(Source: ECI/ABP News/ABP Majha)
Indore: చదువుకు దూరం చేస్తున్నారని కోర్టుకెళ్లిన వివాహిత.. ఫ్యామిలీ కోర్టు సంచలన తీర్పు!
Divorce Petition: తనను చదువుకు దూరం చేస్తున్నారని, వేధింపులు భరించపోతున్నాంటూ కోర్టు మెట్లు ఎక్కిన ఆమెకు న్యాయం జరిగేలా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
మహిళలు, బాలికల హక్కులకు భంగం వాటిల్లితే కోర్టులు సైతం తగిన రీతిలో స్పందించి తీర్పులిచ్చిన ఘటనలు చూశాం. తాజాగా ఇండోర్ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది. తనను చదువుకు దూరం చేస్తున్నారని, వేధింపులు భరించపోతున్నాంటూ కోర్టు మెట్లు ఎక్కిన ఆమెకు న్యాయం జరిగేలా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. భర్త నుంచి విడాకులు మంజూరు చేస్తూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పిచ్చింది.
మధ్యప్రదేశ్‌కు చెందిన బాధిత మహిళకు కేవలం 13 ఏళ్ల వయసులో పెద్దలు బాల్య వివాహం చేశారు. అత్తవారింట్లో అడుగు పెట్టిన నాటి నుంచి తనకు ఎన్నో అవమానాలు జరిగాయి. అయినా కుటుంబం పరువు కోసం వాటిని భరించింది. చిన్న వయసులోనే చదువుకు సైతం దూరం కావడంతో స్వేచ్ఛను కోల్పోయినట్లుగా ఆమె భావించింది. తాను కచ్చితంగా చదువుకుంటానని, చదువును కొనసాగించేందుకు అనుమతించాలని భర్తను కోరింది. అయితే ఆమెకు నిరాశే ఎదురైంది.
Also Read: యువతి సమయస్ఫూర్తి.. దిశా యాప్ ద్వారా ఆకతాయి ఆట కట్టించిన పోలీసులు..
ఓవైపు చదువుకునేందుకు అనుమతి ఇవ్వకపోగా, అత్తవారింట్లో నిత్యం తనకు నరకం చూపిస్తున్నారని తనకు ఎలాగైనా న్యాయం చేయాలని ఇండర్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. భర్త కుటుంబసభ్యులు సైతం తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని .. చదువుకు సైతం దూరం చేసి తన హక్కులు కాలరాస్తున్నారని.. తాను ఇక భర్త నుంచి విడిపోవాలని భావించింది. ఈ మేరకు విడాకులు కోరుతూ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆమె సమస్యను గుర్తించిన కోర్టు విడాకులు మంజూరు చేస్తూ సంచలన తీర్పు వెలువరించింది.
Also Read: అధికారులు తనిఖీలకొచ్చారని బార్లలోని మందుబాబులు పరార్ ! కానీ అసలు విషయం తెలిసిన తర్వాత...
బాధితురాలి లాయర్ ఏమన్నారంటే..
విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన బాధితురాలి తరఫు లాయర్ మాట్లాడుతూ.. కేవలం 13 ఏళ్ల వయసులో పెద్దలు ఆమెకు వివాహం చేశారు. అత్తవారింట్లో అడుగు పెట్టిన ఆమెకు ఎలాంటి సంతోషం లేదు. భర్తతో పాటు అతడి కుటుంబసభ్యులు ఆమెను పలు రకాలుగా వేధించసాగారు. ఆమెకు చదువుకోవాలని ఉందని చెబితే.. కనీసం అందుకు కూడా భర్త ఒప్పుకోలేదు. తన హక్కులను కాలరాయడం భరించలేక విడాకులు కోరుతూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది.
Also Read: లవర్ ని పార్క్ తీసుకెళ్లడం విన్నాం.. కానీ ఈ మహానుభావుడు ఎక్కడికి తీసుకెళ్లాడో తెలుసా?
బాధితురాలి ఆవేదనను గ్రహించిన ఫ్యామిలీ కోర్టు ఆమె నిర్ణయానికి మద్దతు తెలిపింది. స్వేచ్ఛ, స్వాతంత్య్రం లేకుండా చేస్తున్న భర్త నుంచి ఆమెకు విడాకులు మంజూరు చేస్తూ న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. చదువుకునే హక్కును కాలరాస్తున్న కారణంగా ఫ్యామిలీ కోర్టు మంజూరు చేసిన తొలి విడాకుల కేసు ఇది అని లాయర్ వెల్లడించారు.