Karnataka BJP Worker Murder: భాజపా కార్యకర్త దారుణ హత్య- సీఎం సీరియస్, రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు!
Karnataka BJP Worker Murder: కర్ణాటకలో భాజపా కార్యకర్త దారుణ హత్యకు నిరసనగా ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పలు ప్రాంతాల్లో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి.
Karnataka BJP Worker Murder: కర్ణాటకలో భాజపా కార్యకర్తను దారుణంగా హత్య చేశారు. మంగళూరులో మంగళవారం రాత్రి ప్రవీణ్ హత్యకు గురయ్యారు. దీంతో పలు ప్రాంతాల్లో భాజపా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.
ఇలా హత్య
భాజపా యువ మోర్చా నాయకుడు ప్రవీణ్ (32)పై నెట్టారు ప్రాంతంలో దుండగులు మూకుమ్మడిగా దాడి చేశారు. ప్రవీణ్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. రక్తపు మడుగులో పడి ఉన్న అతడిని ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు.
పౌల్ట్రీ షాప్ యజమాని అయిన ప్రవీణ్‌పై మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగింది. అయితే ఈ హత్యకు గల కారణాలేంటి? చేసింది ఎవరు? అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నిరసనలు
భాజపా కార్యకర్త దారుణ హత్యను ఖండిస్తూ హిందూ సంస్థలు బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో బుధవారం సులియా, కడబ, పుత్తూరు సహా పలు తాలూకాల్లో బంద్ జరిగింది. ప్రధాన వాణిజ్య సంస్థలు, స్కూళ్లు మూతపడ్డాయి.
ప్రవీణ్ హత్యపై ఆందోళన చేపట్టిన భాజపా కార్యకర్తలు, నిరసనకారులు.. దక్షిణ కన్నడ ఎంపీ నలిన్ కుమార్ కారుపై దాడి చేశారు. కారును చుట్టుముట్టి ఊపేశారు. మరోవైపు వివిధ ప్రాంతాల్లో ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు.
#WATCH | Protestors express their anger over the murder of BJP Yuva Morcha worker Praveen Nettaru in Bellare, Dakshina Kannada.
— ANI (@ANI) July 27, 2022
The car being jolted by protesters reportedly belongs to Dakshina Kannada MP Nalinkumar Kateel#Karnataka pic.twitter.com/J4HyBZr0br
#WATCH | Police lathi-charge those protesting against the murder of BJP Yuva Morcha worker Praveen Nettar in Bellare of Dakshin Kannada district#Karnataka pic.twitter.com/oun3ciZbVm
— ANI (@ANI) July 27, 2022
సీఎం రియాక్షన్
భాజపా కార్యకర్త హత్యను కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ఖండించారు. తమ పార్టీ కార్యకర్తను దారుణంగా చంపిన నిందితుల్ని త్వరలోనే పట్టుకొని శిక్షిస్తామని ట్వీట్ చేశారు. ఇది ఎవరో కావాలని చేసిన హత్యగా అనుమానిస్తున్నట్లు సీఎం తెలిపారు.
Also Read: National Herald case: 3 రోజులు, 100 ప్రశ్నలు- ముగిసిన సోనియా గాంధీ ఈడీ విచారణ
Also Read: 5G Spectrum Auction: 5జీ స్పెక్ట్రం కోసం అంబానీ, అదానీల ఫైట్- తగ్గేదేలే!