అన్వేషించండి

LPG VS PNG: హైదరాబాద్‌లో పైప్‌డ్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఎలా పొందాలి? మధ్య తరగతికి LPG లేదా PNGలలో ఏది బెస్ట్..?

యుద్ధం వల్ల LPG  సిలండర్లు సరఫరా కష్టం అవుతోంది.. PNG పెట్టించుకోండి అని ప్రభుత్వం చెబుతోంది. హైదరాబాద్‌లో PNG కనెక్షన్ ఎలా పొందాలి? LPG , పైప్ గ్యాస్ (PNG) ఈ రెండింట్లో ఏదీ బెటర్..?ఇక్కడ తెలుసుకోండి

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • LPG సిలిండర్ల కొరత నేపథ్యంలో PNG వైపు ప్రభుత్వం ప్రోత్సాహం.
  • హైదరాబాద్‌లో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ ద్వారా PNG కనెక్షన్లు.
  • PNG కనెక్షన్ ఖర్చు ₹6000-7000, సౌకర్యం, భద్రత ప్రధాన లాభాలు.
  • PNG, LPG నెలవారీ ఖర్చులో పెద్దగా తేడా లేకపోవచ్చు.

Hyderabad PNG Connection: ఇరాన్‌ ముద్ధం మొదలై మూడూ వారాలు దాటిపోయింది. మనం LPG గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకుని వాటి కోసం ఎదురు చూస్తూ.. రెండు వారాలు దాటిపోతోంది. అయినా కొన్ని చోట్ల సిలిండర్లు డెలివరీ అవ్వలేదు. యుద్ధం పుణ్యమా అని ముందు ముందు పరిస్థితి ఎలా ఉండబోతోందో కూడా తెలీడం లేదు. ప్రభుత్వం కూడా నెమ్మదిగా అసలు విషయాన్ని చెబుతోంది. రాబోయే రోజుల్లో LPG సరఫరాకు ఇబ్బంది అవుతుందని ప్రజలు ప్రత్యామ్నాయాల వైపు వెళ్లాలంటోంది.. అందులో భాగంగా పైపుల ద్వారా సరఫరా చేసే సహజవాయివు PNG ఉపయోగించాలని సూచిస్తోంది. ఇంతకీ హైదరాబాద్‌లో PNG కనెక్షన్ ఎలా పొందాలి...? (How do we get PNG Connection in Hyderabad). ఈ తరుణంలో సగటు మధ్యతరగతి యజమానికి వచ్చే ప్రధాన సందేహం ఒక్కటే.. "అసలు ఈ పైప్ గ్యాస్ కనెక్షన్ తీసుకోవడం వల్ల మనకేమైనా పైసా ఆదా అవుతుందా? లేక ఉన్న సిలిండరే బెటరా?" 
ఆ వివరాలన్నీ ఇక్కడ తెలుసుకుందాం

హైదరాబాద్‌లో PNG కనెక్షన్ ఎలా పొందాలి..?

 భాగ్యనగరంలో ఇప్పుడు అక్కడక్కడా రోడ్ల పక్కన పసుపు రంగు పైపులు కనిపిస్తున్నాయి. ఇళ్ల ముందర మీటర్లు బిగిస్తున్నారు. అవును.. నగరంలో పైప్‌డ్ నేచురల్ గ్యాస్ (PNG) నెమ్మదిగా విస్తరిస్తోంది. హైదారబాద్‌లో PNG కనెక్షన్లు పొందాలంటే ... ఉన్న ఒకే ఒక్క ఆప్షన్  భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ (BGL). ఇది గెయిల్ (GAIL), హెచ్‌పీసీఎల్ (HPCL) సంయుక్త సంస్థ.

పైప్‌డ్‌ గ్యాస్ కనెక్షన్ పొందడానికి ముందు మనం చూసుకోవాలసింది. ఆ ప్రాంతంలో సహజవాయి పైప్‌లైన్లు ఉన్నాయా? లేదా..? అని.. మీ ప్రాంతంలో పైపులైన్ ఉన్నట్లైతే భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్‌లో అప్లై చేయాలి. కనెక్షన్ మొత్తానికి సరిపడా డిపాజిట్ చెల్లిస్తే..ఇన్‌స్టేషన్ పూర్తయ్యాక.. గ్యాస్ కనెక్షన్ యాక్టివ్ అవుతుంది. మీరు అపార్ట్‌మెంట్‌లో నివసించేట్లైతే.. దానికి ఆ అపార్ట్‌మెంట్ అసోసియేషన్ పర్మిషన్ కావాలి.

