అన్వేషించండి
Team India Playing 11 in Asia Cup 2025 | ఆసియా కప్ లో రింకూ బదులుగా దుబే ?
ఆసియా కప్ 2025 ( Asia Cup 2025 ) కోసం ఇండియా టీం ను ప్రకటించిన తర్వాత ప్లేయింగ్ 11 పై చర్చ మొదలయింది. ఎంతోమంది సీనియర్ ప్లేయర్స్.. భారత్ ప్లేయింగ్ 11ను అంచనా వేయడం మొదలు పెట్టారు. అయితే ప్లేయింగ్ 11 పై క్రికెట్ విశ్లేషకుడు ఆకాష్ చోప్రా ( Akash Chopra ) ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. రింకూ సింగ్ ( Rinku Singh ) ప్లేయింగ్ 11 లో చోటు దక్కించుకోవడం కాస్త కష్టమే అని అంటున్నారు. రింకు స్థానంలో మరో ఆల్-రౌండర్ ఆడే అవకాశం ఉందని అయిన సూచిస్తున్నారు. అయితే 2024, 2025 ఐపీఎల్ సీజన్లలో రింకూ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. అలాగే రింకూ ఫినిషర్‌గా మాత్రమే పరిమితం అవుతున్నాడు. బౌలింగ్ చేయకపోవడం కూడా అతడికి ఒక మైనస్ పాయింట్ అని అంటున్నారు ఆకాష్ చోప్రా. రింకూ సింగ్ స్థానంలో అల్ రౌండర్ శివమ్ దూబే ( Shivam Dube)కు అవకాశం ఇస్తే బాగుంటుందని ఆకాష్ చోప్రా అంటున్నారు. దూబే బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ కూడా చేయగలడు. ఇది టీం కు ప్లస్ అవుతుంది. హార్దిక్ పాండ్యా ( Hardik pandya ), జితేష్ శర్మ ( Jitesh Sharma ) వంటి ప్లేయర్స్ టీం లో ఉన్నప్పుడు రింకూ సింగ్ కు చోటు దొరకడం కష్టమే అని అంటున్నారు ఆకాష్ చోప్రా.
ఆట
India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్
Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















