అన్వేషించండి

Kerala Menstrual Leave for Schoolgirls:కేరళ విద్యార్థులకు మెన్‌స్ట్రువల్ హాలిడేస్ ! దేశవ్యాప్తంగా చర్చినీయాంశమైన మోడల్‌!

Kerala Menstrual Leave:కేరళప్రభుత్వం విప్లవాత్మక ప్రాజెక్టు మెన్‌స్ట్రువల్ డిగ్నిటీ ప్రకటించింది. విద్యార్థినులకు నెలసరి సెలవులతోపాటు మహిళలకు సమాన వేతనం, కార్యాలయాల్లో క్రెచ్ సౌకర్యాలు కల్పించనుంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కేరళ పాఠశాల విద్యార్థినులకు నెలసరి సమయంలో మూడు రోజుల సెలవు.
  • సెలవు తీసుకున్నవారికి వారాంతాల్లో ప్రత్యేక క్యాచప్ తరగతులుంటాయి.
  • మహిళా ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం హామీ కల్పించారు.
  • 50కి పైగా ఉద్యోగులున్న సంస్థలలో తప్పనిసరిగా క్రెచ్ సౌకర్యాలు.

Kerala Menstrual Leave for Schoolgirls: అక్షరాస్యతలోనూ, సామాజిక సంస్కరణల్లో ఎప్పుడూ దేశానికి మార్గదర్శిగా నిలిచే కేరళ రాష్ట్రం, మహిళా సాధికారత దిశగా మరో చారిత్రాత్మక అడుగు వేసింది. కేరళలోని నూతన యూడీఎఫ్‌ ప్రభుత్వం విద్యాసంస్థల్లో చదువుకునే బాలికల కోసం, పని ప్రదేశాల్లో మహిళల కోసం విప్లవాత్మకమైన  మార్పులు ప్రతిపాదించింది. ప్రాజెక్టు మెన్‌స్ట్రువల్‌ డిగ్నిటీ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమం ఇప్పుడు దేశ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 

ఏంటీ ఈ ప్రాజెక్టు మెన్‌స్ట్రువల్‌ డిగ్నిటీ

ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన అంశం పాఠశాల విద్యార్థినులకు సంబంధించింది. నెలసరి సమయంలో బాలికలు ఎదుర్కునే శారీరక అసౌకర్యం, మానసిక ఒత్తిడిని దృష్టిలో పెట్టుకొని వారికి ప్రతి నెల మూడు రోజుల పాటు సెలవులు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం ద్వారా కేరళ పాఠశాల స్థాయిలోనే ఇటువంటి సౌకర్యాన్ని కల్పించిన దేశంలోనే తొలి రాష్ట్రంగా నిలిచింది. 

ఈ పథకం అమలు కేవలం సెలవు ఇవ్వడానికే పరిమితం కాలేదు. విద్యార్థినులు ఆ మూడు రోజులు పాఠశాలకు రాకపోవడం వల్ల చదువుల్లో వెనకుబడిపోతారనే ఆందోళన కలగకుండా ప్రభుత్వం ఒక వినూత్న పరిష్కారం ఆలోచించింది. సెలవు తీసుకున్న విద్యార్థినుల కోసం వారాంతాల్లో ప్రత్యేక క్యాచప్ క్లాసెస్‌ నిర్వహిస్తారు. దీని వల్ల వారు కోల్పోయిన పాఠాలు తిరిగి నేర్చుకునే అవకాశం ఉంటుంది. గతంలో కేరళలోని కొన్ని యూనివర్సిటీల్లో ఈ విధానం అమల్లోకి వచ్చినప్పటికీ ఇప్పుడు దీనిని వడీ సతీశన్ నేతృత్వంలోని ప్రభుత్వం పాఠశాల స్థాయికి విస్తరించింది. 

మహిళల ఆరోగ్యం, ఆత్మగౌరవాన్ని కాపాడటమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. నెలసరి సమయంలో విద్యార్థినులు పాఠశాలకు రావడం వల్ల ఎదురయ్యే ఇబ్బందులు, వారి ఆరోగ్యంపై చూపే ప్రభావం, ఆ సమయంలో వారికి అవసరమైన విశ్రాంతిని అందించడం ద్వారా వారిని విద్యాపరంగా మరింత ప్రోత్సహించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. కేరళను దేశంలోనే అత్యంత ఉమెన్ ఫ్రెండ్లీ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని చెబుతున్నారు. 

