రూ.1000 నోట్లు మళ్లీ మార్కెట్లోకి వస్తాయా? క్లారిటీ ఇచ్చిన విశ్వసనీయ వర్గాలు
Rs 1000 notes: రూ.1000 నోట్లను మళ్లీ మార్కెట్లోకి ప్రవేశపెట్టే ఆలోచన RBI లేదని తెలుస్తోంది.

Rs. 1000 Notes Re Introduction:
ఆ ఆలోచనే లేదు..
రూ.1000 నోట్లను మళ్లీ (Rs. 1000 Notes Re Introduction) మార్కెట్లోకి ప్రవేశపెడతారన్న ఊహాగానాలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటి వరకూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. అయితే..విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం..RBI అలాంటి ఆలోచనే లేదని తెలుస్తోంది. రీ ఇంట్రడక్షన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. అసలు ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదని తెలుస్తోంది. ఇప్పటికే రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంది RBI. ఇకపై ఈ నోట్లు చెలామణిలో ఉండవని స్పష్టం చేసింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రూ.2 వేల నోట్లను మార్చుకునేందుకు గడువు కూడా ఇచ్చింది. 2016లో మోదీ సర్కార్ పెద్ద నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ సమయంలోనే రూ.500తో పాటు రూ.1000 నోట్లూ రద్దైపోయాయి. రూ.1000 నోట్ల స్థానంలో రూ.2 వేల నోట్లు తీసుకొచ్చింది. ఆ తరవాత కొత్తగా రూ.500 నోట్లు ప్రవేశపెట్టింది. ఇప్పుడు కొత్తగా రూ.1000 నోట్లు కూడా తీసుకొస్తారన్న ఊహాగానాలు వచ్చాయి. ఈ క్రమంలోనే విశ్వసనీయ వర్గాలు దీనిపై క్లారిటీ ఇచ్చాయి.
RBI is not in consideration of the re-introduction of Rs 1000 note: Sources
— ANI (@ANI) October 20, 2023
రెండు వేల రూపాయల నోట్లను రిజర్వ్ బ్యాంక్ విత్‌డ్రా చేసిన తర్వాత, ప్రజల వద్ద ఉన్న పింక్ నోట్ల క్రమంగా తిరిగి బ్యాంకుల వద్దకు వస్తున్నాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఇచ్చిన తాజా అప్డేట్ ప్రకారం... చలామణీలో ఉన్న రూ. 2000 నోట్లలో 93 శాతం నోట్లు బ్యాంకుల వద్దకు వచ్చాయి. ఈ లెక్కన ఇప్పుడు మార్కెట్లో 7 శాతం నోట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది మే 19వ తేదీన, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రూ. 2000 నోట్లను చెలామణీ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి, మన దేశంలో రూ. 3.7 లక్షల కోట్ల విలువైన రూ. 2000 నోట్లు చలామణీలో ఉన్నాయి. చలామణీలో ఉన్న మొత్తం (ఇతర నోట్లతో కలిపి) కరెన్సీలో రూ. 2 వేల నోట్ల వాటా 10.8%. ఆర్బీఐ ఉపసంహరణ ప్రకటన వచ్చిన మే 19వ తేదీ నాటికి వాటి విలువ రూ. 3.56 లక్షల కోట్లకు తగ్గింది. ప్రస్తుతం ఉన్న రూ.2,000 నోట్లలో 89 శాతాన్ని 2017 మార్చికి ముందు జారీ చేశారు. వాటి అంచనా జీవిత కాలం నాలుగు-ఐదు సంవత్సరాలు. సెంట్రల్ బ్యాంక్ ప్రింటింగ్ ప్రెస్‌లు 2018-19లోనే 2,000 నోట్ల ముద్రణ బంద్ చేశాయి. ఆర్థిక వ్యవస్థలో ఏర్పడిన నోట్ల కొరతను తీర్చడానికి రూ.2000 నోట్ల డినామినేషన్‌ను ఆర్బీఐ తీసుకువచ్చింది. ఇప్పుడు, ఇతర డినామినేషన్ల నోట్లు కూడా తగినన్ని అందుబాటులో ఉన్నాయి కాబట్టి, 2000 రూపాయల నోట్లను ప్రవేశపెట్టిన లక్ష్యం నెరవేరింది. దీంతో, 2018-19లో 2000 రూపాయల నోట్ల ముద్రణను RBI నిలిపేసింది.
Also Read: తొలి ర్యాపిడ్ ట్రైన్ నమో భారత్‌ని ప్రారంభించిన ప్రధాని, టికెట్ కొని రైల్లో కాసేపు ప్రయాణం





















