Year Ender 2024: అంబానీ నుంచి బజాజ్ వరకు - ఈ ఏడాది దేశంలో అత్యంత ధనవంతులు వీళ్లే!
Top 10 Richest People in India 2024: ఈ ఏడాది దేశంలోనే అత్యంత సంపన్నులుగా ముకేశ్ అంబానీ టాప్‌లో నిలిచారు. మరి మొదటి 10 మందిలో ఎవరు నిలిచారంటే...
Top 10 Richest People in India 2024: మనం 2024కి వీడ్కోలు పలికి నూతన సంవత్సరం 2025కు స్వాగతం పలికే ముందు, దేశంలోని మొదటి పది మంది సంపన్నులెవరో ఓసారి చూద్దాం. ఫోర్బ్స్ ఇండియా 'టాప్ 10 రిచెస్ట్ పీపుల్ ఇన్ ఇండియా 2024' జాబితా ప్రకారం, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ ఫస్ట్ ర్యాంక్‌లో ఉన్నారు.
2024లో భారతదేశంలో అత్యంత సంపన్న వ్యక్తులు:
ర్యాంక్ | పేరు | నికర విలువ | కంపెనీ |
1 | ముకేష్ అంబానీ | $119.5 బిలియన్లు | రిలయన్స్ ఇండస్ట్రీస్ |
2 | గౌతమ్ అదానీ | $116 బిలియన్లు | అదానీ ఎంటర్‌ప్రైజెస్ |
3 | సావిత్రి జిందాల్ | $43.7 బిలియన్లు | OP జిందాల్ గ్రూప్ |
4 | శివ నాడార్ | $40.2 బిలియన్లు | HCL టెక్నాలజీస్ |
5 | దిలీప్ సంఘ్వీ | $32.4 బిలియన్లు | సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ |
6 | రాధాకిషన్ దమాని | $31.5 బిలియన్లు | అవెన్యూ సూపర్‌మార్ట్స్ |
7 | సునీల్ మిట్టల్ | $30.7 బిలియన్లు | భారతి ఎయిర్‌టెల్ |
8 | కుమార్ మంగళం బిర్లా | $24.8 బిలియన్లు | ఆదిత్య బిర్లా గ్రూప్ |
9 | సైరస్ పూనావాలా | $24.5 బిలియన్లు | సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా |
10 | బజాజ్ కుటుంబం | $23.4 బిలియన్లు | బజాజ్ ఆటో |
ముకేష్ అంబానీ (Mukesh Ambani)
దేశంలో అతి పెద్ద బిజినెస్ గ్రూప్‌ల్లో ఒకటైన రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) మేనేజింగ్ డైరెక్టర్ & ఛైర్మన్ అయిన ముకేష్ అంబానీ భారతదేశంలో అత్యంత సంపన్న వ్యక్తి. పెట్రోకెమికల్స్, రిటైల్, టెలికాం, ఆయిల్ అండ్ గ్యాస్ వంటి రంగాల్లో రిలయన్స్ గ్రూప్ పని చేస్తోంది.
గౌతమ్ అదానీ (Gautam Adani)
అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు & ఛైర్మన్. ఓడరేవు కార్యకలాపాలు & అభివృద్ధిలో ఈ గ్రూప్ ప్రధానంగా పని చేస్తోంది. విద్యుత్ ఉత్పత్తి, ట్రాన్స్‌మిషన్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో కూడా ఉంది.
సావిత్రి జిందాల్ (Savitri Jindal)
భారతీయ రాజకీయవేత్త & వ్యవస్థాపకుడు OP జిందాల్ గ్రూప్ ఎమెరిటస్ చైర్‌గా వ్యవహరిస్తారు. ఉక్కు, మైనింగ్, విద్య, క్రీడలు వంటి రంగాల్లో ఈ గ్రూప్ పని చేస్తుంది. ఈ విభాగాలను జిందాల్ నలుగురు కుమారులు చూసుకుంటున్నారు.
శివ్ నాడార్ (Shiv Nadar)
HCL గ్రూప్ వ్యవస్థాపకుడు. HCL టెక్... మైక్రోసాఫ్ట్, బోయింగ్, సిస్కో వంటి క్లయింట్‌లకు సేవలు అందిస్తోంది.
దిలీప్ సంఘ్వీ (Dilip Shanghvi)
సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్‌ను నడిపిస్తున్న విజినరీ. $5 బిలియన్లుల విలువను చేరుకున్న మొదటి భారతీయ ఔషధ కంపెనీగా అది నిలిచింది.
రాధాకిషన్ దమాని (Radhakishan Damani)
దేశంలో DMart స్టోర్‌లను నిర్వహించే అవెన్యూ సూపర్‌మార్ట్స్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు. నేషనల్ సూపర్ మార్కెట్ వాల్యూ చైన్... కిరాణా వ్యాపారంలో పని చేస్తోంది, ప్రజలకు విభిన్న రకాల ఉత్పత్తులను అందిస్తంది.
సునీల్ మిట్టల్ (Sunil Mittal)
టెలికాం రంగ అగ్రగణ్యుడు. దేశంలోని అతి పెద్ద మొబైల్ ఫోన్ ఆపరేటర్లలో ఒకటైన భారతి ఎయిర్‌టెల్‌ను నిర్వహిస్తున్నారు. బీమా, టెలికాం, రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ, మాల్స్ రంగాల్లోనూ వ్యాపారాలు ఉన్నాయి.
సైరస్ పూనావాలా (Cyrus Poonawalla)
సెరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా యజమాని. దేశంలో వ్యాక్సిన్ డెవలప్‌మెంట్ పరిశ్రమలో ప్రధాన వ్యక్తి. మహమ్మారి సమయంలో తయారు చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్‌లు ఈ వ్యవస్థాపకుడి సంపదను పెంచాయి.
బజాజ్ కుటుంబం (Bajaj Family)
బజాజ్ ఫ్యామిలీ, బజాజ్ గ్రూప్ కింద 40 సంస్థల నెట్‌వర్క్‌ను నిర్వహిస్తోంది. ఈ గ్రూప్ ప్రధాన సంస్థ బజాజ్ ఆటో. ఇది బైక్‌లు తయారు చేస్తుంది.
మరో ఆసక్తికర కథనం: ఈ ఏడాది కన్నుమూసిన భారతీయ వ్యాపార దిగ్గజాలు - ఓసారి స్మరించుకుందాం