దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ (NEET) పేపర్ లీక్ అంశంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ప్రత్యేక చట్టం, బిల్లు తీసుకురానున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.