Ashish Mishra Arrested: లఖింపుర్ ఖేరీ ఘటన.. కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రాను అరెస్ట్ చేసిన యూపీ పోలీసులు
Lakhimpur Kheri Case: ఉత్తర్‌ప్రదేశ్ లఖింపుర్ ఖేరీ విషాద ఘటనకు సంబంధించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడైన ఆశిష్ మిశ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు.
దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఉత్తర్‌ప్రదేశ్ లఖింపుర్ ఖేరీ విషాద ఘటనకు సంబంధించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడైన ఆశిష్ మిశ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. గత వారం రోజులుగా ఆచూకీ లేకుండా పోయిన ఆశిష్ మిశ్రాను నేడు 12 గంటలపాటు సుదీర్ఘంగా విచారించిన అనంతరం యూపీ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. లఖింపుర్‌లో రైతుల హత్యాకాండ కేసును డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఉపేంద్ర అగర్వాల్ దర్యాప్తు చేస్తున్నారు.
రైతులు చనిపోయిన ఘటన అనంతరం ఆశిష్ మిశ్రా నేపాల్‌కు పారిపోయాడని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఎట్టకేలకు కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రాను యూపీ పోలీసులు శనివారం అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆశిష్ మిశ్రాతో సహా మరికొందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసు విచారణకు ఆశిష్ మిశ్రా హాజరు కాకపోవడంపై సుప్రీం కోర్టు ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆశిష్‌పై ఉన్న అభియోగాలు చాలా తీవ్రమైనవని సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణ వ్యాఖ్యానించారు.
Also Read: సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు?.. యూపీ సర్కార్‌పై సుప్రీం ఫైర్
Ashish Mishra, son of MoS Home Ajay Mishra Teni, has been arrested as he was not cooperating during the interrogation and didn't answer few questions. He will be produced before the court: DIG Upendra Agarwal, Saharanpur pic.twitter.com/nLG3HcmNME
— ANI UP (@ANINewsUP) October 9, 2021
అసలేం జరిగిందంటే..
ఇటీవల యూపీలోని లఖింపుర్ ఖేరిలో నిరసన చేపట్టిన రైతులపైకి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కాన్వాయ్ దూసుకెళ్లిన ఘటనలో 8 మంది మృతి చెందారు. మృతుల్లో నలుగురు రైతులు ఉన్నారు. వాహనంలో ఉన్న నలుగురు భాజపా కార్యకర్తలు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. అయితే కాన్వాయ్‌లోని ఓ వాహనంలో కేంద్ర మంత్రి కుమారు ఆశిష్ మిశ్రా ఉన్నాడని రైతులు ఆరోపించారు. ఈ ఘటనపై సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీల నేతలు యూపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మంత్రి కుమారుడిని రక్షించేందుకు యూపీ సర్కార్, పోలీసులు ప్రయత్నిస్తున్నారని విపక్ష నేతలు ఆరోపించారు.
Also Read: చదువుకు దూరం చేస్తున్నారని కోర్టుకెళ్లిన వివాహిత.. ఫ్యామిలీ కోర్టు సంచలన తీర్పు!
In Lakhimpur Kheri incident, a fair investigation is underway under retired High Court judge & some have been arrested and some have been called for questioning: UP Minister Sidharth Nath Singh on Yadav's statement that constitution is being crushed by UP govt (2/2)
— ANI UP (@ANINewsUP) October 9, 2021
Also Read: Lakhimpur Kheri Incident: 'నేను, నా కుమారుడు ఆ కారులో లేం.. ఎలాంటి దర్యాప్తుకైనా సిద్ధం'