Congress Protest: 21 గంటలు, 80 ప్రశ్నలు- వరుసగా మూడో రోజూ రాహుల్ గాంధీ విచారణ
Congress Protest: రాహుల్ గాంధీని వరుసగా మూడో రోజు కూడా విచారిస్తోంది. మరోవైపు కాంగ్రెస్.. ఈడీ కార్యాలయం ఎదుట నిరసనలు చేపట్టింది.
Congress Protest: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని వరుసగా మూడో రోజూ విచారిస్తోంది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. రెండో రోజుల్లో దాదాపు 21 గంటల పాటు రాహుల్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఇప్పటివరకు ఆయన 80 ప్రశ్నలకు సమాధానాలు చెప్పినట్లు సమాచారం. అయితే, రాహుల్ పదేపదే తన వాంగ్మూలాన్ని మార్చుకోవడం వల్ల విచారణ ఆలస్యమైందని సదరు వర్గాలు పేర్కొన్నాయి.
సోనియాను కలిసి
మంగళవారం ఉదయం 11 గంటలకు రాహుల్ ఈడీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. రాత్రి 11.30 గంటల వరకు ఈ విచారణ కొనసాగింది. అర్ధరాత్రి సమయంలో ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన రాహుల్.. తల్లి సోనియా గాంధీని చూసేందుకు నేరుగా ఆసుపత్రికి వెళ్లారు. ఆయన వెంట సోదరి ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఉన్నారు.
నిరసనలు
#WATCH | Delhi: Congress workers outside the Enforcement Directorate office burn tires in protest to the ED probe against party leader Rahul Gandhi in the National Herald case. pic.twitter.com/eG3Qnq57oX
— ANI (@ANI) June 15, 2022
మరోవైపు రాహుల్‌పై ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ దిల్లీలో కాంగ్రెస్ సీనియర్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. దీంతో ఈడీ కార్యాలయం సహా రాహుల్ నివాసం, కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈడీ ఆఫీస్ చుట్టూ 144 సెక్షన్ విధించారు. అయినా సరే కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు వెనక్కి తగ్గలేదు.
We demand an FIR be lodged, they be suspended & disciplinary inquiry be initiated. Today all Congress leaders will hold press conferences. Tomorrow Congress will gherao all Raj Bhavans across India. Protests will also be held at all District levels day after tomorrow: Surjewala pic.twitter.com/g2Ys6fwP8b
— ANI (@ANI) June 15, 2022
ఈడీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ కార్యకర్తలు టైర్లు కాల్చారు. మరోవైపు ఏఐసీసీ కార్యాలయంలోకి దిల్లీ పోలీసులు చొచ్చుకెళ్లి కొంతమంది నేతలను అరెస్ట్ చేసినట్లు కాంగ్రెస్ ఆరోపించింది. రాజస్థాన్ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
#WATCH Congress leader Sachin Pilot detained by police amid protests by party workers over the questioning of Rahul Gandhi by the Enforcement Directorate in the National Herald case#Delhi pic.twitter.com/smlKTJ62hS
— ANI (@ANI) June 15, 2022
పోలీసుల తీరుకు నిరసనగా దేశవ్యాప్తంగా రాజ్‌భవన్‌లను ముట్టడించాలని కాంగ్రెస్ పిలుపునిచ్చింది.
Also Read: Viral News: ఇంగ్లీష్‌లో 35 వచ్చాయ్ సర్, మ్యాథ్స్‌లో 36 వచ్చాయండి- కానీ కలెక్టర్ అయ్యారు కదా!