అన్వేషించండి

Odisha Train Accident: ముగ్గురు రైల్వే అధికారులపై సీబీఐ ఛార్జ్‌షీట్‌, సాక్ష్యాలను నాశనం చేశారని అభియోగం

Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంలో ముగ్గురు రైల్వే అధికారులపై సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.

Odisha Train Accident: 290 మంది మృతి చెందిన, వందలాది మంది గాయపడిన ఒడిశా రైలు ప్రమాదం గురించి దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిందే. ఈ కేసులో గతంలో అరెస్టయిన ముగ్గురు రైల్వే ఉద్యోగులపై తాజాగా సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ముగ్గురు రైల్వే అధికారులు అరుణ్ కుమార్ మహంత, ఎండీ అమీర్ ఖాన్, పప్పు కుమార్ లపై హత్య, సాక్ష్యాధారాలను ధ్వంసం చేయడం వంటి నేరపూరిత అభియోగాలు మోపింది. ఒడిశాలోని బాలాసోర్ లో సిగ్నలింగ్ వైఫల్యం కారణంగా మూడు రైళ్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 290 మంది మృతి చెందారు. వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎంతో మంది వికలాంగులయ్యారు. ఈ ప్రమాదం జరిగిన నెల తర్వాత జులైలో ముగ్గురు రైల్వే అధికారులను అరెస్టు చేశారు. 

సీనియర్ సెక్షన్ ఇంజినీర్ అరుణ్ కుమార్ మహంత, సెక్షన్ ఇంజినీర్ మహ్మద్ అమీర్ ఖాన్, సాంకేతిక నిపుణుడు పప్పు కుమార్ లను ప్రమాదానికి బాధ్యులను చేస్తూ సీబీఐ గతంలో అరెస్టు చేసింది. ఈ ముగ్గురు రైల్వే అధికారులపై భారత శిక్షా స్మృతిలోని 304, 201 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. 

గతంలో అరుణ్ కుమార్ బెయిల్ పిటిషన్ కొట్టివేత

ఒడిశా రైలు ప్రమాదం గురించి సీబీఐ కీలక విషయాలు వెల్లడించింది. ప్రమాదం జరిగిన తీరుపై, కారణాలపై దర్యాప్తు చేస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్ధ - సీబీఐ.. అసలు ప్రమాదానికి కారణాలేంటో వివరించింది. అనుమతులు లేని రిపేర్ పనులు చేపట్టడం వల్లే ఒడిశా రైలు దుర్ఘటన జరిగిందని వెల్లడించింది. సీనియర్ సెక్షన్ ఇంజినీర్, సిగ్నల్ ఇంఛార్జ్ అయిన అరుణ్ కుమార్ మహంత.. ఉన్నతాధికారులు నుంచి అనుమతులు తీసుకోకుండా క్షేత్ర స్థాయిలో మరమ్మతులు చేయించినట్లు సీబీఐ గుర్తించింది. ఈ విషయాన్ని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి వివరించింది. 

అయితే ఈ ఘోర రైలు దుర్ఘటనకు సంబంధించి సీబీఐ గతంలో ముగ్గురు అధికారులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ ముగ్గురిలో అరుణ్ కుమార్ మహంత కూడా ఒకరు. అయితే, తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఒడిశా రాజధాని భువనేశ్వర్ లోని సీబీఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరగ్గా.. సీబీఐ తీవ్రంగా వ్యతిరేకించింది. సీబీఐ కోర్టూ ఆ వాదనల వైపే మొగ్గింది. అలా అరుణ్ కుమార్ బెయిల్ ను కొట్టేసింది.

ఎలా జరిగింది..? 

రైల్వే అధికారుల సమచారం ప్రకారం...12841  షాలిమార్ చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ మధ్యాహ్నం 3.20 నిముషాలకు షాలిమార్‌ స్టేషన్‌ నుంచి బయల్దేరింది. బాలాసోర్‌కి సాయంత్రం 6.30 నిముషాలకు చేరుకుంది. ఆ తరవాత అక్కడి నుంచి చెన్నై బయల్దేరిన ట్రైన్ సరిగ్గా 7.20 నిముషాల సమయంలో బాలేశ్వర్ వద్ద ఒక్కసారిగా అదుపు తప్పింది. దాదాపు 10-12 కోచ్‌లు పట్టాలు తప్పి పడిపోయాయి. పక్కనే ఉన్న ట్రాక్‌పై పడిపోయాయి. అప్పటికే అక్కడ ఓ గూడ్స్ ట్రైన్ పార్క్ చేసి ఉంది. ఆ గూడ్స్ ట్రైన్‌ని కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ కోచ్‌లు బలంగా ఢీకొట్టాయి.  ఆ తరవాత కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ బోగీలు పడిపోయిన ట్రాక్‌పైన 12864  బెంగళూరు హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ దూసుకొచ్చింది. అప్పటి వరకూ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ పడిపోయినట్టు ఎవరికీ సమాచారం అందలేదు. వేగంగా దూసుకొచ్చిన హౌరా ఎక్స్‌ప్రెస్‌ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్  బోగీలను ఢీకొట్టింది. ఫలితంగా..మూడు నాలుగు కోచ్‌లు పట్టాలు తప్పి పడిపోయాయి. అంటే ఇవి ఎదురెదురుగా ఢీకొట్టుకున్నాయి. ప్రమాద సమయంలో రెండు రైళ్లూ వేగంగా ఉండటం వల్ల ప్రాణనష్టం ఎక్కువగా నమోదైంది. ఇదంతా మొత్తం 20 నిముషాల్లోనే జరిగిపోయింది. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. కొందరు ఆ నిద్రలోనే కన్నుమూశారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Abhishek Banerjee Attack Sonarpur: గుడ్లతో దాడి - హెల్మెట్ పెట్టుకుని వెళ్లిపోయిన మమతా బెనర్జీ మేనల్లుడు - బెంగాల్‌లో కలకలం
గుడ్లతో దాడి - హెల్మెట్ పెట్టుకుని వెళ్లిపోయిన మమతా బెనర్జీ మేనల్లుడు - బెంగాల్‌లో కలకలం
Breaking News: అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్‌ నేత బాల్క సుమన్ అరెస్టు
అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్‌ నేత బాల్క సుమన్ అరెస్టు
విశ్వ గురువు అంటారు.. ఒక్క ఎగ్జామ్ సరిగ్గా నిర్వహించడం చేతకాదు: UET UG జాప్యంపై రాహుల్ గాంధీ
విశ్వ గురువు అంటారు.. ఒక్క ఎగ్జామ్ సరిగ్గా నిర్వహించడం చేతకాదు: UET UG జాప్యంపై రాహుల్ గాంధీ
IT Manager turns Auto Driver: ఐటీ ఉద్యోగం కన్నా ఆటో డ్రైవర్ పనే సూపర్ - ఈ మహిళ రియల్ స్టోరీ వింటే కనెక్టయిపోతారు!
ఐటీ ఉద్యోగం కన్నా ఆటో డ్రైవర్ పనే సూపర్ - ఈ మహిళ రియల్ స్టోరీ వింటే కనెక్టయిపోతారు!

