అన్వేషించండి

Indian Passport Fee Hike 2026: జులై 1 నుంచి పెరగనున్న పాస్‌పోర్ట్ ధరలు! ఏ కేటగిరీకి ఎంత రుసుం? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి!

Indian Passport Fee Hike 2026: కేంద్ర ప్రభుత్వం జులై 1 నుంచి పాస్‌పోర్‌ దరఖాస్తు ఫీజులను సవరించింది. సాధారణ 36పేజీల పాస్‌పోర్ట్ ధర 2500కి పెరిగింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కేంద్ర ప్రభుత్వం జులై 1 నుండి పాస్‌పోర్ట్ దరఖాస్తు ఫీజులు పెంచింది.
  • సాధారణ, తత్కాల్ పాస్‌పోర్ట్‌లు, పోయిన వాటికి కొత్త ధరలు వర్తిస్తాయి.
  • 36 పేజీల సాధారణ పాస్‌పోర్ట్ ఇప్పుడు ₹1500 నుండి ₹2500 అయింది.
  • మైనర్లకు, అనుబంధ సేవలకూ పెరిగిన కొత్త రుసుములు అమలులోకి వస్తాయి.

Indian Passport Fee Hike 2026: విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే భారతీయులకు కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన అప్‌డేట్‌ను అందించింది. పాస్‌పోర్ట్‌ నియమాలు, 2026 కింద వివిధ కేటగిరీల పాస్‌పోర్ట్‌ దరఖాస్తు ఫీజులను పెంచుతూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త ధరలు జులై 1 నుంచి అమలులోకి రానున్నాయి. ఒక దశాబ్ధానికిపైగా కాలం తర్వాత ఈ ఫీజులను సవరించడం ఇదే తొలిసారి. 

పాస్‌పోర్ట్ ధరల పెంపు

భారత్ ప్రభుత్వం చివరిసారిగా 2012లో పాస్‌పోర్ట్ ఫీజులను సవరించింది. అప్పట్లో సాధారణ 36 పేజీల పాస్‌పోర్ట్‌ ధరను 1000 నుంచి 1500 పెంచారు. దాదాపు 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత, ప్రస్తుత పరిపాలనా ఖర్చులు, సేవల మెరుగుదలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. జూన్ 20న జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, జులై 1 లేదా ఆ తర్వాత సమర్పించే అన్ని దరఖాస్తులకు ఈ కొత్త ధరలు వర్తిస్తాయి. 

కొత్త రుసుములు వివరాలు ఇలా ఉన్నాయి

36 పేజీల సాధారణ పాస్‌పోర్ట్‌ కోసం ప్రస్తుతం 1500 రూపాయలు ఫీజు వసూలు చేస్తున్నారు. ఇప్పుడు 2500 వసూలు చేయనున్నారు. 60 పేజీల సాధారణ పాస్‌పోర్ట్ కోసం ఇప్పటి వరకు 2000 రూపాయలు వసూలు చేస్తున్నారు.ఇకై 3500 రూపాయలు ఫీజు వసూలు చేయనున్నారు. తక్షణ అవసరాల కోసం దరఖాస్తు చేసుకునే వారికి 36పేజీల పాస్‌పోర్ట్ ధ 5000కు పెరిగింది. దీని కోసం గతంలో 3500 రూపాయలు చెల్లించేవారు. 60 పేజీల తత్కాల్‌ పాస్‌పోర్ట్ ధర 6000 రూపాయలకు పెరిగింది. గతంలో దీని కోసం నాలుగు వేల రూపాయలు వసూలు చేసేవారు. 

పాస్‌పోర్ట్ లాస్ అయితే!

పాస్‌పోర్ట్‌ను పోగొట్టుకున్నా, చోరీకి గురైనా లేదా పాడైపోయినా కొత్తది పొందడం ఇప్పుడు మరింత భారంగా మారింది. 36 పేజీల పాస్‌పోర్ట్ కోసం సాధారణ కేటగిరిలో ఐదు వేలు, తత్కాల్‌లో 7500 రూపాయలు వసూలు చేయనున్నారు. 60పేజీల పాస్‌ పోర్ట్ కోసం సాధారణ కేటగిరీలో 6000, తత్కాల్‌లో  8500 రూపాయలు వసూలు చేస్తారు. 

మైనర్ల కోసం ప్రత్యేక రాయితీలు 

18 ఏళ్ల లోపు ఉన్న మైనర్ల కోసం ప్రభుత్వం కొంత రాయితీని కొనసాగిస్తోంది. మైనర్లు కొత్త లేదా రీ ఇష్యూ 36 పేజీల పాస్‌పోర్ట్ ధర 1750 గా నిర్ణయించారు. తత్కాల్‌ పథకం కింద మైనర్లు పాస్‌పోర్ట్ రుసుము 4250గా ఉంటుంది. మైనర్‌ు తమ పాస్‌పోర్ట్ పోగొట్టుకుంటే, దాని భర్తీకి సాధారణ కేటగిరీలో 4250, తత్కాల్‌లో 6750 రూపాయలు చెల్లించాలి. 