అవసరమైన డాక్యుమెంట్లు:

  • ఆధార్ / ఐడీ ప్రూఫ్
    అడ్రస్ ప్రూఫ్
    ఇల్లు మీద హక్కు పత్రం లేదా అద్దెదారైతే ఓనర్ NOC

 

సాధారణంగా PNG కనెక్షన్ కోసం:

మొత్తం ఖర్చు: ₹6,000 – ₹7,000 మధ్య ఉంటుంది. 
సెక్యూరిటీ డిపాజిట్: ₹5,000 – ₹6,000 (రిఫండబుల్)
వినియోగ డిపాజిట్: ₹1,000 (రిఫండబుల్)
ఇతర చార్జీలు: GST/రిజిస్ట్రేషన్

కొన్ని సందర్భాల్లో ఇంటి లోపల పైప్‌లైన్ వేసే పని ఉంటే అదనంగా ₹5,000 – ₹10,000 వరకు ఖర్చు కావచ్చు.

అయితే, ఇప్పటికీ సిటీలో LPG సిలిండర్లే ఎక్కువ ఉన్నాయి. మొత్తం గ్యాస్ కనెక్షన్‌లలో PNG ఉన్నవి కేవలం 9-10శాతం మాత్రమే. నగరంలో ౩౩లక్షల LPG సిలిండర్లు ఉంటే.. PNG కనెక్షన్లు సంఖ్య ఓ 3లక్షల వరకూ ఉంది. అయితే ఇప్పుడే నెమ్మదిగా ఇది విస్తరిస్తోంది.

కనెక్షన్ రకం కనెక్షన్ల సంఖ్య (సుమారు) మార్కెట్ వాటా (%)
LPG (సిలిండర్) 33,00,000+ 90%
PNG (పైప్‌డ్ గ్యాస్) 3,16,000+ 10%
మొత్తం ~36,16,000 100%


LPG Vs PNG రెండింట్లో ఏది బెస్ట్..?

ప్రస్తుతం ఉన్న యుద్ధ పరిస్థితుల కారణంగా LPG దిగుమతులు కష్టమై.. ప్రభుత్వం అందరికీ వేగంగా సిలిండర్లు ఇవ్వలేకపోతోంది. ప్రస్తుతం ఉన్న నిల్వలు అయిపోతే.. ముందు ముందు పరిస్థితి తీవ్రం కావొచ్చు. అందుకే ప్రభుత్వం PNG కనెక్షన్లు ప్రోత్సహిస్తోంది. LPGతో పోల్చితే దానిపై ఒత్తిడి తక్కువ. ప్రభుత్వం సరఫరా కష్టాలను తప్పించుకోవడానికి జనాలను PNG తీసుకోమని చెబుతోంది. మరి అది తీసుకోవడం వల్ల ఏంటి లాభం. అది ఏమైనా LPG కన్నా తక్కువుకు వస్తుందా.. ఓ మధ్యతరగతి కుటుంబానికి ఇది భారమా..? బెస్ట్ చాయిసా.. అంటే అందుకు చాలా లెక్కలు ఉన్నాయి


అసలు లెక్క ఇక్కడే ఉంది: PNG vs LPG:

చాలామంది PNG అంటే చాలా తక్కువ రేటు అనుకుంటారు. కానీ వాస్తవ పరిస్థితులు కొంచెం భిన్నంగా ఉన్నాయి. ఒక మధ్యతరగతి కుటుంబాన్ని ఉదాహరణగా తీసుకుంటే..

