SC on Money Laundering: సోదాలు, అరెస్ట్‌లు కరక్టే- ఈడీ అధికారాలపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
SC on Money Laundering: మనీ లాండరింగ్ కేసుల్లో ఈడీ చేస్తోన్న సోదాలు, అరెస్ట్‌లు, ఆస్తులు సీజ్ వంటి వాటిని సుప్రీం కోర్టు సమర్థించింది.
SC on Money Laundering: మనీలాండరింగ్ (పీఎంఎల్‌ఏ) చట్టంలోని నిబంధనల చట్టబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ చట్టంలోని కీలక నిబంధనలను సుప్రీం కోర్టు సమర్థించింది.
ఈ చట్టం ప్రకారం పనిచేసే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన దర్యాప్తులో భాగంగా చేస్తున్న సోదాలు, అరెస్టులు, ఆస్తుల సీజ్ వంటి అన్ని చర్యలను అత్యున్నత న్యాయస్థానం సమర్థిస్తూ తీర్పు ఇచ్చింది.
ఈ మేరకు జస్టిస్ ఎంఏ ఖాన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు అధికారులు కల్పించే పీఎంఎల్‌ఏ చట్టంలోని సెక్షన్లు 5, 8(4), 15,17,19లు చట్టబద్ధమేనని స్పష్టం చేసింది ధర్మాసనం. బెయిల్ విషయంలోనూ సెక్షన్ 45 సరైనదేనని తేల్చింది.
Supreme Court says the Enforcement Case Information Report (ECIR) cannot be equated with FIR and ECIR is an internal document of Enforcement Directorate. Supply of ECIR to accused is not mandatory and only disclosure of reasons during arrest is enough, says SC.
— ANI (@ANI) July 27, 2022
పీఎంఎల్‌ఏ చట్టంలోని నిబంధనలను సవాల్ చేస్తూ వందకు పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. వాటన్నింటిని ఒకేసారి విచారిస్తోంది సుప్రీం కోర్టు. పోలీసు అధికారులను దర్యాప్తు ఏజెన్సీలు ఉపయోగిస్తున్నాయని, దర్యాప్తులో సీఆర్‌పీసీని అనుసరించాలని పిటిషనర్లు కోరారు.
Also Read: Philippines Earthquake: ఫిలిప్పైన్స్‌లో భారీ భూకంపం- వీడియోలు చూస్తే షాకవుతారు!
Also Read: Shinde Wishes Uddhav Thackeray: ఠాక్రేకు CM శిందే స్వీట్ విషెస్- మీకు అర్థమవుతోందా?