అన్వేషించండి

Dharmendra Pradhan Letter Summary: ధర్మేంద్ర ప్రధాన్ దేశ యువతకు రాసిన లేఖలో ఏం ఉంది? పూర్తి వివరాలు ఇవే!

Dharmendra Pradhan Letter Summary: దేశ యువతపై తనకు నమ్మకం ఉందని, వారు గందరగోళానికి గురి కాకుండా ఉంటూ చదువుపై శ్రద్ధ పెట్టాలనే ఉద్దేశంతోనే రాజీనామా చేస్తున్నట్టు ఓపెన్ లెటర్ రాశారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • నీట్ పేపర్ లీక్ పై మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు.
  • యువత ఆకాంక్షలకు గౌరవమిస్తూ, నైతిక బాధ్యత వహించినట్లు తెలిపారు.
  • ప్రభుత్వం వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించి, పరీక్షలు రద్దు చేసింది.
  • విజయవంతంగా తిరిగి పరీక్షలు నిర్వహించి, విద్యార్థుల భవిష్యత్తు కాపాడింది.

Dharmendra Pradhan Letter Summary: నీట్ ప్రశ్నాపత్రం లీక్ అంశంపై నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేసిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దేశ యువతకు బహిరంగ లేఖ రాశారు. దేశ యువత ఆకాంక్షలను గౌరవిస్తూ తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఇంతకీ ఆయన రాసిన లేఖ పూర్తి సారాంశం ఇక్కడ చదవచ్చు. 

నా యువ మిత్రులారా,

నాలుగు దశాబ్దాలకు పైగా, నేను విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యా సంస్కరణల కోసం అంకితమై పని చేశాను. పటిష్టమైన, సమ్మిళితమైన, దూరదృష్టితో కూడిన విద్యా వ్యవస్థే దేశానికి మూలస్తంభం అని నేను ఎల్లప్పుడూ నమ్ముతాను.

దేశ యువత ఆకాంక్షలను, భావాలను న్యాయమైన డిమాండ్ లను నేను ప్రగాఢంగా గౌరవిస్తాను. దేశ యువతరం కలలను సాకారం చేయడం మన రాజకీయ, సామాజిక జీవితాల్లో ఒక నైతిక నిబద్ధతగా ఉంది.

ప్రధానమంత్రి దూరదృష్టి గల నాయకత్వంలో దేశానికి సేవ చేసే అవకాశం కల్పించినందుకు నేను వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయితే, 2026 మే 3న జరిగిన నీట్-యూజీ (NEET-UG) పరీక్షకు సంబంధించి అవకతవకలు వెలుగులోకి వచ్చాయి.

ఈ విషయాన్ని వెంటనే సుమోటోగా స్వీకరించిన భారత ప్రభుత్వం, దర్యాప్తును సీబీఐకి అప్పగించి, పరీక్షను రద్దు చేసి, రీటెస్ట్ తేదీని ప్రకటించింది. అదనంగా, వచ్చే ఏడాది నుంచి ఈ పరీక్షను సీబీటీ (కంప్యూటర్ ఆధారిత పరీక్ష) విధానంలో నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.

ఈ సమయంలో 20 లక్షలకు పైగా విద్యార్థులకు సంబంధించిన పరీక్ష సజావుగా జరిగేలా చూడటమే మా ప్రధాన కర్తవ్యం. మేము సమైక్య ప్రభుత్వ విధానాన్ని అనుసరించి పనిచేశాం; కేంద్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా జిల్లా యంత్రాంగాలు కీలక పాత్ర పోషించాయి.

విద్యార్థులు, తల్లిదండ్రుల సహకారంతో, 2026 జూన్ 21న పరీక్ష విజయవంతంగా ముగిసింది. మొదటి రోజు నుంచే నేను పూర్తి బాధ్యత తీసుకున్నాను, ఈ పరిస్థితి నుంచి ఎన్నడూ వెనక్కి తగ్గలేదు. పరీక్ష పేపర్ లీకేజీ మాఫియా వల్ల ఏ ప్రతిభావంతుడైన విద్యార్థి నష్ట పోకడదని, ఏ విద్యార్థికి అన్యాయం జరగకూడదని నేను భావించారు. 

