అన్వేషించండి

Currency Notes Shower: ఆ సింగర్‌ పాటలకు తట్టుకోలేక ముంచేశారు .. కరెన్సీ నోట్లతో - ఈ వీడియోలు చూస్తే ఆశ్చర్యపోతారు!

Gujarat Culture: గుజరాత్‌లో గాయకుడిపై కరెన్సీ నోట్ల వర్షం కురిపించారు. ఎంతగా అంటే అందులో ఆయన మునిగిపోయారు.

Gujarat Dayro Event Singer Showered With Currency Notes:  గుజరాతీ సంప్రదాయ సంగీత కచేరీ  డైరో అంటేనే నోట్ల వర్షానికి పెట్టింది పేరు. తాజాగా దేవభూమి ద్వారక జిల్లాలోని ఖంభాలియాలో జరిగిన  శ్రీమద్ భాగవత్ సప్తహ  వేడుకల్లో ఈ సంప్రదాయం మరోసారి వైరల్‌గా మారింది.  ప్రసిద్ధ జానపద గాయకుడు తన గాత్రంతో భక్తులను మైమరిపిస్తుండగా, వేదికపై ఉన్న వారు , ప్రేక్షకులు ఒక్కసారిగా కరెన్సీ నోట్లను గాలిలోకి విసిరారు. చూస్తుండగానే గాయకుడు నోట్ల కుప్ప కింద దాదాపుగా కూరుకుపోయారు. ఈ దృశ్యాన్ని చూసిన నెటిజన్లు  ఇది నోట్ల వర్షం కాదు, అక్షరాలా నోట్ల ప్రవాహం అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

 సామాజిక ప్రయోజనం కోసమే ఈ విరాళాలు 

కేవలం ఆడంబరం కోసమే ఇలా నోట్లు చల్లుతున్నారని అనుకుంటే పొరపాటే. ఈ ఈవెంట్ వెనుక ఒక గొప్ప సామాజిక లక్ష్యం ఉంది. ఈ కార్యక్రమంలో సేకరించిన ప్రతి పైసాను ఒక మంచి కార్యం కోసం వినియోగించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. వేదికపై కురిసిన నోట్లను , వచ్చిన విరాళాలను లెక్కించిన తర్వాత, ఈవెంట్ ఖర్చులను మినహాయించి మిగిలిన మొత్తం సొమ్మును అహిర్ ఛారిటబుల్ ట్రస్ట్ కు అందజేయనున్నారు.  

 బాలికల హాస్టల్ నిర్మాణం 

ఈ నిధులతో అహ్మదాబాద్‌లో  బాలికల హాస్టల్,  ఒక భారీ విద్యా  భవనాన్ని నిర్మించనున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే అహిర్ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థినులకు ఉన్నత విద్య కోసం వసతి కల్పించడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశ్యం. భక్తితో పాటు విద్యా దానానికి కూడా తోడ్పడాలనే ఉద్దేశంతోనే ప్రజలు ఇంత భారీ ఎత్తున నోట్లను చల్లారని నిర్వాహకులు వెల్లడించారు.

 గుజరాతీ సంస్కృతిలో భాగం 

గుజరాత్‌లోని సౌరాష్ట్ర ప్రాంతంలో ఇలాంటి  డైరో  కార్యక్రమాల్లో డబ్బులు చల్లడం అనేది ఒక పాత సంప్రదాయం. దీనిని అక్కడ  ఘోల్ అని పిలుస్తారు. ఇలా సేకరించిన సొమ్మును సాధారణంగా గోశాలల నిర్వహణకు, పేద పిల్లల చదువులకు ,  సామాజిక సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తారు. గతంలో కూడా బ్రిటీష్ గాయకుడు హెమ్ మంతన్ పటేల్ వంటి వారి కార్యక్రమాల్లో ఇలాగే కోట్ల రూపాయల నోట్లు చల్లిన సందర్భాలు ఉన్నాయి.  

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Breaking News: హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్మశానవాటిలో శిశువు మృతదేహం మాయం
హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్మశానవాటిలో శిశువు మృతదేహం మాయం
Fact Check: విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
Kiran Abbavaram: అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
Embed widget