search
×

New Rules 2025: కొత్త సంవత్సరం, కొత్త రూల్స్‌ - అన్నీ నేరుగా మీ పాకెట్‌పై ప్రభావం చూపేవే!

Rules Changing In 2025: నూతన సంవత్సరంలో పింఛనుదార్లకు ఉపశమనం లభిస్తుంది. వంట గ్యాస్‌ సిలిండర్‌, కార్‌ వంటి వాటి రేట్లు కూడా మారతాయి.

FOLLOW US: 
Share:

New Year 2025: కొత్త సంవత్సరం 2025 ప్రారంభం కావడానికి వారం రోజుల సమయం కూడా లేదు. కొత్త సంవత్సరంతో పాటే కొన్ని కొత్త మార్పులు కూడా వస్తున్నాయి, అవి నేరుగా మీ జేబులోని డబ్బుపై ప్రభావం చూపుతాయి. ఆ మార్పుల్లో.. కార్ ధరలు, వంట గ్యాస్‌ సిలిండర్ ధర, పెన్షన్ సంబంధిత రూల్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్‌షిప్, యూపీఐ 123పే రూల్స్‌, FD సంబంధిత రూల్స్‌ ఉన్నాయి.

1. కార్‌ ధరల్లో పెరుగుదల
కొత్త సంవత్సరంలో కారు కొనాలంటే మరింత ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాలి. జనవరి 01, 2025 నుంచి... మారుతి సుజుకి, హ్యుందాయ్, మహీంద్రా, హోండా, మెర్సిడెస్-బెంజ్, ఆడి, BMW వంటి ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు వాహనాల ధరలను 3% వరకు పెంచుతాయి. ఉత్పత్తి వ్యయం పెరగడమే ఇందుకు కారణమని కంపెనీలు ఇప్పటికే వెల్లడించాయి. అందువల్ల, హ్యాపీ న్యూయర్‌లో హ్యాపీగా కొత్త కార్‌ కొనాలని మీరు ప్లాన్ చేస్తే, ఇంకొంచం ఎక్కువ ఖర్చు చేయాలి.

2. LPG సిలిండర్ ధరలు
ప్రతి నెల మొదటి తేదీన, చమురు మార్కెటింగ్ కంపెనీలు LPG ధరలను సమీక్షిస్తాయి. అయితే, దేశీయ ఎల్‌పీజీ సిలిండర్ (14.2 కిలోలు) ధర గత కొన్ని నెలలుగా మారలేదు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర 844.50 రూపాయలు. కొన్ని నెలలుగా వాణిజ్య సిలిండర్ల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర బ్యారెల్‌కు $73.58గా ఉంది, కొత్త సంవత్సరంలో మన దేశంలో గ్యాస్‌ ధరలు మారవచ్చు.

3. పెన్షన్ విత్‌డ్రాలో మార్పులు
కొత్త సంవత్సరంలో పింఛన్‌దార్లకు కొంత ఊరట ఉంటుంది. జనవరి 01, 2025 నుంచి, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పెన్షన్ ఉపసంహరణ నిబంధనలను సడలిస్తోంది. దీనివల్ల, పింఛనుదార్లు దేశంలోని ఏ బ్యాంక్‌ నుంచి అయినా పెన్షన్‌ను విత్‌డ్రా చేసుకోవచ్చు. దీని కోసం వారికి అదనపు ధృవీకరణ అవసరం లేదు. ఈ సదుపాయం పెన్షనర్లకు పెద్ద ఉపశమనం.

4. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ కొత్త రూల్స్‌
అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ నియమాలు జనవరి 01, 2025 నుంచి మారతాయి. కొత్త నిబంధనల ప్రకారం, ప్రైమ్ వీడియోను ఒక ప్రైమ్ ఖాతా నుంచి రెండు టీవీలలో మాత్రమే చూడవచ్చు. ఎవరైనా ప్రైమ్ వీడియోను మూడో టీవీలో చూడాలనుకుంటే, అదనపు సబ్‌స్క్రిప్షన్ తీసుకోవలసి ఉంటుంది. ఇప్పటి వరకు, ప్రైమ్ మెంబర్లు ఒకే ఖాతా ద్వారా ఐదు పరికరాల్లో వీడియోలు చూసే అవకాశం ఉంది.

5. ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) రూల్స్‌
NBFCలు, HFCల విషయంలో ఫిక్స్‌డ్ డిపాజిట్లకు సంబంధించిన నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్చింది. కొత్త నిబంధనలు జనవరి 01, 2025 నుంచి అమలులోకి వస్తాయి. డిపాజిట్ల భద్రతను పెంచేందుకు రూల్స్‌ మార్చారు. ప్రజల నుంచి డిపాజిట్లు తీసుకోవడం, లిక్విడ్ అసెట్స్‌లో కొంత భాగాన్ని సురక్షితంగా ఉంచడం, డిపాజిట్లకు బీమా చేయడం వంటి మార్పులు ఇందులో ఉన్నాయి.

6. UPI 123pay కొత్త లావాదేవీ పరిమితి
ఫీచర్ ఫోన్ వినియోగదార్ల కోసం RBI ప్రారంభించిన UPI 123Pay సర్వీస్‌లో లావాదేవీ పరిమితి పెరుగుతుంది. ఇప్పటి వరకు, ఈ సేవ కింద గరిష్టంగా రూ. 5,000 వరకు లావాదేవీలు చేయవచ్చు, ఈ పరిమితిని రూ.10,000కి పెంచారు. ఈ సదుపాయం జనవరి 01, 2025 నుంచి అమలులోకి వస్తుంది.

మరో ఆసక్తికర కథనం: అంబానీ నుంచి బజాజ్‌ వరకు - ఈ ఏడాది దేశంలో అత్యంత ధనవంతులు వీళ్లే!

Published at : 26 Dec 2024 12:46 PM (IST) Tags: LPG Cylinder Price Rules Change Business news in Telugu Car New Price 01 January 2025

ఇవి కూడా చూడండి

PF Loan: డబ్బు అవసరనప్పుడు ఆదుకునే PF లోన్‌ - దరఖాస్తు చేయడం సులభం

PF Loan: డబ్బు అవసరనప్పుడు ఆదుకునే PF లోన్‌ - దరఖాస్తు చేయడం సులభం

Income Tax Benifit: కుటుంబంతో కలిసి జాలీగా హాలిడే ట్రిప్స్‌ వేయండి, పన్ను మిహాయింపు పొందండి

Income Tax Benifit: కుటుంబంతో కలిసి జాలీగా హాలిడే ట్రిప్స్‌ వేయండి, పన్ను మిహాయింపు పొందండి

GST Relief on Insurance: జీవిత బీమా, ఆరోగ్య బీమాలపై తగ్గనున్న GST భారం! - త్వరలోనే నిర్ణయం

GST Relief on Insurance: జీవిత బీమా, ఆరోగ్య బీమాలపై తగ్గనున్న GST భారం! - త్వరలోనే నిర్ణయం

Gold-Silver Prices Today 21 Mar: భారీగా పతనమైన పసిడి రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ

Gold-Silver Prices Today 21 Mar: భారీగా పతనమైన పసిడి రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ

ITR filing: ఐటీఆర్‌ ఫైల్‌ చేసినవాళ్లు 9 కోట్ల మంది - కోటీశ్వరుల సంఖ్య తెలిస్తే ఆశ్చర్యపోతారు

ITR filing: ఐటీఆర్‌ ఫైల్‌ చేసినవాళ్లు 9 కోట్ల మంది - కోటీశ్వరుల సంఖ్య తెలిస్తే ఆశ్చర్యపోతారు

టాప్ స్టోరీస్

Revanth And KTR: బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!

Revanth And KTR: బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!

YS Viveka Case: వివేకా హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు - కేసును 6 నెలల్లోతేల్చాలని సునీత పిటిషన్

YS Viveka Case: వివేకా హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు - కేసును 6 నెలల్లోతేల్చాలని సునీత పిటిషన్

Telangana: సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి, హరీష్ రావు సమావేశాలు - అలాంటిదేమీ లేదని వివరణ

Telangana: సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి, హరీష్ రావు సమావేశాలు - అలాంటిదేమీ లేదని వివరణ

APPSC: 'గ్రూప్‌-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్‌ పరీక్షల షెడ్యూలు వెల్లడి- ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?

APPSC: 'గ్రూప్‌-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్‌ పరీక్షల షెడ్యూలు వెల్లడి- ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?