అన్వేషించండి

Petrol Diesel Price Hike: చమురుపై అగ్ర దేశాలు 50 శాతం వడ్డిస్తే భారత్‌ ప్రభుత్వం రూ.3లతో సరిపెట్టింది! విమర్శించే ముందు తేడా తెలుసుకోండి!

ప్రపంచమంతా చమురు సంక్షోభం ఎదుర్కొంటోంది. ఇప్పటికే చాలా దేశాలు తమ పౌరులపై భారాన్ని మోపాయి. ఇప్పుడు భారత్‌ చమురుపై మూడు రూపాయలు పెంచింది. ప్రపంచ దేశాలతో చూస్తే మాత్రం ఇది చాలా తక్కువనే చెప్పాలి. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ప్రజల ప్రయాణాలు తగ్గించాలని కేంద్రం సూచిస్తోంది.
  • ప్రపంచవ్యాప్తంగా 82 దేశాలు ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.
  • భారత్ లో చమురు ధరలు మూడు రూపాయలు మాత్రమే పెరిగాయి.
  • ప్రభుత్వం లీటరుకు 26 రూపాయల వరకు నష్టాన్ని భరిస్తోంది.

Petrol Diesel Price Hike: భారత్‌లో ప్రస్తుతానికి చమురు సంక్షోభం తీవ్రంగా లేదు. కానీ ముందు జాగ్రత్తగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. అందుకే ప్రజలకు ప్రయాణాలు తగ్గించాలని సూచిస్తోంది. అంతే కాకుండా చమురు ధర కూడా మూడు రూపాయలు పెంచింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఇలా ధరలు పెంచారు. అయితే ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా వ్యవస్థలు చిన్నాభిన్నమై, ధరలు మండిపోతున్న వేళ పెంచక తప్ప లేదు. ఇలా పెంచడం భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అగ్రరాజ్యాలు కూడా చమురు ధరలను పెంచాయి. అయితే వాటితో పోల్చుకుంటే మనకు పెంచింది చాలా తక్కువే. 

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 82 దేశాలు చమురు సంక్షోభం కారణంగా ఎమర్జెన్సీ ఆంక్షలు, రేషనింగ్‌ లేదా భారీ ధరల పెంపును అమలు చేస్తున్నాయి. అయితే భారత్ అటువంటి కఠిన నిర్ణయాలు తీసుకోకుండా కేవలం మూడు రూపాయలు మాత్రమే పెంచింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో చమురు ధరలు ఏ స్థాయిలో పెంచారో చూద్దాం. 

  • యూఏఈలో ఇంధన ధరలు ఏకంగా 52 శాతం పెంచారు.
  • అగ్రరాజ్యం అమెరికాలో 44శాతం మేర ధరలు హైక్ చేశారు. 
  • మయన్మార్‌లో పెట్రోల్‌పై 89.7 శాతం, డీజిల్‌పై 112.7 శాతం పెరిగింది. 
  • మలేసియాలో పెట్రోల్‌పై 56.9 శాతం, డీజిల్‌పై 71.2శాతం పెరిగింది. 
  • పాకిస్తాన్‌లో పెట్రోల్‌పై 54.9శాతం, డీజిల్‌పై 44.9శాతం పెరిగింది. 
  • యూఏఈలో పెట్రోల్‌పై 52.4 శాతం, డీజిల్‌పై 86.1 శాతం పెరిగింది. 
  • అమెరికాలో పెట్రోల్‌పై 44.5శాతం, డీజిల్‌పై 48.1 శాతం పెరిగింది. 
  • శ్రీలంకలో పెట్రోల్‌పై 38.2శాతం, డీజిల్‌పై 41.8శాతం పెరిగింది. 
  • కెనడాలో పెట్రోల్‌పై 31.9శాతం, డీజిల్‌పై 32.8శాతం పెరిగింది. 
  • యూకేలో పెట్రోల్‌పై 19.2శాతం, డీజిల్‌పై 34.2శాతం పెరిగింది. 
  • ఫ్రాన్స్‌లో పెట్రోల్‌పై 20.9శాతం, డీజిల్‌పై 31శాతం పెరిగింది. 
  • జపాన్‌లో పెట్రోల్‌పై 9.7శాతం, డీజిల్‌పై 11.2శాతం పెరిగింది. 