వీడియోలు

GT vs RR Qualifier 2 Highlights IPL 2026 | ఐపీఎల్ ఫైనల్‌కు గుజరాత్ టైటాన్స్
Vaibhav Sooryavanshi 96 Runs Highlights IPL 2026 | వైభవ్ సూర్యవంశీని వెంటాడిన దురదృష్టం
Riyan Parag about Vaibhav IPL 2026 | రాజస్థాన్‌కు రెండో టైటిల్ తెచ్చేది వైభవే
Hardik Pandya Leaves Mumbai Indians | ముంబైని వీడి CSKలోకి హార్దిక్ ఎంట్రీ?
Sai Sudharsan Hit Wicket In IPL 2026 | వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హిట్ వికెట్ అయిన సాయి సుదర్శన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RBI Plastic Notes: ఇక డబ్బులు చిరిగిపోవు- ప్లాస్టిక్ నోట్లు ముద్రిస్తున్న ఆర్బీఐ
ఇక డబ్బులు చిరిగిపోవు- ప్లాస్టిక్ నోట్లు ముద్రిస్తున్న ఆర్బీఐ
Telangana EdCET Results: తెలంగాణ ఎడ్‌సెట్‌ 2026 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డ్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
తెలంగాణ ఎడ్‌సెట్‌ 2026 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డ్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
HYDRAA Operation Mushkin Cheruvu: చెరువు అభివృద్ధి పేరుతో భారీ కుట్ర.. బట్టబయలు చేసిన హైడ్రా!
చెరువు అభివృద్ధి పేరుతో భారీ కుట్ర.. బట్టబయలు చేసిన హైడ్రా!
Indian tourists Vietnam: రన్‌వే, రైలు పట్టాలు - రీల్స్ కేదీ కాదు అనర్హం - భారతీయ పర్యాటకులపై తీవ్ర వ్యతిరేకత - వీడియోలు
రన్‌వే, రైలు పట్టాలు - రీల్స్ కేదీ కాదు అనర్హం - భారతీయ పర్యాటకులపై తీవ్ర వ్యతిరేకత - వీడియోలు
Actor Sathyendra Death: 60 సినిమాల్లో నటించాడు - చనిపోతే చూసేందుకు కుటుంబం కూడా రాలేదు - సత్యేంద్ర దుస్థితి ఇదే!
60 సినిమాల్లో నటించాడు - చనిపోతే చూసేందుకు కుటుంబం కూడా రాలేదు - సత్యేంద్ర దుస్థితి ఇదే!
Regional sentiment gimmicks ahead of GHMC Elections | GHMC ఎన్నికలే టార్గెట్టా? తెలంగాణ సెంటిమెంటు, సెట్లర్ ఓటు, కొత్త రాజకీయ సమీకరణాలు
GHMC ఎన్నికలే టార్గెట్టా? తెలంగాణ సెంటిమెంటు, సెట్లర్ ఓటు, కొత్త రాజకీయ సమీకరణాలు
DK Shivakumar Swearing In Ceremony:యంగ్ టీంతో సిద్ధమవుతున్న కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి డీకే శివకుమార్! జట్టులో నలుగురు డిప్యూటీ సీఎంలు!
యంగ్ టీంతో సిద్ధమవుతున్న కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి డీకే శివకుమార్! జట్టులో నలుగురు డిప్యూటీ సీఎంలు!
Tesla Launches Y Premium Variant: టెస్లా మోడల్ వై లైనప్ లో మార్పులు: కొత్త ప్రీమియం వేరియంట్ లాంచ్.. ధర ఏకంగా రూ. 10 లక్షలకు పైగా తగ్గింపు
టెస్లా మోడల్ వై లైనప్ లో మార్పులు: కొత్త ప్రీమియం వేరియంట్ లాంచ్.. ధర ఏకంగా రూ. 10 లక్షలకు పైగా తగ్గింపు
Embed widget