(Source: ECI/ABP News/ABP Majha)
5G Spectrum Auction: 5జీ స్పెక్ట్రం కోసం అంబానీ, అదానీల ఫైట్- తగ్గేదేలే!
5G Spectrum Auction: 5జీ స్పెక్ట్రమ్ వేలంలో ముకేశ్ అంబానీ, గౌతం అదానీ వంటి బిజినెస్ టైకూన్లు పోటీ పడుతున్నారు.
5G Spectrum Auction: మన దేశంలో 5జీ సేవల స్పెక్ట్రం వేలం హోరాహోరీగా సాగుతోంది. బిజినెస్ టైకూన్లు ముఖేష్ అంబానీ, గౌతం అదానీ, సునీల్ భారత్ మిట్టల్ కంపెనీలు నువ్వానేనా అని తలపడుతున్నాయి. మొదటిరోజు వేలంలో గత రికార్డులను తుడిచి పెట్టేసేలా లక్షా 45వేల కోట్ల రూపాయలకు బిడ్ నమోదైంది.
ఇదే రికార్డ్
2015 లో స్పెక్ట్రం వేలంలో లక్షా 9 వేల కోట్ల రూపాయలు రావటమే ఇప్పటివరకూ అత్యధికం. అయితే మొదటిరోజు ఆ పాత రికార్డులను దాటి స్పెక్ర్టం వేలం సాగుతోంది. స్పెక్ట్రమ్ వేలం ప్రక్రియలో దేశంలోని నాలుగు కంపెనీలు పాల్గొంటున్నాయి.
5G spectrum auction concludes for the day. A total of four rounds of the auction were conducted today. The fifth round of the auction will start tomorrow.
— ANI (@ANI) July 26, 2022
ఇప్పటి వరకూ అయితే రేసులో రిలయన్స్ జియో ముందంజలో ఉంది. డిపాజిట్ల టైంలో నే టెలికం శాఖకు జియో రూ.14,000 కోట్లు.. భారతీ ఎయిర్‌టెల్ రూ.5500 కోట్లు.. అదానీ సంస్థ రూ.100 కోట్లు డిపాజిట్ చేశాయి. వొడాఫోన్ ఐడియా కూడా రూ.2200 కోట్లు డిపాజిట్ చేసింది.
మొత్తం స్పెక్ట్రమ్
ఈ సారి ప్రభుత్వం మొత్తం 72 GHz స్పెక్ట్రమ్‌ను వేలం వేయనుంది. ఇందులో లోబ్యాండ్‌లో (600 MHz, 700 MHz, 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz), మిడ్ బ్యాండ్‌లో (3300 MHz), హై బ్యాండ్‌లో 26 GHz ఉంటుంది.
5జీ టెక్నాలజీ ఆధారంగా టెలికం కంపెనీలు మిడ్, హై బ్యాండ్ స్పెక్ట్రమ్‌ను ఉపయోగిస్తాయని కేంద్రం అంచనా వేస్తోంది. ఎందుకంటే 5జీ వేగం 4జీ కంటే 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అంటే 4జీ స్పీడ్ 100Mbps గా ఉంటే 5జీ స్పీడ్ 10 Gbps వరకు ఉంటుంది. మరి 5జీ స్పెక్ట్రం ఎవరికి దక్కుతుందో చూడాలి. ఇన్ని కంపెనీలు పోటీలో ఉన్నా.. బీఎస్‌ఎన్‌ఎల్ కనిపించకపోయే సరికి సోషల్ మీడియాలో నెటిజన్లు మీమ్స్ షేర్ చేస్తున్నారు.
Also Read: Alappuzha Collector: శ్రీవారికి బాధ్యతలు అప్పగించిన శ్రీమతి కలెక్టర్! క్యా సీన్ హై!
Also Read: SC on Money Laundering: సోదాలు, అరెస్ట్‌లు కరక్టే- ఈడీ అధికారాలపై సుప్రీం కీలక వ్యాఖ్యలు