అన్వేషించండి

Gas Cylinder Booking Rules: మే 1 నుంచి ఎల్పీజీ సిలిండర్ బుకింగ్‌ రూల్స్‌లో మార్పులు! వీళ్లకు సిలిండర్స్ కట్!

LPG Price Hike: మే 1 నుంచి దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ సిలిండర్ బుకింగ్ , డెలవరీ రూల్స్‌లో కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. ప్రభుత్వం జారీ చేసిన కొత్త రూల్స్ తెలియకుంటే బుకింగ్ టైంలో ఇబ్బంది పడతారు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పశ్చిమాసియా యుద్ధం కారణంగా గ్యాస్ ధరలు, బుకింగ్ నిబంధనలు మారాయి.
  • గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ బుకింగ్ వ్యవధి పెంచబడింది.
  • ఓటీపీ ఆధారిత డెలివరీ, ఈ-కేవైసీ తప్పనిసరి చేయబడ్డాయి.
  • పీఎన్జీ సౌకర్యం ఉన్న చోట్ల ఎల్పీజీ కనెక్షన్లు నిలిపివేస్తారు.

Gas Cylinder Booking Rules:భారతీయ వంటగది బడ్జెట్‌పై అంతర్జాతీయ పరిణామాలు నేరుగా ప్రభావం చూపుతున్నాయి. మే నెల ప్రారంభం నుంచి గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు కొత్త సవాళ్లు, మార్పులు ఎదురుకానున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం వాతావరణం వల్ల ఇంధన మార్కెట్లు అస్థిరంగా మారడం, సప్లై చైన్‌లో ఇబ్బందులు తలెత్తడంతో ప్రభుత్వం, చమురు సంస్థలు బుకింగ్‌ రూల్స్ కఠినతరం చేస్తున్నాయి. 

మే నెలలో పెరగనున్న గ్యాస్ ధరలు

ఫిబ్రవరి చివరిలో ప్రారంభమైన పశ్చిమాసియా సంక్షోభం భారత్ ఇంధన మార్కెట్‌ను కుదిపేస్తోంది. దీని ప్రభావంతో చమురు మార్కెటింగ్‌ సంస్థలు అప్పటికే 14.2 కిలోల డొమెస్టిక్‌ ఎల్పీజీ సిలిండర్‌ ధరను దేశవ్యాప్తంగా రూ. 60 మేర పెంచాయి. వాణిజ్య అవసరాల కోసం వాడే 19 కిలోల సిలిండర్‌ ధరలు కేవలం ఒక్క నెలలోనే మూడుసార్లు పెంచారు. ఏప్రిల్ 2026లో మెట్రో నగరాల్లో దీని ధర 196 రూపాయల నుంచి 218 రూపాయలకు పెరిగింది. మే నుంచి ధరలలో మరోసారి సవరణలు జరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. 

బుకింగ్ వ్యవధి కంటిన్యూ 

పెరుగుతున్న డిమాండ్, అక్రమ రవాణాను అరికట్టేందుకు పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ బుకింగ్ ఫ్రేమ్‌వర్క్‌ను సవరించింది. గతంలో ఉన్న 21 రోజుల బుకింగ్ వ్యవధిని ఇప్పుడు 25 రోజులకు పెంచారు. అంటే ఒక సిలిండర్ బుక్‌ చేసిన తర్వాత రెండో సిలిండర్‌ కోసం కనీసం 25 రోజులు వేచి ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ గ్యాప్‌ను 45 రోజులకు పెంచారు. 

డెలివరీ అథెంటికేషన్ సిస్టమ్‌ శాశ్వతం 

గ్యాస్ సిలిండర్ల పంపిణీలో పారదర్శకత కోసం ప్రవేశపెట్టిన ఓటీపీ ఆధారిత డెలివరీ అథెంటికేషన్ సిస్టమ్‌ను మే నుంచి శాశ్వతం చేయాలని ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ సంస్థలు నిర్ణయించాయి. ప్రస్తుతం దేశంలో 98 శాతం బుకింగ్‌లు ఆన్‌లైన్‌లోనే జరుగుతుండగా, 94శాతం డెలివరీలు డీఏసీ ద్వారా విజయవంతంగా పూర్తి అవుతున్నాయి. దీని వల్ల సబ్సిడీ సిలిండర్లు పక్కదారి పట్టకుండా అడ్డుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. 

ఈ కేవైసీ తప్పనిసరి 

ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన లబ్ధిదారులకు ఆధార్ అధారిత బయోమెట్రిక్ అథెంటికేషన్ తప్పనిసరి చేశారు. అయితే ఇప్పటి వరకు ఈ ప్రక్రియ పూర్తి చేయని వారు మాత్రమే ఇప్పుడు చేసుకోవాల్సి ఉంటుంది. సాధార కస్టమర్లు, అంటే పీఎంయూవై లబ్ధి పొందని వారు చేయాల్సిన అవసరం లేదు. ఉజ్వల్ లబ్ధిదారులు సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఈ ప్రమాణీకరణను పూర్తి చేయాలి. ముఖ్యంగా ఒక ఆర్థిక సంవత్సరంలో ఎనిమిదో రీఫిల్‌ నుంచి సబ్సిడీ పొందాలంటే ఈ కైవైసీ పూర్తి చేయడం తప్పదు. 

