అన్వేషించండి

Thimmarajupalli TV Movie Review - తిమ్మరాజుపల్లి టీవీ రివ్యూ: టీవీ కోసం అంత గొడవంటే నమ్మేట్టు ఉందా? నిర్మాతగా కిరణ్ అబ్బవరం సినిమా హిట్టేనా?

Thimmarajupalli TV Review In Telugu: సాయి తేజ్, వేద జలంధర్ జంటగా... వి మునిరాజు దర్శకుడిగా పరిచయం చేస్తూ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నిర్మించిన సినిమా 'తిమ్మరాజుపల్లి టీవీ'. ఈ సినిమా ఎలా ఉందంటే?

Thimmarajupalli TV Movie Review In Telugu: యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం నిర్మించిన సినిమా 'తిమ్మరాజుపల్లి టీవీ'. సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్లుగా... వి మునిరాజు దర్శకుడిగా పరిచయం అయ్యారు. సుమారు 40 మందిని ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం చేశారు కిరణ్ అబ్బవరం. టీవీ నేపథ్యంలో పల్లెటూరి కథతో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉందంటే?

కథ (Thimmarajupalli TV Story): కుప్పం సమీపంలోని ఓ గ్రామం తిమ్మరాజు పల్లి. గ్రామస్థులు అందరి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి ప్రతి శివరాత్రికి టీవీ, వీసీఆర్ అద్దెకు తీసుకు వచ్చి సినిమాలు వేస్తాడు సతీష్ (సాయి తేజ్). తమ ఊరికి చెందిన శారద (వేద జలంధర్)తో ప్రేమలో పడతాడు. ఆమె కూడా ప్రేమిస్తుంది. శారద అన్నయ్య రాజప్ప (ప్రదీప్ కొట్టె) టీవీ కొని ఊరికి తీసుకు వస్తాడు. అది చూసేందుకు వచ్చిన సతీష్, రాజప్ప తండ్రి మధ్య గొడవ అవుతుంది. మర్నాడు టీవీ మాయం అవుతుంది.

సతీష్ దొంగ కూడా కావడంతో అతనే కొట్టేశాడని రాజప్ప ఆరోపిస్తాడు. అసలు ఆ టీవీ కొట్టేసింది ఎవరు? ఊరికి మొదటి టీవీ తీసుకు రావాలని కలలు కన్న సర్పంచ్ రామచంద్రయ్య (అమ్మ రమేష్) ఏం చేశాడు? టీవీ ఎవరు కొట్టేశారో కనిపెట్టి తన తప్పు లేదని సతీష్ నిరూపించుకున్నాడా? ప్రేమించిన అమ్మాయి శారదతో ఒక్కటి అయ్యాడా? లేదా? టీవీ పెట్టిన గొడవ ఏమిటి? అనేది సినిమా.

విశ్లేషణ (Thimmarajupalli TV Review Telugu): ఇప్పుడు అంటే ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్స్, ల్యాప్ టాప్స్ ఉంటున్నాయి. ప్రజలకు అరచేతిలో వినోదం అందుతోంది. ఓ 30 ఏళ్ళు ముందుకు వెళితే... ఫోన్ కాదు కదా, కొన్ని పల్లెటూళ్లలో కనీసం టీవీ కనిపించేది కాదు. కొన్ని పల్లెల్లో అయితే ఊరికి ఒక్క టీవీ ఉండేది. ఆ ఊరి జనమంతా ఆ టీవీ ముందు కనిపించేవారు. ఆ పాయింట్ మీద తీసిన సినిమా 'తిమ్మరాజుపల్లి టీవీ'. కథంతా 1990వ దశకం నేపథ్యంలో సాగింది.

కథలో నోస్టాల్జియా మూమెంట్స్ ఉండటం కాదు... ఆ నోస్టాల్జియాలోకి ప్రేక్షకులను తీసుకు వెళ్లడం చాలా ముఖ్యం. ఆ విషయంలో 'తిమ్మరాజుపల్లి టీవీ' బృందం విజయం సాధించింది. ఆ విషయంలో వంశీకాంత్ రేఖన సంగీతం, అక్షయ్ రామ్ పొడిశెట్టి ఛాయాగ్రహణం ప్రధాన పాత్ర పోషించాయి. మ్యూజిక్ అండ్ కెమెరా వర్క్ చేసిన మేజిక్ కారణంగా థియేటర్లలోకి వెళ్లిన కాసేపటికి తిమ్మరాజుపల్లిలోకి, ఆ కాలంలోకి ప్రేక్షకులు వెళతారు.