భారత్‌లో పెట్రోల్‌పై 3.2శాతం, డీజిల్‌పై 3.4శాతం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర బ్యారెల్‌కు వంద డాలర్లు దాటినప్పటికీ, భారత్‌ ప్రభుత్వం గత 76 రోజులుగా ధరలను స్థిరంగా ఉంచి వినియోగదారులకు ఊరటనిచ్చింది. 

లీటర్‌కు 26 రూపాయల భారం ప్రభుత్వంపై 

ఈ ధరల పెంపునకు ప్రధాన కారణం అంతర్జాతీయంగా నెలకున్న ఉద్రిక్తతలే. అమెరికా- ఇరాన్ మధ్య తలెత్తిన ఘర్షణల కారణంగా ప్రపంచంలోనే అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గం స్ట్రైట్ ఆఫ్‌ హార్మూజ్‌ మూసివేయడంతో రవాణాకు ఆటంకం కలిగింది. దీంతో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అంతే కాకుండా నౌకల ప్రయాణ ఖర్చులు కూడా భారీగా పెరిగాయి. పెరిగిన ధరలతో భారత్‌లో కూడా పెట్రోల్ డీజిల్ ధరలు 200 నుంచి 300 శాతం వరకు పెరగాల్సి ఉంటుందని అంచనా వేశారు. కానీ ప్రభుత్వం కనికరించింది. సామాన్యులపై భారం వేయకుండా కేవలం 3 రూపాయలతో సరిపెట్టింది. ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం పెట్రోల్‌పై లీటర్‌కు 26 రూపాయలు, డీజిల్‌పై 82 రూపాయలు చొప్పున నష్టాన్ని భరించాల్సి వస్తోంది. 

అంతర్జాతీయ సంక్షోభం వేళ ఇతర దేశాలు చేతులెత్తేసినా, భారత్ మాత్రం మూడు రూపాయలను మాత్రమే పెంచింది. అసలైన భారాన్ని ప్రభుత్వం భరిస్తోంది. అయితే భవిష్యత్‌లో పెంచే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 

Frequently Asked Questions

ప్రస్తుతం భారతదేశంలో చమురు సంక్షోభం తీవ్రంగా ఉందా?

ప్రస్తుతానికి భారతదేశంలో చమురు సంక్షోభం తీవ్రంగా లేదు. కానీ ముందు జాగ్రత్తగా కేంద్రం చమురు ధరను మూడు రూపాయలు పెంచింది.

భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత పెరిగాయి?

భారతదేశంలో పెట్రోల్ పై 3.2% మరియు డీజిల్ పై 3.4% పెరిగింది. ఇది సుమారు మూడు రూపాయలకు సమానం.

ప్రపంచవ్యాప్తంగా చమురు ధరల పెరుగుదలకు ప్రధాన కారణం ఏమిటి?

అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణల కారణంగా కీలక చమురు రవాణా మార్గం మూసివేయబడటం ధరల పెరుగుదలకు ప్రధాన కారణం.

ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో ధరల పెంపు ఎలా ఉంది?

భారతదేశంలో కేవలం మూడు రూపాయలు మాత్రమే పెంచగా, యూఏఈ, అమెరికా, మయన్మార్ వంటి దేశాలు 50% పైగా ధరలను పెంచాయి. భారత్ లోని పెంపు చాలా తక్కువ.

టాప్ హెడ్ లైన్స్

Independence Day 2026 PM Modi Speech Highlights: సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్‌!
సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్‌!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
CJP Instagram: స్వాతంత్య్ర దినోత్సవం రోజున సీజేఐకి షాక్! ఇన్‌స్టాగ్రామ్ ఖాతా డిలీట్‌! అభిజిత్ దీప్కే ఆగ్రహం !
స్వాతంత్య్ర దినోత్సవం రోజున సీజేఐకి షాక్! ఇన్‌స్టాగ్రామ్ ఖాతా డిలీట్‌! అభిజిత్ దీప్కే ఆగ్రహం !

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
PM Modi Sports Vision: 2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
Embed widget