ఇతర సేవల రుసుములు

పాస్‌పోర్ట్ ధరలతోపాటు ఇతర అనుబంధ సేవల ధరలను కూడా కేంద్రం సవరించింది. పోలీస్‌ క్లియరెన్స్ సర్టిఫికెట్ కోసం భారత్‌లో 750 రూపాయలు, విదేశాల్లో 40 డాలర్లను వసూలు చేయనున్నారు. సరెండర్ సర్టిఫికెట్‌, గ్లోబల్‌ ఎంట్రీ ప్రోగ్రామ్‌ వెరిఫికేన్ కోసం 750 రూపాయలు వసూలు చేస్తారు. సర్టిఫికెట్ ఆఫ్ ఐడెంటిటీ కోసం వెయ్యి రూపాయలు భారత్‌లో, విదేశాల్లో అయితే 50 డాలర్లు ఫీజుగా చెప్పారు. ఎమర్జెన్సీ సర్టిఫికెట్‌ భారత్‌లో ఉచితంగా ఇస్తారు. విదేశాల్లో దరఖాస్తు చేసుకుంటే 15 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. 

Frequently Asked Questions

పాస్‌పోర్ట్ దరఖాస్తు ఫీజుల పెంపు ఎప్పటి నుండి అమలులోకి వస్తుంది?

జులై 1, 2024 నుండి పాస్‌పోర్ట్ దరఖాస్తు ఫీజుల పెంపు అమలులోకి వస్తుంది. జూన్ 20న జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఈ తేదీ లేదా ఆ తర్వాత సమర్పించే అన్ని దరఖాస్తులకు కొత్త ధరలు వర్తిస్తాయి.

సాధారణ 36 పేజీల పాస్‌పోర్ట్‌కు కొత్త ఫీజు ఎంత?

36 పేజీల సాధారణ పాస్‌పోర్ట్ కోసం ప్రస్తుతం ₹1500 వసూలు చేస్తున్నారు. జులై 1 నుండి దీని కొత్త ఫీజు ₹2500 అవుతుంది.

పాస్‌పోర్ట్ పోగొట్టుకుంటే లేదా దెబ్బతింటే కొత్తది పొందడానికి ఎంత ఖర్చవుతుంది?

36 పేజీల పాస్‌పోర్ట్ పోగొట్టుకుంటే సాధారణ కేటగిరీలో ₹5000, తత్కాల్‌లో ₹7500 అవుతుంది. 60 పేజీల పాస్‌పోర్ట్‌కు ధరలు మరింత ఎక్కువగా ఉంటాయి.

మైనర్ల కోసం కొత్త పాస్‌పోర్ట్ లేదా రీ-ఇష్యూ రుసుము ఎంత?

18 ఏళ్ల లోపు మైనర్లకు కొత్త లేదా రీ-ఇష్యూ 36 పేజీల పాస్‌పోర్ట్ ధర ₹1750. తత్కాల్ పథకం కింద దీని రుసుము ₹4250.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పార్టీ మారడం లేదన్న మాజీ మంత్రి మల్లారెడ్డి.. కేక్ కట్ చేసి కేటీఆర్ బర్త్‌డే సెలబ్రేషన్
పార్టీ మారడం లేదన్న మాజీ మంత్రి మల్లారెడ్డి.. కేక్ కట్ చేసి కేటీఆర్ బర్త్‌డే సెలబ్రేషన్
Paper Leak New Bill: పేపర్ లీక్‌ బిల్లు.. బాధ్యులకు 10 సంవత్సరాల జైలు శిక్ష, 1 కోటి రూపాయల జరిమానా !
పేపర్ లీక్‌ బిల్లు.. బాధ్యులకు 10 సంవత్సరాల జైలు శిక్ష, 1 కోటి రూపాయల జరిమానా !
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
PM Modi On Paper Leak: పేపర్ లీక్‌లపై ప్రత్యేక బిల్లు తెస్తామన్న ప్రధాని మోదీ.. అర్ధరాత్రి దీక్ష విరమించిన వాంగ్‌చుక్
పేపర్ లీక్‌లపై ప్రత్యేక బిల్లు తెస్తామన్న ప్రధాని మోదీ.. అర్ధరాత్రి దీక్ష విరమించిన వాంగ్‌చుక్
Advertisement

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
జీవితంలో మొదటి కారు కొనేవారికి మహీంద్రా XUV 3XO ఎందుకు ఉత్తమ ఎంపిక?, రూ.10 లక్షల్లో వచ్చేస్తుంది
రూ.10 లక్షల బడ్జెట్‌లో ఫస్ట్‌ కార్‌ కొనాలనుకుంటున్నారా? డిజైర్‌, నెక్సాన్‌, పంచ్‌, XUV 3XOలో బెస్ట్ ఛాయిస్ ఇదే!
AP Local Body Direct Elections: ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
Chittoor Crime News: రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
Embed widget