Gyanvapi Mosque Row: 'జ్ఞానవాపి'పై సుప్రీం విచారణ- మసీదుకు ఒక్కసారిగా 700 మంది ముస్లింలు!
Gyanvapi Mosque Row: జ్ఞానవాపి మసీదులో శుక్రవారం ప్రార్థనల కోసం ముస్లింలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
Gyanvapi Mosque Row: జ్ఞానవాపి మసీదు వివాదంపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోన్న వేళ ఆ ప్రాంతంలో రద్దీ ఎక్కువైంది. శుక్రవారం ప్రార్థనలను పురస్కరించుకొని ముస్లింలు పెద్ద ఎత్తున మసీదుకు తరలివచ్చారు. అయితే ప్రస్తుత పరిస్థితుల కారణంగా మసీదులోకి ప్రార్థనల నిమిత్తం 30 మందిని మాత్రమే అనుమతించాలని నిబంధనలు ఉన్నాయి.
Varanasi | Devotees gathered outside Gyanvapi mosque to offer Friday prayers
— ANI UP/Uttarakhand (@ANINewsUP) May 20, 2022
Earlier today, the masjid committee had appealed to the people to come to the mosque in small numbers due to the sealing of the 'Wazukhana' pic.twitter.com/2Z58tusOi1
700 మంది
జ్ఞానవాపి మసీదు గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోన్న వేళ ఒక్కసారిగా 700 మంది వరకు ముస్లింలు అక్కడకు చేరుకున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు పెంచారు. మసీదు గేట్లను పోలీసులు మూసేశారు. ఈ మసీదు కాకుండా ప్రార్థనల కోసం మరో మసీదుకు వెళ్లాలని పోలీసులు సూచించారు.
సుప్రీం ఆదేశాలు
జ్ఞానవాపి మసీదు వివాదం కేసులో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసును సివిల్ కోర్టు నుంచి వారణాసి జిల్లా కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు తెలిపింది. ఈ కేసును ఉత్తర్‌ప్రదేశ్ జుడీషియల్ సర్వీసులో ఉన్న అత్యంత సీనియర్, అనుభవమున్న న్యాయమూర్తి విచారిస్తారని సుప్రీం కోర్టు పేర్కొంది.
మసీదులో సీల్ వేసిన ప్రాంతాన్ని అలానే ఉంచాలని ఆదేశించింది. ముస్లింలు యథావిధిగా మసీదు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ కేసుపై ఇటీవల తాము ఇచ్చిన ఆదేశాలు యథావిధిగా కొనసాగుతాయని సుప్రీం పేర్కొంది.
ఈ సర్వేలో కనిపించిన శివలింగం తదితర దేవతలను పూజించే హక్కులను కల్పించాలని హిందూ పక్షం దాఖలు చేసిన పిటిషన్‌పై కూడా విచారణ జరపాలని జిల్లా జడ్జిని ఆదేశించింది. ఈ మసీదుని నిర్వహిస్తున్న అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఈ ఆదేశాలను జారీ చేసింది.
Also Read: Mathura Krishna Janmabhoomi: శ్రీకృష్ణ జన్మభూమి వివాదమేంటి? హిందూ- ముస్లింల ఒప్పందంలో ఏముంది?