేళ్ల పాటు ప్రమాదవశాత్తూ షిప్ నుంచి సముద్రంలో పడిపోయింది. దాన్ని చూసిన తండ్రి వెంటనే పాప కోసం దూకేశారు. దూకి పాప వద్దకు చేరుకున్నాడు. కానీ ఎలా బయటకు వస్తాడు. చివరికి విజయవంతంగా తండ్రి, కుమార్తెలు బయటపడ్డారు. ఈ మధ్యలో చాలా సస్పెన్స్ ధ్రిల్లర్ నడిచింది.
అమెరికాలో దక్షిణ ఫ్లోరిడా తీరానికి వెళ్తున్న ఓ డిస్నీ క్రూయిజ్ షిప్ 4వ డెక్ నుండి సముద్రంలోకి ఓ పాప పడిపోయింది. తన 5 ఏళ్ల కుమార్తెను రక్షించడానికి తండ్రి సముద్రంలోకి దూకాడు. ఓడ వేగంగా కదులుతోంది. వీరిద్దరూ షిప్పులో ఉన్న వారికి కనిపించనంత దూరం షిప్ వెళ్లిపోయింది. అయితే ఓ చిన్న పాప పడిపోయిందని.. ఆమె కోసం తండ్రి కూడా సముద్రంలోకి దూకేశాడని.. ఇతర ప్రయాణికులు ఓడ కెప్టెన్ కు సమాచారం ఇచ్చారు. వెంటనే కెప్టెన్ సమయస్ఫూర్తితో వ్యవహరించి ఓడను స్లో చేసి.. వెనక్కి తిప్పాడు. వెంటనే రెస్కూయ సిబ్బందిని అప్రమత్తం చేశారు.
🚨 FATHER OF THE YEAR
— Alec Lace (@AlecLace) June 30, 2025
A father jumped into the ocean to save his young daughter after she fell overboard from a Disney Cruise Line ship!
The 5 year old girl fell from Deck 4 and her dad immediately went in after her.
This Dad is a HERO and a First Class Father all the way! pic.twitter.com/nNAmpRDQd1
వారిని తీసుకురావడానికి రక్షణ సిబ్బందితో చిన్న ఓడను సముద్రంలోకి దింపేశారు. వారు ఆ తండ్రి కూతుళ్ల వద్దకు వేగంగా వెళ్లి నీటి నుంచి బయటకు తీశారు. ఆ తండ్రి వెంటనే దూకి .. తన కుమార్తె వద్దకు చేరుకుని మునిగిపోకుండా పొదివి పట్టుకోకపోతే.. పెను ప్రమాదం జరిగేది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
NEW: Father jumps overboard to save his 5-year-old daughter, who fell off a Disney cruise ship from the 4th deck into the ocean.
— Collin Rugg (@CollinRugg) June 30, 2025
The ship was heading back to South Florida when the intense rescue was made.
"The ship was moving quickly, so quickly, it's crazy how quickly the… pic.twitter.com/PTGmAzZJ7O
అలాగే ఓడ కెప్టెన్ కూడా అత్యంత సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. సముద్రంలో ఇలాంటి సాహసాల వల్ల రెండు ప్రాణాలు నిలబడ్డాయని అందరూ ఊపిరి పీల్చుకున్నారు.





















