ISRO Chief Somanath: ఇస్రో ఛైర్మన్ సోమనాథ్‌కు అరుదైన బహుమతి ఇచ్చిన బుడ్డోడు, ఏమిచ్చాడంటే?
ISRO Chief Somanath: ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ కు ఓ బుడ్డోడు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు.
ISRO Chief Somanath: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రో వరుస విజయాలతో దూసుకుపోతోంది. గత నెలలో చంద్రయాన్-3 మిషన్ సక్సెస్ కావడంతో ప్రపంచ దేశాల నుంచి ఇస్రోకు ప్రశంసలు దక్కిన విషయం తెలిసిందే. తాజాగా ఆదిత్య-ఎల్1 మిషన్ ను కూడా విజయవంతంగా ప్రయోగించి రోదసియానంలో ఇస్రో చెరగని ముద్ర వేస్తోంది. ఆగస్టు 23వ తేదీన విక్రమ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండ్ అయింది. దీంతో జాబిలి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ చరిత్రకెక్కింది.
అదిరిపోయే విజయాలను సొంతం చేసుకుంటున్న ఇస్రో శాస్త్రవేత్తలకు ముఖ్యంగా ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ బాలుడు ఇస్రో చీఫ్ సోమనాథ్ కు ఇచ్చిన గిఫ్ట్ ఇప్పుడు అందరి ఎంతో ఆకట్టుకుంటోంది. సోమనాథ్ ఇంటి పొరుగున ఉండే ఓ బాలుడు విక్రమ్ ల్యాండర్ మోడల్ ను తయారు చేసి దానిని సోమనాథ్ కు గిఫ్ట్ గా ఇచ్చాడు. ఈ విషయాన్ని ఇస్రో శాస్త్రవేత్త పీవీ వెంటకకృష్ణన్ ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నారు. దీంతో ఈ విషయం కాస్త వైరల్ గా మారింది. 'ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ను ఇవాళ ఒక ఆశ్చర్యకరమైన సందర్శకుడు కలిశాడు. పొరుగున ఉండే బాలుడు తన సొంతంగా తయారు చేసిన విక్రమ్ ల్యాండర్ మోడల్ ను బహుమతిగా ఇచ్చాడు. ఇరుగుపొరుగు వారందరి తరఫున ఇస్రో చీఫ్ కు ఈ గిఫ్ట్ అందించాడు' అని తన పోస్టులో పేర్కొన్నారు.
ISRO Chief Sri Somanath today had a surprise visitor,A young neighbour boy has handed over own made Vikram Lander model to the ISRO chief on behalf of all the neighbours. pic.twitter.com/BcyHYO0pDW
— Dr. P V Venkitakrishnan (@DrPVVenkitakri1) September 2, 2023
దేశమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఆదిత్య L1 మిషన్‌ని ఇస్రో ఇవాళ లాంఛ్ చేసింది ఇస్రో. నిప్పులు కక్కుతూ నింగిలోకి దూసుకెళ్లింది ఈ రాకెట్. సరిగ్గా 11.50 నిముషాలకు రాకెట్ లాంఛ్ అయింది. రెండు దశలు విజయవంతం అయినట్టు ఇస్రో ప్రకటించింది. ఆ తరవాత అన్ని దశలూ దాటుకుని వెళ్లింది ఆదిత్య L1. చివరకు స్పేస్‌క్రాఫ్ట్ నుంచి ఉపగ్రహం విజయవంతంగా విడిపోయినట్టు వెల్లడించింది. ఆదిత్య L1 తన ప్రయాణాన్ని మొదలు పెట్టిందని తెలిపింది.
ఆదిత్య L1ని క్రమంగా లగ్రాంజ్ పాయింట్‌లోకి ప్రవేశపెట్టనుంది ఇస్రో. మూడు దశలూ విజయవంతం అయినట్టు శాస్త్రవేత్తలు ప్రకటించారు. ప్రస్తుతం కీలకమైన నాలుగో దశపై ఉత్కంఠ కొనసాగుతోంది. లగ్రాంజియన్ పాయింట్‌కి చేరుకున్న తరవాత Visible Emission Line Coronagraph (VELC) సాయంతో అక్కడి నుంచి ఫొటోలు పంపనుంది ఆదిత్య L1. రోజుకి 1,440 ఫొటోలు పంపుతుందని ఇస్రో ప్రకటించింది. ఈ ఫొటోల ద్వారా సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు వీలవుతుంది. ఆదిత్య L1లో అతి పెద్ద పే లోడ్ VELC. ఈ మిషన్ మొత్తంలో ఇదే అత్యంత కీలకం. Indian Institute of Astrophysics ఇస్రోతో కలిసి ఈ పేలోడ్‌ని తయారు చేసింది.