పీఎన్జీకి మారకుంటే ఎల్పీజీ కట్‌ 

ప్రభుత్వం గృహ వినియోగదారులను ఎల్పీజీ నుంచి పైపుడ్‌ నేచురల్ గ్యాస్‌ వైపు మళ్లించే ప్రయత్నం చేస్తోంది. పీఎన్జీ సదుపాయం ఉన్న ప్రాంతాల్లో కచ్చితంగా ప్రజలు ఎల్పీజీ కనెక్షన్ వదులుకోవాల్సి ఉంటుంది. కొత్తగా ఎల్పీజీ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవడంపై నిషేధం విధించారు. సౌకర్యం అందుబాటులో ఉన్న పీఎన్జీకి మారకపోతే మూడు నెలల తర్వాత సదరు ఇంటికి ఎల్పీజీ ఆపేస్తారు. గత మార్చి నుంచి ఇప్పటి వరకు దాదాపు 5.45 లక్షల కొత్త పీఎన్జీ కనెక్షన్‌లు ఇవ్వగా, మరో 2.62 లక్షల కనెక్షన్లకు మౌలిక వసతులు సిద్ధం చేస్తున్నారు. 

Also Read: హైదరాబాద్‌లో పైప్‌డ్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఎలా పొందాలి? మధ్య తరగతికి LPG లేదా PNGలలో ఏది బెస్ట్..?

అంతర్జాతీయంగా సరఫరాలో ఇబ్బందులు ఉన్నప్పటికీ దేశీయ వినియోగదారులకు వంద శాతం సరఫరాను ప్రభుత్వం హామీ ఇస్తోంది. వాణిజ్య విభాగంలో మాత్రం ఆసుపత్రులు, విద్యాసంస్థలు, ఫార్మా, స్టీల్, ఆటోమొబైల్‌, వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. వలస కార్మికుల కోసం ఐదు కిలోల సిలిండర్ల సరఫరాను ప్రభుత్వం రెట్టింపు చేసింది. 

Also Read: వంట గ్యాస్ లేకున్నా చేసుకోగలిగే హెల్తీ రెసిపీ.. టేస్టీ ఫుడ్​తో బరువు కూడా తగ్గొచ్చు

ప్రజలు మే 1 లోపు తమ ఈకైవైసీ స్టాటస్ చెక్ చేసి , పీఎన్జీ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవడం ద్వారా అంతరాయం లేని గ్యాస్ సరఫరాను పొందవచ్చు. 

Frequently Asked Questions

మే నెల నుంచి గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుతాయా?

అవును, అంతర్జాతీయ పరిణామాల వల్ల మరియు డిమాండ్ పెరగడం వల్ల మే నెలలో గ్యాస్ ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 60 పెరిగింది.

గ్యాస్ సిలిండర్ బుకింగ్ వ్యవధిలో ఏమైనా మార్పులు ఉన్నాయా?

అవును, పెరుగుతున్న డిమాండ్ మరియు అక్రమ రవాణాను అరికట్టేందుకు బుకింగ్ వ్యవధిని పెంచారు. ప్రస్తుతం ఒక సిలిండర్ బుక్ చేసిన తర్వాత రెండో సిలిండర్ కోసం కనీసం 25 రోజులు వేచి ఉండాలి.

డెలివరీ అథెంటికేషన్ సిస్టమ్ (DAC) నిబంధనలు ఏమిటి?

గ్యాస్ సిలిండర్ల పంపిణీలో పారదర్శకత కోసం ఓటీపీ ఆధారిత డెలివరీ అథెంటికేషన్ సిస్టమ్ మే నుంచి శాశ్వతం చేయబడింది. దీని ద్వారా సబ్సిడీ సిలిండర్లు పక్కదారి పట్టకుండా అడ్డుకోవచ్చు.

ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన లబ్ధిదారులకు ఈ-కేవైసీ తప్పనిసరినా?

అవును, ఉజ్వల్ యోజన లబ్ధిదారులకు ఆధార్ అధారిత బయోమెట్రిక్ అథెంటికేషన్ తప్పనిసరి. ఎనిమిదో రీఫిల్ నుంచి సబ్సిడీ పొందాలంటే ఈ కైవైసీ పూర్తి చేయాలి.

పైపుడ్ నేచురల్ గ్యాస్ (PNG) అందుబాటులో ఉంటే LPG వాడకంపై ప్రభావం ఏమిటి?

PNG సదుపాయం ఉన్న ప్రాంతాల్లో LPG కనెక్షన్లు వదులుకోవాలి. PNG కి మారకపోతే మూడు నెలల తర్వాత LPG సరఫరా ఆపివేస్తారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget