అన్వేషించండి

IRCTC Down: ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్, మొబైల్ యాప్ సేవల్లో అంతరాయం - ప్రయాణికుల అవస్థలు

IRCTC Ticket Booking: ఐఆర్‌సీటీసీ సైట్, మొబైల్ యాప్ సేవల్లో అంతరాయం కలగడంతో ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురయ్యారు. మెయింటెనెన్స్ పనుల కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని సంస్థ తెలిపింది.

IRCTC Website And Mobile App Down: రైల్వే టికెట్ బుకింగ్స్ కోసం ఏర్పాటైన ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)కు చెందిన వెబ్‌సైట్, మొబైల్ యాప్ సేవల్లో గురువారం అంతరాయం ఏర్పడింది. దీంతో టికెట్ సేవలకు అంతరాయం కలిగి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునే వారు సైట్ పనిచేయక అసహనం వ్యక్తం చేశారు. వెబ్ సైట్, మొబైల్ యాప్ ఓపెన్ కావడం లేదని పలువురు యూజర్లు సోషల్ మీడియా వేదికగా ఉదయం నుంచీ పోస్టులు పెడుతున్నారు. దీనిపై ఐఆర్‌సీటీసీ సంస్థ స్పందించింది. నిర్వహణపరమైన పనులు చేపట్టడంతోనే టికెట్ సేవలకు అంతరాయం ఏర్పడిందని సంస్థ పేర్కొంది.

'మెయింటెనెన్స్ పనుల కారణంగా.. ఈ టికెట్ సేవలు అందుబాటులో లేవు. టికెట్ రద్దు చేసుకోవడానికి ఫైల్ టీడీఆర్ కోసం కస్టమర్ కేర్ నెంబర్ 14646, 08044647999, 08035734999కు ఫోన్ లేదా etickets@irctc.co.in కు మెయిల్ చేయండి.' అని ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో తెలిపింది. కాగా, రైల్వే వెబ్‌సైట్, మొబైల్ యాప్ సేవల్లో అంతరాయం కలగడం ఈ నెలలో ఇది రెండోసారి. 2 వారాల క్రితం కూడా ఇలాంటి సమస్యే తలెత్తింది. అప్పుడు కూడా సరిగ్గా తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునే సమయంలోనే సైట్ ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురయ్యారు.

ఎయిర్‌టెల్ సేవల్లోనూ..

అటు, ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ సేవలకూ గురువారం అంతరాయం ఏర్పడింది. మొబైల్ డేటా, బ్రాడ్ బ్యాండ్ సేవల్లోనూ అంతరాయం నెలకొంది. కాల్స్, ఇంటర్నెట్ వాడకంలో ఇబ్బందులు తలెత్తినట్లు యూజర్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. దేశవ్యాప్తంగా ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై ఎయిర్‌టెల్ సంస్థ అధికారికంగా స్పందించలేదు.

Also Read: New Rules 2025: కొత్త సంవత్సరం, కొత్త రూల్స్‌ - అన్నీ నేరుగా మీ పాకెట్‌పై ప్రభావం చూపేవే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RR vs SRH Ishan Kishan Century: ఐపీఎల్‌లో ఇషాన్ కిషన్ తొలి సెంచరీ, లీగ్ చరిత్రలో సన్ రైజర్స్ రికార్డు స్కోరు
ఐపీఎల్‌లో ఇషాన్ కిషన్ తొలి సెంచరీ, లీగ్ చరిత్రలో సన్ రైజర్స్ రికార్డు స్కోరు
KTR Comments: బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
Kishan Reddy: డీలిమిటేషన్‌పై ఇప్పటివరకు చట్టాలు చేసింది కాంగ్రెస్సే: కిషన్‌రెడ్డి
డీలిమిటేషన్‌పై ఇప్పటివరకు చట్టాలు చేసింది కాంగ్రెస్సే: కిషన్‌రెడ్డి
IPL Highest Scores: రికార్డులతో దుమ్మురేపుతున్న సన్‌రైజర్స్, ఐపీఎల్ చరిత్రలో టాప్ 10 రికార్డు స్కోర్లు చూశారా
రికార్డులతో దుమ్మురేపుతున్న సన్‌రైజర్స్, ఐపీఎల్ చరిత్రలో టాప్ 10 రికార్డు స్కోర్లు చూశారా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