మహిళా ఉద్యోగులకు తీపి కబురు 

కేవలం విద్యార్థినులకే కాకుండా, పని చేసే మహిళల కోసం కూడా కేరళ ప్రభుత్వం రెండు కీలక నిర్ణయాలు ప్రకటించింది. పని ప్రదేశాల్లో పురుషులో సమానంగా మహిళలకు కూడా వేతనం అందేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. లింగ వివక్ష లేకుండా సమానం పనికి సమాన వేతనం అనే రాజ్యాంగ సూత్రాన్ని మరింత పటిష్టంగా అమలు చేయడమే దీని లక్ష్యం.  

1961 నాటి ప్రసూతి ప్రయోజనాల చట్టం కింద చైల్డ్‌ కేర్ రూల్స్ ను ప్రభుత్వం తప్పనిసరి చేయనుంది. దీని ప్రకారం 50 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, పరిశ్రమలు, ఐటీ సంస్థలు, ఇతర ప్రైవేటు కార్యాలయాల్లో తప్పనిసరిగా డే కేర్, క్రెచ్‌‌ సౌకర్యాలను కల్పించాలి. దీని వల్ల ప్రసవం తర్వాత మహిళలు తమ ఉద్యోగాలను వదులుకోవాల్సిన అవసరం ఉండదు.

కేరళ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ప్రాజెక్టు మెన్‌స్ట్రువల్‌ డిగ్నిటీ, సమానవేతన చట్టాలు విజయవంతమైతే, ఇవి భవిష్యత్‌లో మిగిలిన రాష్ట్రాలకు కూడా రోల్‌మోడల్‌గా నిలిచే అవకాశం ఉంది. 

Frequently Asked Questions

కేరళ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త కార్యక్రమం ఏమిటి?

కేరళ ప్రభుత్వం 'ప్రాజెక్టు మెన్‌స్ట్రువల్‌ డిగ్నిటీ'ని ప్రవేశపెట్టింది. ఇది బాలికలకు నెలసరి సెలవులు, మహిళా ఉద్యోగులకు ఇతర ప్రయోజనాలను అందిస్తుంది.

పాఠశాల విద్యార్థినులకు ఈ ప్రాజెక్టు కింద ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది?

నెలసరి సమయంలో బాలికలు ప్రతి నెలా మూడు రోజుల పాటు సెలవులు తీసుకోవచ్చు. వారు చదువుల్లో వెనకబడకుండా వారాంతాల్లో ప్రత్యేక క్యాచప్ క్లాసెస్ నిర్వహిస్తారు.

పాఠశాల స్థాయిలో నెలసరి సెలవులు కల్పించిన మొదటి రాష్ట్రం కేరళేనా?

అవును, పాఠశాల స్థాయిలో నెలసరి సెలవులు కల్పించిన దేశంలోనే తొలి రాష్ట్రంగా కేరళ నిలిచింది. గతంలో కొన్ని యూనివర్సిటీల్లో ఈ విధానం అమలులో ఉంది.

మహిళా ఉద్యోగులకు కేరళ ప్రభుత్వం ఏ ప్రయోజనాలను ప్రకటించింది?

పని ప్రదేశాల్లో సమాన వేతనం, 50 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న సంస్థల్లో డే కేర్, క్రెచ్ సౌకర్యాలు తప్పనిసరి చేయబడ్డాయి. ఇది ప్రసవం తర్వాత మహిళలు ఉద్యోగాలు వదులుకోకుండా సహాయపడుతుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

NDA Convenor Chandrababu?: ఎన్డీయే కూటమికి కొత్త కన్వీనర్ ఏర్పాటుకు మోదీ గ్రీన్ సిగ్నల్! రేసులో చంద్రబాబు!
ఎన్డీయే కూటమికి కొత్త కన్వీనర్ ఏర్పాటుకు మోదీ గ్రీన్ సిగ్నల్! రేసులో చంద్రబాబు!
Independence Day Quiz Questions : ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
Independence Day Speech : స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget