PM Modi: వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయండి, నెల రోజులు టైమ్ ఇచ్చిన ప్రధాని మోడీ
దేశంలో అత్యంత వెనుకబడిన ప్రాంతాల అభివృద్దే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పని చేస్తోంది. వెనుకబడిన ప్రాంతాలను గుర్తించి, వాటిని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతోంది.
దేశంలో అత్యంత వెనుకబడిన ప్రాంతాల అభివృద్దే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పని చేస్తోంది. దేశంలో అత్యంత వెనుకబడిన ప్రాంతాలను గుర్తించి, వాటిని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతోంది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా కేంద్రం తీసుకొచ్చిన ఆకాంక్ష జిల్లాల కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. సంకల్ప్ సప్తాహ్ పేరిట ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి మోడీ ప్రారంభించారు. ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నతాధికారులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కీలక సూచనలు చేశారు. తాము విధులు నిర్వర్తిస్తున్న ప్రాంతాల్లోనే, అత్యంత వెనుకబడిన 100 ప్రాంతాలను గుర్తించి అభివృద్ధి చేయాలని కోరారు. ఔత్సాహికులైన అధికారులను గుర్తించి, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి బాధ్యతలను అప్పగించాలనిన ఉన్నతాధికారులకు సూచించారు.
గతంలో వెనకబడిన జిల్లాల్లో పోస్టింగ్ అంటే, దాన్ని పనిష్మెంట్‌గా అధికారులు భావించే వారని ప్రధాని మోడీ తెలిపారు., అలాంటి స్థితి నుంచి సరికొత్త విధానాల ద్వారా వెనకబడిన ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం ఎలా అభివృద్ధి చేస్తోందో వివరించారు. యువ అధికారులు ఉద్యోగంలో చేరిన తొలినాళ్లలో వెనకబడిన ప్రాంతాల్లో సేవలందించాలని, నూతనోత్సాహంతో వాళ్లు పని చేయడమే ఈ మార్పులకు కారణమన్నారు. ఆశించిన స్థాయిలో పని చేసిన ఉద్యోగులకు తర్వాతి కాలంలో మంచి గుర్తింపు లభించిన విషయాన్ని ఈ సందర్భంగా వెల్లడించారు. కేంద్రం తీసుకొచ్చిన ఆకాంక్ష జిల్లాల విషయంలోనూ, ఇదే విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.
దేశవ్యాప్తంగా వెనుకబడిన 100 ప్రాంతాలను గుర్తించాలని కేంద్ర ప్రభుత్వంలో పని చేస్తున్న వివిధ శాఖల కార్యదర్శులకు సూచించారు. ఆయా ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రధాని తెలిపారు. అధికారులు ఎవరైతే బ్లాక్ లెవల్‌లో మంచి ఫలితాలు తీసుకొస్తారో వారికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. స్వతంత్ర భారత్‌లోని ఉత్తమమైన పది పథకాల్లో ఆకాంక్ష జిల్లాల కార్యక్రమం ప్రధానమైనదని మోడీ వెల్లడించారు. ఈ కార్యక్రమం కేవలం నీతి ఆయోగ్ కార్యక్రమంగా మిగిలిపోకూడదని స్పష్టం చేశారు. అధికారులు అభివృద్ధి 100 ప్రాంతాలు కచ్చితంగా జాతీయ సగటు అభివృద్ధి సూచీ అధిగమించాలని తెలిపారు. నెల వ్యవధిలో 100 వెనుకబడిన గ్రామాలను లేదా ప్రాంతాలను అభివృద్ధి చేసినట్లయితే, భవిష్యత్‌లో ఆ సంఖ్యను 1000కి పెంచడం పెద్ద కష్టమైన పనేం కాదన్నారు మోడీ.