SRH vs RR IPL 2025 Match Highlights | ఉప్పల్ లో తన రికార్డును తనే బ్రేక్ చేసిన సన్ రైజర్స్ | ABP DesamCSK vs MI IPL 2025 Match Preview | నేడు చెన్నైతో తలపడుతున్న ముంబై | ABP DesamSRH vs RR IPL 2025 Match Preview | రాజస్థాన్ రాయల్స్ ను ఢీకొట్టనున్న సన్ రైజర్స్ హైదరాబాద్ | ABP DesamFan Touched feet of Virat Kohli | KKR vs RCB మ్యాచ్ లో కొహ్లీపై అభిమాని పిచ్చి ప్రేమ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RR vs SRH Ishan Kishan Century: ఐపీఎల్‌లో ఇషాన్ కిషన్ తొలి సెంచరీ, లీగ్ చరిత్రలో సన్ రైజర్స్ రికార్డు స్కోరు
ఐపీఎల్‌లో ఇషాన్ కిషన్ తొలి సెంచరీ, లీగ్ చరిత్రలో సన్ రైజర్స్ రికార్డు స్కోరు
KTR Comments: బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
Kishan Reddy: డీలిమిటేషన్‌పై ఇప్పటివరకు చట్టాలు చేసింది కాంగ్రెస్సే: కిషన్‌రెడ్డి
డీలిమిటేషన్‌పై ఇప్పటివరకు చట్టాలు చేసింది కాంగ్రెస్సే: కిషన్‌రెడ్డి
IPL Highest Scores: రికార్డులతో దుమ్మురేపుతున్న సన్‌రైజర్స్, ఐపీఎల్ చరిత్రలో టాప్ 10 రికార్డు స్కోర్లు చూశారా
రికార్డులతో దుమ్మురేపుతున్న సన్‌రైజర్స్, ఐపీఎల్ చరిత్రలో టాప్ 10 రికార్డు స్కోర్లు చూశారా
Gayatri Bhargavi: ఆ థంబ్‌నైల్స్‌ ఏంటి? ఆర్మీకి ఇచ్చే గౌరవం ఇదేనా? మా ఆయన బతికే ఉన్నారు - నటి గాయత్రి భార్గవి
ఆ థంబ్‌నైల్స్‌ ఏంటి? ఆర్మీకి ఇచ్చే గౌరవం ఇదేనా? మా ఆయన బతికే ఉన్నారు - నటి గాయత్రి భార్గవి
Betting Apps Promotion: బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ వ్యవహారం - బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్‌లపై ఫిర్యాదు!
బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ వ్యవహారం - బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్‌లపై ఫిర్యాదు!
Indian Navy Recruitment: ఇండియన్ నేవీలో అగ్నివీర్ ఎస్‌ఎస్‌ఆర్‌ పోస్టులు, వివరాలు ఇలా
ఇండియన్ నేవీలో అగ్నివీర్ ఎస్‌ఎస్‌ఆర్‌ పోస్టులు, వివరాలు ఇలా
Bandi Sanjay: జీడీపీకి, డీలిమిటేషన్ కు లింకేంటి ? లిక్కర్ దొంగలు కలిశారంతే..!: చెన్నై సమావేశంపై బండి సంజయ్ ఫైర్
జీడీపీకి, డీలిమిటేషన్ కు లింకేంటి ? లిక్కర్ దొంగలు కలిశారంతే..!: చెన్నై సమావేశంపై బండి సంజయ్ ఫైర్
Embed widget