అన్వేషించండి

తొలి ర్యాపిడ్‌ ట్రైన్‌ నమో భారత్‌ని ప్రారంభించిన ప్రధాని, టికెట్‌ కొని రైల్‌లో కాసేపు ప్రయాణం

Delhi-Meerut RRTS: ఢిల్లీ మీరట్‌ ర్యాపిడ్‌ ట్రైన్‌ని ప్రధాని మోదీ పచ్చజెండా ఊపి ప్రారంభించారు.

Delhi-Meerut RRTS: 


దేశంలోని తొలి ర్యాపిడ్ ట్రైన్‌కి ప్రధాని నరేంద్ర మోదీ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్‌ కారిడార్‌లో  (Regional Rapid Transit System) ఈ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. ఈ రైళ్లకు ప్రధాని 'NaMo Bharat' అనే పేరు పెట్టారు. షహీదాబాద్ నుంచి దుహాయ్ డిపోట్‌ వరకూ మొత్తం 80 కిలోమీటర్ల దూరం ఈ ట్రైన్స్‌ ప్రయాణించనున్నాయి.

2019 మార్చి 8వ తేదీన ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ కారిడార్‌కి శంకుస్థాపన చేశారు ప్రధాని మోదీ. ఇప్పుడు ఆయనే ప్రారంభించారు. ఆయనతో పాటు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 

తొలి టికెట్‌ కొనుగోలు చేసిన ప్రధాని ట్రైన్‌లో కొంత దూరం ప్రయాణించారు. విద్యార్థులతో పాటు సిబ్బందితో కాసేపు ముచ్చటించారు. ఈ మొత్తం కారిడార్‌ కోసం కేంద్రం రూ.30 వేల కోట్లు ఖర్చు చేస్తోంది. ఈ రైళ్లలో ఢిల్లీ నుంచి మీరట్‌కి గంటలోపే చేరుకునే వెసులుబాటు ఉంటుంది. చూడడానికి మెట్రో రైళ్లలాగే ఉన్నప్పటికీ స్పీడ్‌లో చాలా తేడా ఉంటుంది. గంటకి 160 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. కోచ్‌లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. లగేజ్ క్యారియర్స్‌తో పాటు మినీ స్క్రీన్‌లు అమర్చారు. ఢిల్లీ నుంచి మీరట్‌కి 82 కిలోమీటర్ల వేగాన్ని 60 నిముషాల్లోగానే చేరుకోవచ్చని అధికారులు వెల్లడించారు. హైస్పీడ్‌, హై ఫ్రీక్వెన్సీ ఫీచర్స్‌తో అందుబాటులోకి తీసుకొచ్చారు. కనీస టికెట్ ధర రూ.15-20 వరకూ ఉండగా...గరిష్ఠ ధర రూ.160గా నిర్ణయించారు. 2025 జూన్ నాటికి మిగతా రూట్‌లలోనూ పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఈ రైళ్లలోనే ఓవర్‌హెడ్‌ లగేజ్ ర్యాక్స్‌ ఏర్పాటు చేశారు. వైఫై కనెక్టివిటీ కూడా ఉంది. వీటితో పాటు ల్యాప్‌టాప్స్‌, మొబైల్స్‌కి ఛార్జింగ్ పెట్టుకునేందుకు ఛార్జింగ్ పాయింట్స్‌ ఇచ్చారు. ఈ ట్రైన్‌లో ప్రత్యేకంగా డిలక్స్ కార్‌ ఉంటుంది. ఇందులో సీట్‌లు చాలా విశాలంగా ఉంటాయి. లెగ్‌రూమ్‌ ఎక్కువగా ఇచ్చారు. కోట్‌ హ్యాంగర్స్‌ కూడా ఉన్నాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pune Porsche Crash Case: పుణె పోర్షే ప్రమాదం కేసులో నిందితులకు బెయిల్ - సంబరాల వీడియోల వైరల్ - బాధితులకు వ్యవస్థలపై నమ్మకం ఎలా?
పుణె పోర్షే ప్రమాదం కేసులో నిందితులకు బెయిల్ - సంబరాల వీడియోల వైరల్ - బాధితులకు వ్యవస్థలపై నమ్మకం ఎలా?
Karnataka CM Resignation: కర్ణాటక నెక్ట్స్ సీఎం చాన్స్ కోసం ఖర్గే ప్రయత్నం - రేసులో శివకుమార్ ముందంజ - కర్ణాటకలో ఏం జరుగుతోందంటే ?
కర్ణాటక నెక్ట్స్ సీఎం చాన్స్ కోసం ఖర్గే ప్రయత్నం - రేసులో శివకుమార్ ముందంజ - కర్ణాటకలో ఏం జరుగుతోందంటే ?
ED Raids Kerala: కేరళలో ఈడీ అధికారులపై సీపీఎం కార్యకర్తల దాడి - మాజీ సీఎం విజయన్ ఇంట్లో సోదాలు చేశారని ఆగ్రహం
కేరళలో ఈడీ అధికారులపై సీపీఎం కార్యకర్తల దాడి - మాజీ సీఎం విజయన్ ఇంట్లో సోదాలు చేశారని ఆగ్రహం
5 Rupee Fish Meal: బెంగాల్‌లో రూ.5కే చేపల కూర భోజనం - సీఎం సువేందు అధికారి సంచలన నిర్ణయం!
బెంగాల్‌లో రూ.5కే చేపల కూర భోజనం - సీఎం సువేందు అధికారి సంచలన నిర్ణయం!

