Viral Video: ట్రైన్‌లో మిర్చి, ఉప్పుతో రోటీలు తింటున్న కూలీలు! ఎమోషనల్ వీడియో వైరల్!
Viral Video: కొందరు కూలీలు ట్రైన్‌లో మిర్చి, ఉప్పుతో రోటీలు తింటున్న వీడియో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.

Viral Video: దేశం చాలా పురోగతి సాధిస్తోంది. అనేక రంగాల్లో అనుకున్న దాని కంటే వేగంగా దూసుకెళ్తోంది. అయినా సరే మూడు పూటల భోజనం లభించని వారు ఎందరో ఉన్నారు. అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటాయి. ఇప్పుడు కూడా అలాంటి వీడియో ఒకటి మరోసారి వైరల్ అవుతోంది. నెటిజన్లు దీని ఎమోషనల్‌గా స్పందిస్తున్నారు. కొంతమంది కార్మికులు ఆకలి తీర్చుకోవడానికి నార్మల్ ఫుడ్ తింటున్న వీడియోను అంతా షేర్ చేస్తున్నారు. కదులుతున్న ట్రైన్‌లో వారు తింటున్న ఫుడ్ చూసి భావోద్వేగానికి గురవుతున్నారు.
మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
బోగీలో కింద కూర్చొని రోటీ, పచ్చిమిర్చి తింటున్న కూలీలు
ఈ వీడియోలో కొందరు వ్యక్తులు రైలులో ట్రావెల్ చేస్తుున్నారు. వారంతా కింది కూర్చొని తమ భోజనం చేస్తున్నారు. ఎండిపోయిన రొట్టెలను తింటున్నారు. దీని ఎలాంటీ కర్రీ లేదు. కేవలం పచ్చిమిర్చీలను ఉప్పులో ముంచుకొని షేర్ చేసుకొని తింటున్నారు. వాటిని ఆకుల్లో వేసుకొని కడుపు నింపుకుంటున్నారు. రద్దీ కారణంగా వారంతా కూర్చోవడానికి ఎలాంటి సీట్లు లేకపోగా కింది కూర్చొని తింటున్న దృశ్యం అందర్నీ కదలిస్తోంది.
ट्रेन के फर्श पर बैठकर नमक, रोटी और मिर्च खा रहे ये लोग… 🥹
— Shivani Sahu (@askshivanisahu) April 22, 2026
जहाँ कुछ लोग खाने में स्वाद ढूंढते हैं,
वहीं ये लोग सिर्फ पेट भरने की राहत ढूंढ रहे हैं।
pic.twitter.com/yZ2OG2pBLN
ఆ దృశ్యాన్ని చూస్తున్న వారంతా రకరకాలుగా స్పందిస్తున్నారు. ఎంత వృద్ధి పథంలో వెళ్తున్నా ఒక వర్గం ప్రజల ఆకలి బాధను ఈ వీడియో తెలియజేస్తుందని అంటున్నారు. చాలామంది దీనిని పేదల కఠోర వాస్తవికత అని అభివర్ణించగా, మరికొందరు వ్యవస్థను ప్రశ్నించారు. వీడియో చూసిన తర్వాత ఒక వినియోగదారుడు, "కొంతమంది రుచిని కోరుకుంటారు, కానీ వీరు కేవలం తమ ఆకలిని తీర్చుకుంటారు" అని కామెంట్ చేశారు. మరొకరు, "కొంతమందికి ఉప్పు, రొట్టె కూడా పెద్ద విషయమే" అని అభిప్రాయపడ్డారు. ఇంకొక వినియోగదారుడు "ఇలాంటి పేదరికాన్ని దేవుడు ఎవరికీ ఇవ్వకూడదు" అని వ్యాఖ్యానించారు. మరో వినియోగదారుడు "పేదల జీవితం నిజంగా కష్టం" అని చెప్పారు. "మనం నాల్గో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుకుంటాం, అయినా మన దేశంలో ప్రజలు ఉప్పు, కారంతో రొట్టె తింటున్నారు" అని మరో వ్యక్తి కామెంట్ చేశారు. మరో వినియోగదారుడు, "కార్మికుల ఈ దుస్థితి గురించి ప్రభుత్వాన్ని ఎవరూ ఎందుకు ప్రశ్నించడం లేదు?" అని వ్యాఖ్యానించారు. కొంతమంది వినియోగదారులు, "పేదలకు కారం అనేది రుచి కాదు, కేవలం కడుపు నింపుకునే మార్గం మాత్రమే" అని కూడా అన్నారు.
ట్రెండింగ్ వార్తలు






