జూలై 16న ప్రకటించిన నీట్-యూజీ ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయి, నిరుపేద వర్గాలకు చెందిన ఎందరో ప్రతిభావంతులైన విద్యార్థులు విజయం సాధించారు. అయినప్పటికీ, ఈ సమయంలో కూడా, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న కొందరు వ్యక్తులు అడ్డంకులు సృష్టించి, విద్యార్థులను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించారు, ఇది నాకు తీవ్రమైన ఆవేదన కలిగించింది.

మన ప్రజాస్వామ్య శక్తిపై నాకు అచంచలమైన విశ్వాసం ఉంది, యువత ఆకాంక్షలను, కలలను, అంచనాలను నేను ఎంతగానో గౌరవిస్తాను. వారు కేవలం దేశ భవిష్యత్తు మాత్రమే కాదు; వారు నూతన, అభివృద్ధి చెందిన భారతానికి మార్గదర్శకులు, నిర్మాతలు, రూపశిల్పులు.

గడిచిన పది రోజుల ఘటనలతో నేను తీవ్రంగా బాధపడ్డాను. ఇది నాకు వ్యక్తిగత పరువుకు సంబంధించిన విషయం కాదు.  దేశ యువశక్తియే ఈ దేశానికి నిజమైన బలం. దేశ యువత గందరగోళంలో పడకుండా చూడాలన్నది నా సంకల్పం.

జంతర్ మంతర్ వద్ద, దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని, దేశ వ్యతిరేక శక్తులు దానిని దుర్వినియోగం చేయకుండా నిరోధించడం, జాతీయ ఐక్యతను పరిరక్షించడం, ఒక్క భారతీయ విద్యార్థి భవిష్యత్తు కూడా చట్టపరమైన చిక్కుల్లో పడకుండా చూడటం, మన పిల్లలు తమ సమయాన్ని చదువులకు కేటాయించి, తమ భవిష్యత్ ను నిర్మించుకోవడంపై దృష్టి పెట్టేలా చేయడం వంటి లక్ష్యాలతో నేను గౌరవనీయ ప్రధానమంత్రికి నా రాజీనామాను సమర్పించాను.

ప్రధానమంత్రి మార్గదర్శకత్వానికి, నమ్మకానికి, నిరంతర మద్దతుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మంత్రివర్గంలోని నా సహచరులందరికీ, విద్యాశాఖ అధికారులకు, సిబ్బందికి, నేను కలిసి పనిచేసే అవకాశం లభించిన వ్యక్తులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

దేశ సేవ నా జీవితంలో అత్యున్నత ప్రాధాన్యత; నేను ఎల్లప్పుడూ ఈ ఆశయానికి అంకితమై ఉంటాను. జగన్నాథ స్వామి ఆశీస్సులతో, భవిష్యత్తులో కూడా మాతృభూమి, ఒడిశా ప్రజలు, దేశ యువత ఆకాంక్షలను నెరవేర్చడానికి సాధ్యమైనంత నన్ను నేను అంకితం చేసుకుంటూనే ఉంటాను.

ఇట్లు, ధర్మేంద్ర ప్రధాన్.

Frequently Asked Questions

ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి ఎందుకు రాజీనామా చేశారు?

నీట్ ప్రశ్నాపత్రం లీక్ అంశంపై నైతిక బాధ్యత వహిస్తూ, దేశ యువత ఆకాంక్షలను గౌరవిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు.

నీట్ పరీక్ష అవకతవకలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది?

ప్రభుత్వం సుమోటోగా స్వీకరించి, దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. పరీక్షను రద్దు చేసి రీటెస్ట్ తేదీని ప్రకటించడంతో పాటు, వచ్చే ఏడాది నుండి సీబీటీ విధానంలో పరీక్ష నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.

నీట్ రీటెస్ట్ ఫలితాలు ఎలా ఉన్నాయి?

జూలై 16న ప్రకటించిన నీట్-యూజీ ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయి. నిరుపేద వర్గాలకు చెందిన ఎందరో ప్రతిభావంతులైన విద్యార్థులు విజయం సాధించారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

NDA Convenor Chandrababu?: ఎన్డీయే కూటమికి కొత్త కన్వీనర్ ఏర్పాటుకు మోదీ గ్రీన్ సిగ్నల్! రేసులో చంద్రబాబు!
ఎన్డీయే కూటమికి కొత్త కన్వీనర్ ఏర్పాటుకు మోదీ గ్రీన్ సిగ్నల్! రేసులో చంద్రబాబు!
Independence Day Quiz Questions : ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
Independence Day Speech : స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget