Prakash Raj : సినిమాల్లో సీఎం కావొచ్చు... పాలిటిక్స్‌లో కాదు - విజయ్‌పై ప్రకాష్ రాజ్ సెటైరికల్ కామెంట్స్
Thalapathy Vijay : టీవీకే అధినేత, దళపతి విజయ్‌పై ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సినిమా వేరు పాలిటిక్స్ వేరు... బాధ్యత వేరని అన్నారు.

Prakash Raj Comments On Thalapathy Vijay In Election Campaign : టీవీకే అధినేత, కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్‌పై విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ సెటైరికల్ కామెంట్స్ చేశారు. తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో సీపీఐ (ఎం) అభ్యర్థి తరఫున పళనిలో ప్రచారం నిర్వహించిన ప్రకాష్ రాజ్... విజయ్‌పై చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.
సినిమా మోడల్ అంటూ
సినిమాల్లో స్టార్ డమ్, సిల్వర్ స్క్రీన్‌పై రోల్స్... రాజకీయాల్లో, సామాజిక సేవకు సమానం కావని అన్నారు ప్రకాష్ రాజ్. 'మీరు సినిమాలో డాక్టర్, ఇంజినీర్, సీఎం కావొచ్చు. కానీ పాలిటిక్స్‌లో కాదు. ప్రజలు మీ టాలెంట్ చూసి ప్రేమను కురిపిస్తారు. రాజకీయాలను చూసి కాదు. మీ ఆదర్శం సినిమా మోడల్. తమిళనాాడు తన భాష, ఆత్మ గౌరవానికి సంబంధించిన సమస్యలు ఎదుర్కొన్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు.
రాజకీయం అంటే ప్రజలు మీలో చూసే స్నేహం. ప్రేమ లేదా ప్రతిభ కాదు. మీరు కేవలం వాటిని వాడుకుంటున్నారు. ప్రజలు ఎండలో క్యూల్లో నిలబడ్డారు. కటౌట్స్ పెట్టారు. టికెట్స్ కొన్నారు. తమ ఇళ్లు, పనులు పక్కన పెట్టి మరీ మీపై ప్రేమ చాటుకున్నారు. ఇప్పుడు మీరు ఆ ప్రేమను మీ రాజకీయ ప్రవేశం కోసం వాడుకుంటున్నారా?. నాకు ఓ నటుడు నచ్చితే నా గొంతు బొంగురు పోయే వరకూ ఈలలు వేస్తా. కానీ వారికి నా దేశాన్ని అప్పగించలేను. పాలిటిక్స్ వేరు, సినిమా వేరు, ప్రేమ వేరు. ఈ బాధ్యత వేరు.' అంటూ కామెంట్స్ చేశారు.
Also Read : తిమ్మరాజుపల్లి టీవీ రివ్యూ: టీవీ కోసం అంత గొడవంటే నమ్మేట్టు ఉందా? నిర్మాతగా కిరణ్ అబ్బవరం సినిమా హిట్టేనా?
ఈ ఎన్నికలు ఐక్యత, విభజనల మధ్య ఎంపికగా అభివర్ణించిన ప్రకాష్ రాాజ్... కేంద్ర ప్రభుత్వ నిబంధనలను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. 'ఇది AIADMK, DMK మధ్య జరిగే ఎన్నిక కాదు. విజయ్ చెబుతున్నట్లుగా TVK కోసం జరిగే ఎన్నిక అంత కంటే కాదు. ఐకమత్యానికి, విభజనకు మధ్య జరిగే పోరాటం.' అని అన్నారు.
ప్రకాష్ రాజ్ సెటైరికల్‌గా, పరోక్షంగా విజయ్‌పై కామెంట్స్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. విజయ్ లాస్ట్ మూవీ జన నాయగన్‌లో ఆయన కీలకపాత్ర పోషించారు. అంతకు ముందు కూడా చాలా చిత్రాల్లో కలిసి నటించారు.
ట్రెండింగ్ వార్తలు






