దర్శకుడు వి మునిరాజు సింపుల్ పాయింట్ తీసుకున్నారు. ఓ పల్లెను తెరపై బాగా ఆవిష్కరించారు. చిత్తూరు నేపథ్యం తీసుకోవడం కథకు ప్లస్ అయ్యింది. ప్రారంభం నుంచి కొత్తగా కనిపిస్తుంది. టీవీ కోసం ఊరంతా చందాలు వేసుకోవడం, ఊరిలో ఒకరు టీవీ కొనడంతో వాళ్ళింటికి అందరూ చేరుకోవడం, చిన్న చిన్న గొడవలు, హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ కథతో ప్రథమార్థం సరదాగా సాగుతుంది. మదర్ & సన్ సెంటిమెంట్ సైతం వర్కవుట్ అయ్యింది. టీవీ మాయం అయినప్పటి నుంచి కథలో సీరియస్‌నెస్ పెరుగుతుంది. టీవీ కోసం జరిగే అన్వేషణ ఆసక్తిగా సాగింది. అయితే... కథను ముగించిన తీరు కొంత అసంతృప్తికి గురి చేస్తుంది. క్లైమాక్స్ ఇంకా మంచిగా రాసి ఉండొచ్చని, తీసి ఉండొచ్చని అనిపిస్తుంది.

Also Read: Bad Boy Karthik Movie Review - 'బ్యాడ్ బాయ్ కార్తీక్' రివ్యూ: బాబోయ్... మరీ అంత బ్యాడా? నాగశౌర్య సినిమాను చూడలేమా?

నోస్టాల్జియా మూమెంట్స్ చక్కగా క్యాప్చర్ చేశారు దర్శకుడు మునిరాజు. చిత్ర కథ, కథనాలు సహజంగా ముందుకు వెళతాయి. అయితే... సహజత్వం పేరుతో మరీ ఎక్కువ పాత్రలు పెట్టేశారు. పలువురు పాత్రలను పరిచయం చేశారు. కథలో ఆయా పాత్రలకు సరైన చోటు దక్కలేదు. దాంతో వాళ్ళ సన్నివేశాలు సాగదీసినట్టు అనిపిస్తాయి. టీవీ మాయమైన తర్వాత అనవసరమైన పాత్రల వల్ల కథలో ఉత్కంఠ తగ్గింది. ప్రేమ కథలో బలమైన భావోద్వేగాలు కనిపించలేదు. పాటలు, నేపథ్య సంగీతం, ఛాయాగ్రహణం కొన్ని లోపాలను కవర్ చేశాయి. కథకు తగ్గట్టు కిరణ్ అబ్బవరం ఖర్చు చేశారు. అంతకు మించి ఖర్చు చేసినా తెరపై కనిపించే అవకాశం తక్కువ.

నటీనటులు అందరూ కొత్తవాళ్లు అయినా చక్కగా చేశారు. ప్రదీప్ కొట్టెకి మంచి రోల్ దక్కింది. పాత్ర తాలూకూ మార్పులను బాగా చూపించారు. తెరపై సాయి తేజ్ మన పల్లెల్లో కనిపించే అబ్బాయిలా ఉన్నారు. ఎమోషనల్ సీన్స్ బాగా చేశారు. మిగతా ఆర్టిస్టులు అందరూ తమ తమ పాత్రలకు తగ్గట్టు నటించారు.

Also ReadPapam Prathap Movie Review - పాపం ప్రతాప్ రివ్యూ: థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులు చూసి పాపం అనుకోవాలా?... తిరువీర్ సినిమా ఎలా ఉందంటే?

ట్రెండీ కథలు, ప్రేమలు మధ్య ప్రేక్షకులను 90వ దశకంలోకి తీసుకు వెళ్లడంలో 'తిమ్మరాజుపల్లి టీవీ' సక్సెస్ అయ్యింది. కథ కాస్త కిందకు మీదకు పడుతూ లేస్తూ వెళ్లినట్టు అనిపించినా... మంచి నోస్టాల్జియా మూమెంట్స్ అందిస్తుందీ సినిమా. సహజత్వానికి దగ్గరగా తీశారు. కొత్త వాళ్ళందరూ కలిసి చేసిన ప్రయత్నాన్ని అభినందించవచ్చు. సరదాగా రెండు గంటలు పల్లెలోకి వెళ్లి వచ్చినట్టు ఉంటుంది. ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే థియేటర్లలో చివరి వరకు ప్రేక్షకుల్ని కూర్చోబెడుతుంది.

Also ReadDacoit Review - డెకాయిట్ రివ్యూ: థ్రిల్లర్ తరహాలో సాగిన ప్రేమకథ... అడివి శేష్ సక్సెస్ జర్నీ కంటిన్యూ అవుతుందా? సినిమా ఎలా ఉందంటే?

