అన్వేషించండి

Fali Sam Nariman: సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఫాలీ నారిమన్ కన్నుమూత

Fali S Nariman: సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఫాలీ నారీమన్ బుధవారం ఉదయం వృద్ధాప్య సంబంధిత సమస్యలతో ఢిల్లీలోని ఆయన స్వగృహంలో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

Eminent Jurist Fali S Nariman Passes Away: ప్రముఖ న్యాయ నిపుణుడు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఫాలీ నారీమన్ (95) (Fali S Nariman) కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో ఢిల్లీలోని (Delhi) ఆయన స్వగృహంలో బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. బాంబే హైకోర్టులో న్యాయవాదిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించిన నారీమన్.. 22 ఏళ్ల పాటు ప్రాక్టీస్ చేశారు. అనంతరం సుప్రీంకోర్టు న్యాయవాదిగా నియమితులై ఢిల్లీ వెళ్లారు. 1972లో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను అడిషనల్ సొలిసిటర్ జనరల్ గా నియమించింది. 1975లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ ప్రకటించడాన్ని నిరసిస్తూ.. తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం 1991 నుంచి 2010 వరకూ బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగానూ పని చేశారు. భారత న్యాయ వ్యవస్థకు నారీమన్ ను భీష్మ పితామహుడిగా పిలుస్తారు. ఆయన కుమారుల్లో ఒకరైన జస్టిస్ రొహింటన్ నారీమన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పని చేశారు. 2011 నుంచి 2013 వరకూ ఆయన కూడా సొలిసిటర్ జనరల్ గా విధులు నిర్వర్తించారు. 

ఇదీ కుటుంబ నేపథ్యం

ఫాలీ నారీమన్ 1929 జనవరి 10న మయన్మార్ లో జన్మించారు. సిమ్లా, ముంబైలో విద్యాభ్యాసం కొనసాగించారు. తండ్రి ఆశయం కోసం సివిల్స్ ఎగ్జామ్స్ వైపు అడుగులేసిన ఆయన, చివరకు ఆర్థిక పరిస్థితులు సహరకరించక న్యాయవాది వృత్తి వైపు అడుగులేశారు. నారీమన్ ఓ గొప్ప రచయితగానూ గుర్తంపు పొందారు. 'బిఫోర్ ది మెమొరీ ఫేడ్స్', 'ది స్టేట్ ఆఫ్ ది నేషన్', 'ఇండియాస్ లీగల్ సిస్టమ్: కెన్ ఇట్ బి సేవ్డ్?', 'గాడ్ సేవ్ ది సుప్రీంకోర్టు' వంటి పుస్తకాలు రాశారు.

పలు అవార్డులు

అంతర్జాతీయ మధ్యవర్తిత్వంపై గుర్తింపు పొందిన న్యాయ నిపుణుడు ఫాలీ నారీమన్. న్యాయవాద వృత్తిలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1991లో పద్మభూషణ్, 2007లో పద్మ విభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. అలాగే, 1999 నుంచి 2005 వరకూ ఆయన రాజ్యసభ సభ్యుడిగానూ పని చేశారు. భారత రాజ్యాంగ చట్టం రూపకల్పనలోనూ కీలక పాత్ర పోషించడం సహా ఆయన తన కెరీర్ లో పలు కీలక కేసులను వాదించారు. గోలఖ్ నాథ్, ఎస్పీ గుప్తా, టీఎంఏ పై ఫౌండేషన్ వంటి కేసులను వాదించారు. ఇక భోపాల్ గ్యాస్ దుర్ఘటన కేసులో యూనియన్ కార్బైడ్ కంపెనీ తరఫున వాదించారు. అయితే అది పొరపాటని తర్వాత ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఉన్నత న్యాయవ్యవస్థలో న్యాయమూర్తుల నియామకాన్ని సుప్రీంకోర్టు స్వాధీనం చేసుకోవడానికి సంబంధించిన కేసైన సుప్రీంకోర్టు ఏవోఆర్ కేసును సైతం ఈయనే వాదించారు. 2014లో తమిళనాడు మాజీ సీఎం జయలలిత కేసులో వాదనలు వినిపించి ఆమెకు బెయిల్ ఇప్పించారు. 

నారీమన్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఒక తరం ముగిసిందంటూ ఆయన మృతి పట్ల కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వంటి న్యాయ నిపుణులు సంతాపం ప్రకటించారు.

Also Read: Ban On Onion Exports : దేశంలో ఉల్లి ఎగుమతులపై కొనసాగుతున్న నిషేధం- వదంతులపై స్పందించిన కేంద్రం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PV Sindhu Wedding: ఘనంగా పీవీ సింధు వివాహం, ఉదయ్‌పూర్‌లో గ్రాండ్ సెలబ్రేషన్స్
PV Sindhu Wedding: ఘనంగా పీవీ సింధు వివాహం, ఉదయ్‌పూర్‌లో గ్రాండ్ సెలబ్రేషన్స్
CM Revanth Reddy: 'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Weather Update Today: ఏపీలో 4 రోజులు భారీ వర్షాలతో అలర్ట్, మత్స్యకారులకు వార్నింగ్- తెలంగాణపై నో ఎఫెక్ట్
ఏపీలో 4 రోజులు భారీ వర్షాలతో అలర్ట్, మత్స్యకారులకు వార్నింగ్- తెలంగాణపై నో ఎఫెక్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP DesamAttack on Allu Arjun House | అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి | ABP Desam8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PV Sindhu Wedding: ఘనంగా పీవీ సింధు వివాహం, ఉదయ్‌పూర్‌లో గ్రాండ్ సెలబ్రేషన్స్
PV Sindhu Wedding: ఘనంగా పీవీ సింధు వివాహం, ఉదయ్‌పూర్‌లో గ్రాండ్ సెలబ్రేషన్స్
CM Revanth Reddy: 'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Weather Update Today: ఏపీలో 4 రోజులు భారీ వర్షాలతో అలర్ట్, మత్స్యకారులకు వార్నింగ్- తెలంగాణపై నో ఎఫెక్ట్
ఏపీలో 4 రోజులు భారీ వర్షాలతో అలర్ట్, మత్స్యకారులకు వార్నింగ్- తెలంగాణపై నో ఎఫెక్ట్
Sports Year Ender 2024: ఒలింపిక్స్ లో సత్తా చాటిన భారత పురుషుల హాకీ జట్టు.. ఆసియా చాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకున్న మహిళల జట్టు
ఒలింపిక్స్ లో సత్తా చాటిన భారత పురుషుల హాకీ జట్టు.. ఆసియా చాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకున్న మహిళల జట్టు
Allu Aravind: 'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
Guntur News: హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
Best Gifts For Christmas: రూ.2000 ధరలో బెస్ట్ క్రిస్మస్ గిఫ్ట్‌లు ఇవే - స్పీకర్ల నుంచి స్మార్ట్ వాచ్ దాకా!
రూ.2000 ధరలో బెస్ట్ క్రిస్మస్ గిఫ్ట్‌లు ఇవే - స్పీకర్ల నుంచి స్మార్ట్ వాచ్ దాకా!
Embed widget