Operation Sindoor: ఆపరేషన్ సింధూర్‌పై పాక్ తొలి రియాక్షన్ ఇదే- సరిహద్దుల్లో విధ్వంసానికి దాయాది దేశం యత్నం
Operation Sindoor: భారత్‌లో విధ్వంసం సృష్టించేందుకు పన్నాగాలు చేస్తున్న ఉగ్రవాదుల స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. ఈ చర్యతో ఉలిక్కిపడ్డ పాకిస్థాన్ సరిహద్దుల్లో కాల్పులు జరుపుతోంది.

Operation Sindoor: 22 ఏప్రిల్ 2025న జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌తో పాకిస్థాన్ ఉలిక్కిపడింది. భారత్ ఉగ్రస్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నప్పటికీ పాకిస్థాన్ ప్రతికార దాడులకు తెగబడుతోంది. భారత్ సరిహద్దుల్లో ఉన్న సైన్యంపైకి కాల్పులు జరిపింది. పాకిస్థాన్ దాడికి దీటుగా భారత్ సైన్యం బదులిస్తోంది.
పాకిస్థాన్‌తోపాటు పీవోకేలో భారత్ ఈ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో ఉగ్రవాదులు ఉన్న 9 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంది. వారి స్థావరాలను రాత్రి ఒంటిగంట తర్వాత నేల కూల్చింది. ఈ విషయంపై పాకిస్థాన్ కూడా స్పందించింది. పొరుగు దేశం ప్రకటన విడుదల చేస్తూ భారతదేశం పీవోకేలో క్షిపణులతో దాడి చేసిందని పేర్కొంది.
#WATCH | #OperationSindoor | Heavy exchange of artillery fire at LoC in J&K (exact location not being disclosed). pic.twitter.com/n1y3FH0VPT
— ANI (@ANI) May 6, 2025
పాకిస్తాన్ ఐఎస్పీఆర్ డీజీ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి మాట్లాడుతూ, కోట్లి, మురిద్కే, బహవల్పూర్, ముజఫరాబాద్‌లోని స్థావరాలపై భారతదేశం దాడులు చేసిందని చెప్పారు.
పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ భారతదేశం నిక దాడులు చేసిందని ధృవీకరించారు. "భారతదేశం చేపట్టిన ఈ యుద్ధ చర్యకు స్పందించే హక్కు పాకిస్తాన్‌కు ఉందని కూడా అన్నారు. దీనికి ఇంతకింతా బలమైన ప్రతిస్పందన ఇస్తాం" అని హెచ్చరించారు.





















