అన్వేషించండి

Indian Vessel Attack: ఒమన్ తీరంలో మరో భారతీయ నౌకపై మిస్సైల్ దాడి - సిబ్బంది సేఫ్ - ఎవరి పని?

Haji Ali Sunk: ఒమన్ తీరంలో భారత సరుకు రవాణా నౌకపై జరిగిన దాడి అంతర్జాతీయ స్థాయిలో కలకలం రేపుతోంది. నౌక మునిగిపోగా..సిబ్బంది క్షేమంగా బయటపడ్డారు.

Indian Cargo Vessel Haji Ali Sinks:  అంతర్జాతీయ సముద్ర జలాల్లో వాణిజ్య నౌకలపై దాడులు మరోసారి ఆందోళన కలిగిస్తున్నాయి. సోమాలియా నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్  కి  లోడ్‌తో వెళ్తున్న భారత సరుకు రవాణా నౌక హాజీ అలీ పై మే 13న ఒమన్ తీరానికి సమీపంలో దాడి జరిగింది. గుజరాత్‌లోని దేవభూమి ద్వారకా జిల్లా సలాయా పోర్టులో రిజిస్టర్ అయిన ఈ నౌక, ఒమన్‌లోని లిమా తీరానికి చేరుకోగానే డ్రోన్ లేదా క్షిపణి వంటి పేలుడు పదార్థం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నౌకలో భారీగా మంటలు చెలరేగి, క్రమంగా బ్యాలెన్స్ కోల్పోయి సముద్రంలో మునిగిపోయింది.

ఈ ఘోర ప్రమాదం జరిగిన సమయంలో నౌకలో మొత్తం 14 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. నౌక మునిగిపోతున్న క్రమంలో అప్రమత్తమైన ఒమన్ కోస్ట్ గార్డ్ అధికారులు తక్షణమే రక్షణ చర్యలు చేపట్టి, సిబ్బంది అందరినీ సురక్షితంగా రక్షించి దిబ్బా పోర్టుకు తరలించారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ  ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. వాణిజ్య నౌకలు , నావికులను లక్ష్యంగా చేసుకోవడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, అంతర్జాతీయ నిబంధనలకు ఇది విరుద్ధమని భారత్ స్పష్టం చేసింది. తమ పౌరులను రక్షించినందుకు ఒమన్ అధికారులకు భారత్ కృతజ్ఞతలు తెలిపింది.            

పశ్చిమాసియాలో గత ఫిబ్రవరి నుంచి కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా భారత నౌకపై దాడి జరగడం ఇది మూడోసారి. హోర్ముజ్ జలసంధి వంటి కీలక మార్గాల్లో ఇరాన్ ఆంక్షలు కఠినతరం చేయడం, మరోవైపు అమెరికా నౌకాదళ దిగ్బంధనం వంటి పరిణామాల మధ్య సముద్ర ప్రయాణాలు ప్రమాదకరంగా మారుతున్నాయి. ఈ ఉద్రిక్తతల వల్ల చమురు , సహజ వాయువు రవాణా ఖర్చులు పెరిగి భారత్ వంటి దిగుమతి దేశాలపై అదనపు భారం పడుతోంది. ప్రస్తుతం బ్రిక్స్ సమావేశాల కోసం భారత్ వచ్చిన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఈ ఘటనపై నేరుగా స్పందించనప్పటికీ, తమ నౌకాదళానికి సహకరించే నౌకలకు హోర్ముజ్ జలసంధి ఎప్పుడూ తెరిచే ఉంటుందని వ్యాఖ్యానించారు.

ప్రస్తుతానికి ఈ దాడికి ఎవరు పాల్పడ్డారనే విషయంపై అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. అయితే, వరుసగా జరుగుతున్న ఇటువంటి దాడులు భారత నౌకాయాన రంగాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. సముద్ర మార్గాల్లో భారతీయ నావికుల భద్రతను నిర్ధారించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దౌత్యపరమైన చర్చలను ముమ్మరం చేసింది.  కోర్టు విచారణలు, రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నా, అంతర్జాతీయ సరిహద్దుల్లో భారతీయుల ప్రాణాలకు రక్షణ కల్పించడం ఇప్పుడు అత్యంత ప్రాధాన్యతగా మారింది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్-మిర్యాలగూడలో అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్!
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్-మిర్యాలగూడలో అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్!
Priyanka Gandhi Parliament Speech: వారేమైనా తీవ్రవాదులా? - లోక్‌సభలో కేంద్రాన్ని నిలదీసిన ప్రియాంకా గాంధీ
వారేమైనా తీవ్రవాదులా? - లోక్‌సభలో కేంద్రాన్ని నిలదీసిన ప్రియాంకా గాంధీ
CM Vijay Office Shifted: ఆరు దశాబ్దాల సాంప్రదాయానికి బ్రేక్ - నూతన భవనంలోకి మారనున్న తమిళనాడు సీఎం విజయ్ ఆఫీస్!
ఆరు దశాబ్దాల సాంప్రదాయానికి బ్రేక్ - నూతన భవనంలోకి మారనున్న తమిళనాడు సీఎం విజయ్ ఆఫీస్!
Bank Holidays in August: ఆగస్టు 2026లో 14 రోజులు సెలవులు.. బ్యాంక్ పని ఉంటే హాలిడేస్ చెక్ చేసుకోండి
ఆగస్టు 2026లో 14 రోజులు సెలవులు.. బ్యాంక్ పని ఉంటే హాలిడేస్ చెక్ చేసుకోండి
Advertisement

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Bonda Uma TDP: అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ - త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
BCCI Coaching Sack: టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
Healthy Night Routine : మంచి నిద్ర కావాలంటే నైట్ రొటీన్ ఇలా సెట్ చేసుకోండి.. వైద్యులు సూచించే సింపుల్ అలవాట్లు ఇవే
మంచి నిద్ర కావాలంటే నైట్ రొటీన్ ఇలా సెట్ చేసుకోండి.. వైద్యులు సూచించే సింపుల్ అలవాట్లు ఇవే
Uday Krishna Reddy Arrest: పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ - మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు!
పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ - మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు!
PCOS vs Iron Deficiency : PCOS ఉంటే ఐరన్ తగ్గిపోతుందా? రెండింటి మధ్య సంబంధం ఏంటి? గైనకాలజిస్ట్ సూచనలివే
PCOS ఉంటే ఐరన్ తగ్గిపోతుందా? రెండింటి మధ్య సంబంధం ఏంటి? గైనకాలజిస్ట్ సూచనలివే
Embed widget