ఎల్పీజీ (LPG) లెక్క: ప్రస్తుతం హైదరాబాద్‌లో ఒక సిలిండర్ ధర సుమారు ₹1000. చిన్న కుటుంబానికి ఇది రెండు నెలలు వస్తుంది అనుకుంటే.. నెలకు అయ్యే ఖర్చు ₹500
పీఎన్‌జీ (PNG) లెక్క: పైప్ గ్యాస్ ధర యూనిట్ (SCM)కు సుమారు ₹45-50 మధ్య ఉంటుంది. ఒక ఎల్పీజీ సిలిండర్ ఇచ్చే శక్తిని పొందాలంటే సుమారు 22-23 యూనిట్ల పీఎన్‌జీ వాడాలి. అంటే నెలకు దీని ఖర్చు కూడా  ₹450 నుంచి ₹600 మధ్యలో ఉంటుంది. .
 మీరు రెండు ఒకే సిలిండర్ వాడే చిన్న కుటుంబం అయితే, రెండింటి మధ్య ఖర్చులో పెద్దగా తేడా ఉండదు. కానీ, వంట ఎక్కువగా చేసే పెద్ద కుటుంబాలలోకైతే PNG వల్ల నెలకు ఒక వంద రూపాయల వరకు ఆదా అయ్యే అవకాశం ఉంది.

డబ్బు కంటే 'సౌకర్యం' ముఖ్యం! 

  • ఖర్చు విషయంలో పెద్ద తేడా లేకపోయినా, పీఎన్‌జీ వైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణం 'కంపర్ట్'. 
    బుకింగ్ గోల లేదు:గ్యాస్ అయిపోతుందనే టెన్షన్ ఉండదు. అయిపోయాక బుక్ చేసి, డెలివరీ బాయ్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు.
    వాడినంతే బిల్లు: ఎలక్ట్రిసిటీ బిల్లు లాగే, మీరు ఎంత గ్యాస్ వాడితే అంతే బిల్లు వస్తుంది. ఒకేసారి వెయ్యి రూపాయలు తీసి పక్కన పెట్టక్కర్లేదు.
    భద్రత: సిలిండర్లతో పోలిస్తే పైప్ గ్యాస్ తక్కువ ఒత్తిడితో సరఫరా అవుతుంది, కాబట్టి ప్రమాద తీవ్రత తక్కువ.

అన్నీ బాగున్నా కొన్ని మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయి. పీఎన్‌జీ కనెక్షన్ ఒకసారి తీసుకుంటే అది ఆ ఇంటికే పరిమితం. మీరు ఇల్లు మారితే సిలిండర్‌లాగా వెంటనే పట్టుకెళ్లలేరు. అలాగే, ఇన్‌స్టాలేషన్ సమయంలో రోడ్లు తవ్వడం, అపార్ట్‌మెంట్ అసోసియేషన్ నుంచి పర్మిషన్లు తీసుకోవడం వంటివి కొంచెం విసుగు తెప్పిస్తాయి.


* గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న ప్రధాన ప్రాంతాలైన శంషాబాద్, మేడ్చల్, కుత్బుల్లాపూర్, బాలానగర్, మరియు కూకట్‌పల్లి పరిసరాల్లో ఈ నెట్‌వర్క్ బలంగా ఉంది.
* కేవలం ఇళ్లే కాకుండా, సుమారు **500 పైగా వాణిజ్య (Commercial)** సంస్థలు మరియు **150 వరకు పారిశ్రామిక (Industrial)** యూనిట్లు ఈ గ్యాస్‌ను వాడుతున్నాయి.

గడిచిన రెండు మూడేళ్లలో PNG డిమాండ్‌లో గణనీయమైన మార్పు వచ్చింది.

 ప్రతి ఏటా కొత్త కనెక్షన్ల కోసం వచ్చే దరఖాస్తుల సంఖ్యలో 15% నుండి 20% వృద్ధి కనిపిస్తోంది.

ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరిగిన ప్రతిసారీ, ప్రత్యామ్నాయంగా PNG కోసం ఎంక్వైరీలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా కొత్తగా నిర్మిస్తున్న గేటెడ్ కమ్యూనిటీలు, హై-రైజ్ అపార్ట్‌మెంట్‌లు 100% పైప్‌డ్ గ్యాస్ సిస్టమ్‌నే కోరుకుంటున్నాయి.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
Kiran Abbavaram: అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
Embed widget