View More
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lakshimi Raave Maa Intiki Serial Today May14th:  తన వల్లే సింధూ పురుగుల మందు తాగిందని అబద్ధం చెప్పిన గోపీ...ఇంటికి వచ్చినందకు గోపాల్‌పై సింధూ ఆగ్రహం
లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్‌: తన వల్లే సింధూ పురుగుల మందు తాగిందని అబద్ధం చెప్పిన గోపీ...ఇంటికి వచ్చినందకు గోపాల్‌పై సింధూ ఆగ్రహం
Jagadhatri Serial Today May 14th: కేదార్‌ను కొడుకుగా ఒప్పుకోవాలని వార్నింగ్ ఇచ్చిన వీరశంకర్‌....సుధాకర్ విషం తాగబోయాడంటూ నాటకం
జగద్ధాత్రి సీరియల్: కేదార్‌ను కొడుకుగా ఒప్పుకోవాలని వార్నింగ్ ఇచ్చిన వీరశంకర్‌....సుధాకర్ విషం తాగబోయాడంటూ నాటకం
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today May 14th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారితో ఫోన్‌లో మాట్లాడి ప్రమాదం ఉందని హెచ్చరించిన లక్ష్మీ! అంబిక, సుభాష్‌ల రెక్కీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారితో ఫోన్‌లో మాట్లాడి ప్రమాదం ఉందని హెచ్చరించిన లక్ష్మీ! అంబిక, సుభాష్‌ల రెక్కీ!
Memu Coplam OTT : విలేజ్‌లో కోడి మిస్సింగ్ మిస్టరీ - మెగా బ్రదర్ 'మేము COPలం' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
విలేజ్‌లో కోడి మిస్సింగ్ మిస్టరీ - మెగా బ్రదర్ 'మేము COPలం' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana  Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్..  చోర్ అంటూ నినాదాలు|

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Formula E Race Case:  కేటీఆర్‌కు షాక్ - ఫార్ములా-ఈ కేసులో ఏసీబీ కోర్టు సమన్లు - జూలై 31న   హాజరు కావాలని ఆదేశం!
కేటీఆర్‌కు షాక్ - ఫార్ములా-ఈ కేసులో ఏసీబీ కోర్టు సమన్లు - జూలై 31న హాజరు కావాలని ఆదేశం!
Agri Gold Victims:  అగ్రిగోల్డ్ బాధితులకు  గుడ్ న్యూస్ - ఆరు నెలల్లో ఖాతాల్లోకి నగదు.. క్లియరెన్స్‌కు హై లెవల్ కమిటీ!
అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్ - ఆరు నెలల్లో ఖాతాల్లోకి నగదు.. క్లియరెన్స్‌కు హై లెవల్ కమిటీ!
IPL 2026 MI VS PBKS Result Update: పంజాబ్‌ను దెబ్బ తీసిన MI, అర్షదీప్‌ వల్గర్ కామెంట్స్‌కు బ్యాట్‌తో తిల‌క్ ఆన్సర్, పీబీకేఎస్‌కు వ‌రుస‌గా ఐదో ఓట‌మి
పంజాబ్‌ను దెబ్బ తీసిన MI, అర్షదీప్‌ వల్గర్ కామెంట్స్‌కు బ్యాట్‌తో తిల‌క్ ఆన్సర్, పీబీకేఎస్‌కు వ‌రుస‌గా ఐదో ఓట‌మి
Arshdeep Singh Racist Comment on Tilak Varma: ఓయ్‌ బ్లాకీ, సన్‌స్క్రీన్ రాసుకున్నావా? తిలక్‌ వర్మపై అర్ష్‌దీప్ సింగ్ బలుపు కామెంట్స్ వైరల్! 
ఓయ్‌ బ్లాకీ, సన్‌స్క్రీన్ రాసుకున్నావా? తిలక్‌ వర్మపై అర్ష్‌దీప్ సింగ్ బలుపు కామెంట్స్ వైరల్! 
Honda City Facelift Spied: హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ అదిరిపోయే లుక్‌తో వచ్చేస్తోంది: లాంచ్‌కు ముందే లీకైన ఫోటోలు
హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ అదిరిపోయే లుక్‌తో వచ్చేస్తోంది: లాంచ్‌కు ముందే లీకైన ఫోటోలు
Memu Coplam OTT : విలేజ్‌లో కోడి మిస్సింగ్ మిస్టరీ - మెగా బ్రదర్ 'మేము COPలం' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
విలేజ్‌లో కోడి మిస్సింగ్ మిస్టరీ - మెగా బ్రదర్ 'మేము COPలం' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Shah Rukh Khan Cadillac Escalade: షారుఖ్ ఖాన్ గ్యారేజీలోకి కొత్త లగ్జరీ కారు - ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతున్న అమెరికన్ బీస్ట్!
షారుఖ్ ఖాన్ గ్యారేజీలోకి కొత్త లగ్జరీ కారు - ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతున్న అమెరికన్ బీస్ట్!
Uttar Pradesh Storm: రాకాసి గాలులంటే ఇవి - మనుషులే ఎగిరిపోయారు - యూపీ దృశ్యాలు చూస్తే షాకే
రాకాసి గాలులంటే ఇవి - మనుషులే ఎగిరిపోయారు - యూపీ దృశ్యాలు చూస్తే షాకే
Embed widget