వందేభారత్‌ని మించిన ఫీచర్స్‌తో ర్యాపిడ్ ట్రైన్స్, ఇంటీరియర్ చూస్తే వావ్ అంటారు
Delhi Meerut Rapid Trains: ఢిల్లీ మీరట్ రూట్‌లో తొలిసారి ర్యాపిడ్ ట్రైన్స్ అందుబాటులోకి రానున్నాయి.
Delhi Meerut Rapid Trains:
తొలి ర్యాపిడ్ ట్రైన్స్..
రైల్వేలో ఎన్నో సంస్కరణలు తీసుకొస్తోంది కేంద్రం. వందేభారత్ ట్రైన్స్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి ర్యాపిడ్ ట్రైన్స్‌నీ (Delhi Meerut Rapid Trains) అందుబాటులోకి తీసుకురానుంది. ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ రూట్‌లో ఈ ర్యాపిడ్ ట్రైన్స్ సర్వీస్‌లు (RAPIDX train project) మొదలు కానున్నాయి. దీన్నే Regional Rapid Transit System (RRTS) కారిడార్‌గా చెబుతోంది కేంద్రం. ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 20న వీటిని ప్రారంభించనున్నారు. చూడడానికి మెట్రో రైళ్లలాగే ఉన్నప్పటికీ..ఇవి మరింత సౌకర్యవంతంగా ఉంటాయి. లగేజ్ క్యారియర్స్‌తో పాటు మినియేచర్ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. ఈ రైళ్ల నిర్వహణను National Capital Region Transport Corporation చూసుకోనుంది. భారత్‌లో ఇదే తొలి రీజియనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్. ఢిల్లీ నుంచి మీరట్‌కి 82.15 కిలోమీటర్ల మేర ఈ ర్యాపిడ్ ట్రైన్స్ కవర్ చేయనున్నాయి. 2025 జూన్ నాటికి మిగతా రూట్‌లలోనూ పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఈ రైళ్లలోనే ఓవర్‌హెడ్ లగేజ్ ర్యాక్స్ ఏర్పాటు చేశారు. వైఫై కనెక్టివిటీ కూడా ఉంది. వీటితో పాటు ల్యాప్‌టాప్స్, మొబైల్స్‌కి ఛార్జింగ్ పెట్టుకునేందుకు ఛార్జింగ్ పాయింట్స్ ఇచ్చారు. ఈ ట్రైన్‌లో ప్రత్యేకంగా డిలక్స్ కార్ ఉంటుంది. ఇందులో సీట్‌లు చాలా విశాలంగా ఉంటాయి. లెగ్‌రూమ్ ఎక్కువగా ఇచ్చారు. కోట్ హ్యాంగర్స్ కూడా ఉన్నాయి. దివ్యాంగుల కోసం స్పెషల్‌గా వీల్‌ఛైర్ స్పేసెస్ ఏర్పాటు చేశారు. అన్ని కోచ్‌లలోనూ ఎమర్జెన్సీ కమ్యూనికేషన్ సిస్టమ్ అమర్చారు. ప్రతి ఒక్కటీ అంతర్జాతీయ ప్రమాణాలతో దిద్దితీర్చారు.
New Rapid Rail Service for New India!
— Pralhad Joshi (@JoshiPralhad) October 19, 2023
The images of Delhi-Meerut RRTS, which will be dedicated to the nation by Prime Minister Shri @NarendraModi Ji on 20th October.#RRTS#RapidX pic.twitter.com/demPJuBdH4