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gandhi Bhavan Fight: గాంధీ భవన్‌లో గలాటా - గల్లాలు పట్టుకుని కొట్టుకున్న నేతలు - మంత్రుల ఎదుటే !
గాంధీ భవన్‌లో గలాటా - గల్లాలు పట్టుకుని కొట్టుకున్న నేతలు - మంత్రుల ఎదుటే ! వీడియో
Madhura Sreedhar Reddy: సమస్యల పేరుతో పరువు తీయకండి... సినిమా వర్కవుట్ కాకపోతే వెళ్ళిపోండి - మధుర శ్రీధర్ రెడ్డి
సమస్యల పేరుతో పరువు తీయకండి... సినిమా వర్కవుట్ కాకపోతే వెళ్ళిపోండి - మధుర శ్రీధర్ రెడ్డి
YS Jagan Key Comments: ఓట్లు తగ్గినా, పెరిగినా డేంజరే -స్థానికల్లో పోటీ చేసి తీరాలి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
ఓట్లు తగ్గినా, పెరిగినా డేంజరే -స్థానికల్లో పోటీ చేసి తీరాలి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
Uppal Real Estate: ఉప్పల్‌లో రివర్స్ గేర్ వేసిన రియల్ భూమ్.. ప్లాట్లు కొనేందుకు వెనకాడుతున్న జనం, కారణం అదేనా?
ఉప్పల్‌లో రివర్స్ గేర్ వేసిన రియల్ భూమ్.. ప్లాట్లు కొనేందుకు వెనకాడుతున్న జనం, కారణం అదేనా?
Pune Porsche Crash Case: పుణె పోర్షే ప్రమాదం కేసులో నిందితులకు బెయిల్ - సంబరాల వీడియోల వైరల్ - బాధితులకు వ్యవస్థలపై నమ్మకం ఎలా?
పుణె పోర్షే ప్రమాదం కేసులో నిందితులకు బెయిల్ - సంబరాల వీడియోల వైరల్ - బాధితులకు వ్యవస్థలపై నమ్మకం ఎలా?
Battery as a Service India: ఈవీ మార్కెట్‌లో కొత్త
ఈవీ మార్కెట్‌లో కొత్త "బాస్‌"! సగం ధరకే విద్యుత్‌ కార్లు! నిజంగానే ఇది సామాన్యుడికి వరమేనా?
ED Raids Kerala: కేరళలో ఈడీ అధికారులపై సీపీఎం కార్యకర్తల దాడి - మాజీ సీఎం విజయన్ ఇంట్లో సోదాలు చేశారని ఆగ్రహం
కేరళలో ఈడీ అధికారులపై సీపీఎం కార్యకర్తల దాడి - మాజీ సీఎం విజయన్ ఇంట్లో సోదాలు చేశారని ఆగ్రహం
Balakrishna Birthday: బాలయ్య బర్త్ డేకు గిఫ్ట్ రెడీ చేస్తున్న గోపీచంద్ మలినేని
బాలయ్య బర్త్ డేకు గిఫ్ట్ రెడీ చేస్తున్న గోపీచంద్ మలినేని
Embed widget