Viral News: ఇంగ్లీష్‌లో 35 వచ్చాయ్ సర్, మ్యాథ్స్‌లో 36 వచ్చాయండి- కానీ కలెక్టర్ అయ్యారు కదా!
Viral News: తక్కువ మార్కులు వస్తే ఆత్మహత్యలు చేసుకుంటున్న విద్యార్థులారా! ఈ కథ ఓసారి వినండి.
Viral News: పరీక్షల్లో ఫెయిల్ అయినా మార్కులు తక్కువ వచ్చినా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు విద్యార్థులు. పరీక్షల్లో ఫెయిల్ అయితే జీవితమే పోయిందనుకునే భావనలో పడిపోయారు పిల్లలు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెన్త్ క్లాస్ ఫలితాలు విడుదల చేసిన తర్వాత ఫెయిల్ అయ్యామనే బాధతో కొందరు పిల్లలు బలవన్మరణం పొందారు. మరికొందరు తమను ఎలాగైనా పాస్ చేయాలంటూ మీడియా ముందు బోరున విలపించారు. అలాంటి పిల్లలు ఈ కథ తప్పక తెలుసుకోవాలి.
పడి లేచిన కెరటం
ఆయన ఓ సాధారణ విద్యార్థి. అత్తెసరు మార్కులతో పది పాసైనవారు కూడా ఆ తర్వాత గొప్పగా రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించొచ్చని నిరూపించిన వ్యక్తి. ఇంగ్లీష్‌లో 35, గణితంలో 36.. ఇవీ ఎవరి మార్కులో తెలుసా. ఇది ఓ కలెక్టర్ మార్కుల జాబితా.
అవును ఇవి ప్రస్తుతం కలెక్టర్ (IAS) హోదాలో ఉన్న తుషార్ డి సుమేరా టెన్త్‌లో సాధించిన మార్కులు. పలు రాష్ట్రాల్లో పదో తరగతి ఫలితాలు విడుదలవుతోన్న వేళ సుమేరా ఫొటోతో పాటు ఆయన మార్కుల మెమోను మరో ఐఏఎస్ అధికారి ట్విట్టర్‌లో పంచుకున్నారు.
కుంగిపోవద్దు
తక్కువ మార్కులొస్తే పిల్లలు కుంగిపోవద్దని తెలియజేసేలా సుమేరా మార్కుల జాబితాను 2009 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అవనిశ్ శర్మ ట్వీట్ చేశారు.
भरूच के कलेक्टर तुषार सुमेरा ने अपनी दसवीं की मार्कशीट शेयर करते हुए लिखा है कि उन्हें दसवीं में सिर्फ पासिंग मार्क्स आए थे.
— Awanish Sharan (@AwanishSharan) June 11, 2022
उनके 100 में अंग्रेजी में 35, गणित में 36 और विज्ञान में 38 नंबर आए थे. ना सिर्फ पूरे गांव में बल्कि उस स्कूल में यह कहा गया कि यह कुछ नहीं कर सकते. pic.twitter.com/uzjKtcU02I
ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. అవనిశ్ శర్మ ట్వీట్‌కు సుమేరా స్పందిస్తూ ధన్యవాదాలు తెలియజేశారు. 2012 బ్యాచ్‌కు చెందిన సుమేరా ప్రస్తుతం గుజరాత్‌లోని భరుచ్ జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆర్ట్స్‌లో డిగ్రీ పూర్తి చేసిన ఆయన యూపీఎస్సీలో ర్యాంకు సాధించారు.
Also Read: Covid Update: దేశంలో కొత్తగా 8,822 కరోనా కేసులు- ఎంత మంది మృతి చెందారంటే?